ముగిసిన కార్పొరేషన్‌ల పోలింగ్ | ends the corporations pollings | Sakshi
Sakshi News home page

ముగిసిన కార్పొరేషన్‌ల పోలింగ్

Apr 22 2015 10:46 PM | Updated on Sep 17 2018 6:08 PM

నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లకు బుధవారం జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది...

- ఎన్‌ఎంసీలో52 శాతం, ఏఎంసీలో-- పోలింగ్ నమోదు  ఓటర్ల నుంచి మిశ్రమ స్పందన
- నేడే ఓట్ల లెక్కింపు.. సాయంత్రానికల్లా ఫలితాలు
- చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతం
 సాక్షి, ముంబై:
నవీముంబై, ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లకు బుధవారం జరిగిన పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చోట్ల పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనండంతో పోలీసులు సిబ్బందిని పంపి గట్టి బందోబస్తు నిర్వహించారు. బద్లాపూర్‌లో రాజకీయ వేడి పెరిగి పోవడంతో అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా పనిచేశారు. అయితే ఈ సారి ఓటర్ల నుంచి మిశ్రమ లభించింది.

నవీముంబైలో 52 శాతం, ఔరంగాబాద్‌లో 47 శాతం పోలింగ్ నమోదైంది. ఇరు కార్పొరేషన్లలో ఓటింగ్ తక్కువ నమోదు కావడానికి ప్రధాన కారణం వేసవి సెలవులే అని స్పష్టమవుతోంది. సెలవుల కారణంగా అనేక మంది స్వగ్రామాలకు వెళ్లిపోవడం, అలాగే కూలి పనులకు, చిన్న చితక ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు లేకపోవడం ఒక కారణమైతే ఎండల కారణంగా ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడం రెండో కారణమని తెలుస్తోంది.

నవీముంబైలో..
నవీముంబైలో ఉన్న 111 వార్డులకు మొత్తం 568 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధా న పార్టీలైన శివసేన 68, బీజేపీ 43, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 107, కాంగ్రెస్ 89, ఆర్పీఐ (ఆఠావలే వర్గం) 14 వార్డుల్లో పోటీ చేశాయి. ఇక్కడ మొత్తం 4,55,551 పురుష ఓటర్లుండగా 3,59,516 మహిళ ఓటర్లున్నారు. 774 ఎన్నికల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు 4,466 అధికారులు, సిబ్బందిని నియమించారు.

ఔరంగాబాద్‌లో
ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఉన్న 113 వార్డులకు మొత్తం 900 మంది అభ్యర్థులు బరిలో దిగారు. శివసేన 64, బీజేపీ 49, కాంగ్రెస్ 110, ఎన్సీపీ 70, ఎంఐఎం 53 వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలో దింపాయి. ఔరంగాబాద్‌లో ఈ ఎన్నికల్లో ఓట్లు చీలిపోనుండటంతో అధికారం చేజిక్కించుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే సూచనలు కనిపించడం లేదు. మొత్తం 11.75 లక్షల జనాభా ఉండగా 8.12 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,30,635 పురుష ఓటర్లుండగా 3,85,305 మహిళ ఓటర్లున్నారు.

మొత్తం 657 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 31 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుండగా, 11 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 12 వందల నుంచి 14 వందల మంది ఓటు వేస్తారు. ఉదయం నుంచి మందకోడిగానే సాగుతూ వస్తున్న పోలింగ్ ప్రక్రియా మధ్యాహ్నానికి కేవలం 26 శాతం వరకు నమోదైంది.

పోలింగ్ సమయంలో ఉద్రిక్తత..
బైజీపూరా పోలింగ్ కేంద్రం వద్ద రాళ్లు రువ్వుకున్న సంఘటన జరిగింది. దీంతో వెంటనే పోలీసు బందోబస్తును మరింత పెంచారు. నాగేశ్వర్‌వాడిలో అభ్యర్థి ఇంటిపై రాళ్లు రువ్వినట్లు సమాచారం. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రాలవద్ద అభ్యర్థుల మద్దతుదారులు ప్రచారం చేసినట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఓ పార్టీ గుర్తున్న చేతి రుమాలు పట్టుకుని తిరుగుతున్న 10 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిడ్కో పోలింగ్ కేంద్రం వద్ద ఓ అధికారి నిర్వాకంవల్ల ఓటింగ్ ప్రక్రియ దాదా పు 15 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది.

ఎన్నికల సంఘంపై ఎంఐఎం ఎమ్మెల్యే ఆగ్రహం
ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ కేంద్ర ఎన్నిల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు హక్కును వినియోగించుకుని పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. మన దేశంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత దారుణంగా తయారైందని విమర్శించారు.

ఔరంగాబాద్‌లో నకిలీ గుర్తింపు కార్డులు తయారుచేసి సుమారు 200 మంది ఓటర్లకు పంపిణీ చేసి నకిలీ ఓటు వేశారని ఆరోపించారు. రెండు రోజుల నుంచి డబ్బులు పంపిణీ జరుగుతోందని.. ఈ విషయం ఎన్నికల సంఘానికి తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయిందని ఆరోపించారు.

అంబర్‌నాథ్‌లో..
అంబర్‌నాథ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు బుధవారం జరిగిన ఎన్నికల్లో.....శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 57 స్థానాలుండగా ఇందులో మూడింటికి ఇదివరకే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం 54 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 316 మంది అభ్యర్థులు బరిలో దిగారు. శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎమ్మెన్నెస్ తదితర ప్రధాన పార్టీలు ఒంటరిగా బరిలో దిగినప్పటికీ ఎన్సీపీ, రిపబ్లికన్ పార్టీ (సెక్యులర్), ఆర్పీఐ (ఆఠావలే వర్గం) బీజేపితో కలసి పోటీచేస్తున్నాయి.

పోలింగ్ బూతుల్లో 950 మంది ప్రభుత్వ సిబ్బంది, 165 మంది బూత్ లెవల్ అధికారులు విధుల్లో ఉన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఒక అసిస్టెంట్ పోలీసు కమిషనర్, ఆరుగురు సీనియర్ పోలీసు అధికారులు, 22 మంది ఇన్‌స్పెక్టర్లు, 434 కానిస్టేబుళ్లను నియమించారు.

బద్లాపూర్‌లో..
బద్లాపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో -------- శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 47 వార్డులుండగా ఐదు వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. మిగతా 42 వార్డుల్లో మొత్తం 157 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 117 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 585 మంది సిబ్బంది, 117 మంది బూత్ లెవెల్ అధికారులను నియమించారు.

కొద్ది రోజులుగా బద్లాపూర్‌లో రాజకీయ వాతావరణం వేడిగా ఉండటంతో ఎన్నికల రోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఒక అసిస్టెంట్ పోలీసు కమిషనర్, 58 మంది అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, 606 కానిస్టేబుళ్లను నియమించారు. ఇక్కడి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద మొదటిసారిగా సీసీ టీవీ కెమరాలు ఏర్పాటు చేసినట్లు యూనిట్-4 డిప్యూటీ పోలీసు కమిషనర్ వసంత్ జాదవ్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement