మోదీతో నార్వే ప్రధాని భేటీ  | PM Narendra Modi Welcomes Norway PM Erna Solberg in Delhi | Sakshi
Sakshi News home page

మోదీతో నార్వే ప్రధాని భేటీ 

Jan 9 2019 2:03 AM | Updated on Jan 9 2019 2:03 AM

PM Narendra Modi Welcomes Norway PM Erna Solberg in Delhi - Sakshi

న్యూఢిల్లీ: సముద్ర ఆర్థిక వ్యవస్థపై సన్నిహితంగా సహకరించుకునేందుకు, స్థిరమైన ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు భారత్, నార్వేలు అంగీకరించాయి. నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్‌ మంగళవారం ప్రధాని మోదీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని నిర్ణయించారు. సముద్ర ఆర్థిక వ్యవస్థపై 2 దేశాల సంప్రదింపులకు వీలు కల్పించే ఎంవోయూపై వారు సంత కాలు చేశారు. సోమవారం భారత్‌ చేరుకున్న సోల్బెర్గ్‌కు మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లో విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు ఆమె ప్రధాని మోదీతో సమావేశ య్యారు. ‘పరస్పర సహకారానికి అవకాశమున్న అన్ని అంశాలను పరిశీలించాం. ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త శక్తిని, దిశానిర్దేశం చేసేందుకు గల మార్గాలను చర్చించాం’ అని ప్రధాని మోదీ ఓ ప్రకటనలో తెలిపారు.

దేశంలో రూ.84వేల కోట్ల (12 బిలియన్‌ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టేందుకు నార్వే ప్రధాని అంగీకరించారని వెల్లడించారు. దేశం లో నౌకా నిర్మాణం, నౌకాశ్రయాల అభివృద్ధి రంగాల్లో నార్వే కంపెనీలకు భారీగా అవకాశాలున్నాయన్నారు. ‘ఆర్థిక వ్యవస్థ, జన సంఖ్య దృష్ట్యా భారత్‌ లేకుండా ప్రపంచం స్థిరమైన ఆర్థిక లక్ష్యాలను సాధించలేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా కీలక భూమిక పోషిస్తోంది. నార్వే వంటి చిన్న దేశాలు భారత్‌ వంటి పెద్ద దేశంతో కలిసి పనిచేయడం చాలా అవసరం. 2 దేశాల భాగస్వామ్యం సానుకూల ధోరణితో సాగుతోంది’ అని సోల్బెర్గ్‌ తెలిపారు. వాతావరణ మార్పులు, ఆర్థిక అసమానతలు, శాంతి, న్యాయం వంటి 17 స్థిరమైన ఆర్థిక లక్ష్యాల(ఎస్‌డీజీ)ను సభ్యదేశాలకు ఐరాస నిర్దేశించింది.  

ఫోన్‌లో ట్రంప్, మోదీ చర్చలు
న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం ఫోన్‌లో సంభాషించు కున్నారు. భారత్‌తో అమెరికా వాణిజ్య లోటు పై ప్రధానంగా చర్చించిన ఇద్దరు నేతలు.. అంతర్యుద్ధంతో సతమతమవుతున్న అఫ్గాని స్తాన్‌ విషయంలో సహకారం పెంచుకోవా లని నిర్ణయించారు. కొత్త ఏడాది శుభాకాం క్షలు తెలుపుకున్న ఇరువురు.. 2018లో భారత్‌–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం అయినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ‘భారత్‌తో అమెరికా వాణిజ్య లోటు ను తగ్గించుకునేందుకుగల అవకాశాలపై ఇద్దరు చర్చించారు. 2 దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం 2019లో మరింత బలోపేతం కావాలని ఇద్దరు నేతలు అంగీకరించారు’ అని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

అఫ్గానిస్తాన్‌ విషయంలో సహకారం, ఇండో–పసిఫిక్‌ ప్రాంత భద్రత, అభి వృద్ధిలో సహకారం మరింత విస్తృతం చేసుకునేందుకు మోదీ, ట్రంప్‌ అంగీ కరించారని కూడా వైట్‌ హౌస్‌ పేర్కొంది. ‘రెండు దేశాల మంత్రుల స్థాయి 2+2 చర్చలు, అమెరికా, జపాన్, భారత్‌ నేతల త్రైపాక్షిక చర్చలతో సాధించిన పురోగతిని ట్రంప్, మోదీ ప్రశంసించారు’ అని భారత ప్రధాని కార్యాలయం పేర్కొంది. భారత్‌తో అమెరికా వస్తు సేవల లావాదేవీలు 2017లో 126.2 బిలియన్‌ డాలర్ల మేరకు జరగ్గా ఇందులో అమెరికా ఎగుమతులు 49.4 బిలి యన్‌ డాలర్లు, దిగుమతులు 76.7 బిలియన్‌ డాలర్లు. అంతిమంగా 2017లో భారత్‌తో అమెరికా వాణిజ్య లోటు 27.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement