వైరల్‌ వీడియో.. జనాలను భయపెట్టిన జిమ్‌ పరికరం

Viral Video of Outdoor Gym Equipment Moving By Itself - Sakshi

లక్నో: ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న ఈ వీడియోను చూస్తే.. ఒక్క క్షణం మనకు కూడా  నిజంగానే దెయ్యాలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఇంతకు ఈ వీడియోలో ఏం ఉందంటే.. ఓ పార్కులోని జిమ్‌ పరికరం దానంతట అదే కదులుతుంది. దాని చుట్టూ చేరిన పోలీసులు ఈ అసాధరణ విషయాన్ని వీడియో తీయడంలో నిమగ్నమయ్యారు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. నెటిజనులు దీని గురించి రకరకాల వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఎక్కువ మంది మాత్రం ‘మానవ ప్రయత్నం లేకుండా ఈ పరికరం కదులుతుంది అంటే ఖచ్చితంగా ఇది దెయ్యాల పనే’ అంటూ ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ వార్తలు జోరుగా షికారు చేస్తుండటంతో ఝాన్సీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇలా జరగడానికి గల కారణాన్ని వివరించారు.
 

‘ఓ పార్కులోని జిమ్‌ పరికరం దానంతట అదే కదులుతున్న వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది. ఝాన్సీ పోలీసులు ఇందుకు గల కారణాన్ని కనుగొన్నారు. గ్రీజు ఎక్కువ కావడంతో ఆ పరికరం దానంతట అదే కదులుతుంది. ఇది దెయ్యాల పని కాదు. దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయకండి ’అంటూ ఝాన్సీ పోలీసులు ట్వీట్‌ చేశారు. అసలు కారణం తెలియడంతో జనాలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top