యువీ రిటైర్మెంట్‌పై స్పందించిన మాజీ ప్రియురాలు! | Yuvraj Singh Ex Lover Kim Sharma Responds On His Retirement | Sakshi
Sakshi News home page

యువీ రిటైర్మెంట్‌పై స్పందించిన మాజీ ప్రియురాలు!

Jun 11 2019 10:29 AM | Updated on Jun 11 2019 2:17 PM

Yuvraj Singh Ex Lover Kim Sharma Responds On His Retirement - Sakshi

హేజల్‌ కీచ్‌, యువరాజ్‌, కిమ్‌ శర్మ

హేజల్‌ కీచ్‌తో నీ ప్రయాణం సాఫీగా సాగాలని..

‍ముంబై : భారత వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు పొందిన యువరాజ్‌ సింగ్‌ సోమవారం ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అతని రిటైర్మెంట్‌పై స్పందిస్తూ టీమిండియా ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. యువీతో గడిపిన సందర్భాలను నెమరువేసుకుంటూ.. అతని అద్భుత ఇన్నింగ్స్‌లను కొనియాడుతున్నారు. ఇదే క్రమంలో గతంలో యువీ ప్రియురాలంటూ ప్రచారం జరిగిన నటి కిమ్‌శర్మ అతని రిటైర్మెంట్‌పై స్పందించారు. భారత క్రికెట్‌కు యువీ చేసిన సేవలను కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. ‘యువీ అద్భుతంగా ఆడావు. నీ ఆట, రికార్డులు మరవలేనివి. హేజల్‌ కీచ్‌తో నీ మిగతా జీవితం కూడా ఇలానే విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని యువీని అభినందించారు. (చదవండి: యువరాజ్‌ గుడ్‌బై)

ఇక కిమ్‌ శర్మతోనే కాకుండా ప్రీతీ జింగానియా, మినిషా లంబా, షమితా శెట్టి, రియాసేన్‌, దీపిక పదుకొనె, ప్రీతీ జింటాలతో సైతం యువీ ఎఫైర్‌ నడిపాడని అప్పట్లో బాలీవుడ్‌ కోడైకూసింది. అయితే ప్రీతీ జింటా మాత్రం ఈ వార్తలను ఖండించింది. ‘ఎన్నిసార్లు చెప్పాలి. యువీతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని అప్పట్లో ప్రీతీ మీడియాపై మండిపడింది. ఇక కిమ్‌శర్మ తెలుగు హిట్‌ మూవీ ఖడ్గంతో పాటు, రామ్‌చరణ్‌ మగధీరలోని ఐటెం సాంగ్‌లో నటించారు. ( చదవండి: మైదానంలో ‘మహరాజు’)

ఇక రిటైర్‌ అవడానికి ముందు సచిన్‌ సలహా తీసుకోవడంతో పాటు సహచరులు జహీర్, భజ్జీ, వీరూలకు చెప్పానని, చాలా కాలం తర్వాత తన తండ్రితో కూడా సుదీర్ఘంగా మాట్లాడానని యువీ తెలిపాడు. ఇకపై ఆటను ఆస్వాదించేందుకే బయటి లీగ్‌ల్లో పాల్గొనాలనుకుంటున్నాని స్పష్టం చేశాడు. ఇక యువీ సతీమణి, నటి హేజల్‌ కీచ్‌ సైతం ‘ ఒక శకం ముగిసింది. నీవు నా భర్త అయినందుకు గర్వపడుతున్నాను. ఇప్పుడు మిగతా జీవితాన్ని ఆస్వాదించూ.. లవ్‌ యూ యువీ’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. (యువీ హార్ట్‌ టచింగ్‌ వీడియో.. వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement