‘ఈ రోజు తన ఆలోచనతోనే లేచాను’ | Manish Malhotra Shares Sushant Singh Rajput Before His First Ever Ramp Walk | Sakshi
Sakshi News home page

ఆ రోజు ప్రతిష్టాత్మక జ్ఞాపకం: మనీష్‌ మల్హోత్రా

Published Tue, Jun 16 2020 10:33 AM | Last Updated on Tue, Jun 16 2020 11:01 AM

Manish Malhotra Shares Sushant Singh Rajput Before His First Ever Ramp Walk - Sakshi

ముంబై: ‘మీది మనోహరమైన నవ్వు.. స్నేహ పూర్వక మనస్తత్వం.. గొప్ప నటుడివి’ అంటూ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌తో చెప్పిన మాటాలను ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా గుర్తుచేసుకున్నారు.  2016లో తన ఫ్యాషన్ ప్రదర్శనలో షో టాపర్‌గా ర్యాంప్‌ చేసిన నాటి సంఘటనను ఆయన సోషల్‌ మీడియాలో సోమవారం పంచుకున్నాడు. సుశాంత్‌ ఫ్యాషన్‌ షోకు సంబందించిన వీడియోను షేర్‌ చేస్తూ.. ‘‘అప్పుడే  సుశాంత్‌ను మొదటిసారి కలిసాను. అతడిని చూడగానే నా కొత్త కలెక్షన్స్‌కు సరిగ్గా సరిపోతాడని భావించి ఫ్యాషన్‌ షోలో ర్యాంప్‌ చేయాలని కోరాను. దానికి సుశాంత్‌ అంగీకరించి వెంటనే డ్రస్‌ ఫిట్టింగ్‌ కోసం ఇంటికి వచ్చాడు. ఆ దుస్తుల్లో సుశాంత్‌ చాలా అందంగా ఉన్నాడు’’ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. (సుశాంత్‌ ఇంట మరో విషాదం)

అయితే ‘‘ర్యాంప్‌ వాక్ ‌కోసం ప్రాక్టిస్‌ చేస్తుండగా సుశాంత్‌ చాలా ఇబ్బంది పడ్డాడు. అప్పుడు నేను నువ్వు గొప్ప నుటుడివి, ప్రతిభావంతుడి.. నీ నవ్వు మనోహరంగా ఉంటుంది. షోలో నీ నవ్వును ప్రదర్శించు చాలు అని చెప్పాను. అలాగే చేశాడు. షో టాపర్‌గా సుశాంత్‌ అద్భుతంగా కనిపించాడు. ఆ రోజు ఎప్పటికీ ప్రతిష్టాత్మక జ్ఞాపకం. ఈ రోజు అతడి ఆలోచనతోనే లేచాను. అతడి మరణాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్న’’ అంటూ రాసుకొచ్చాడు. కాగా సుశాంత్‌ ముంబైలోని తన నివాసంలో సుశాంత్‌ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ టీవీ,‌ సినీ నటులు, కొద్ది మంది సన్నిహితుల మధ్య  ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సోమవారం సుశాంత్‌ అంత్యక్రియలు జరిగాయి. (రియా చక్రవర్తిని విచారించిన పోలీసులు)

I had met him only once before and then asked him to walk for the show as I felt he suited this collection. He immediately agreed and came home for fittings .. when he came for rehearsals he said he was nervous as he had not walked before and I remember telling him you are such a good actor you will be fine and just smile as your smile is endearing and charming .. He was wonderful in this show as he and @shraddhakapoor walked and made a lovely pair together and today this is a wonderful cherished memory forever .. I woke up this morning thinking about him & still can’t beileve it. It’s really sad and how I wish this had not happened. You will be dearly missed. #sushantsinghrajput #memories

A post shared by Manish Malhotra (@manishmalhotra05) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement