‘ఓ మై కడవులే’ కి‌ మహేష్‌ అ‌‌భినందనలు | Mahesh Babu Appreciate Oh My Kadavule Movie Team In Twitter | Sakshi
Sakshi News home page

‘ఓ మై కడవులే’ చిత్రానికి‌ మహేశ్‌ అ‌భినందనలు

Jul 19 2020 12:12 PM | Updated on Jul 19 2020 2:47 PM

Mahesh Babu Appreciate Oh My Kadavule Movie Team In Twitter - Sakshi

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ‘ఓ మై కడవులే’ తమిళ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదలైన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌లో భాగంగా ఇంటికే పరిమితమై మహేశ్ కుటుంబానికి సమయం కేటాయిస్తూ పిల్లలతో గడుపుతున్నారు. ఈ క్రమంలో జూలై 18న సూపర్‌ స్టార్.. ‘ఓ మై కడవులే’ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్‌లో చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. ‘ఓ మై కడవులే చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని నేను చాలా ఎంజాయ్‌ చేశాను. హీరో అశోక్‌ సెల్వన్‌ పెర్ఫార్మెన్స్‌ సూపర్‌, దర్శకుడు అశ్వత్ మారిముత్తు బ్రిలియంట్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అశోక్‌ చాలా సహజంగా కనిపించారు’ అని మహేశ్‌బాబు ట్విటర్‌లో ప్రశంసించారు. (ప్రతి ఇల్లు ఆమె అభిమాన సంఘమే)

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు అభినందనలకు ‘ఓ మై కడవులే’ చిత్రం యూనిట్‌ మొత్తం ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ మూవీలో కథానాయుకుడిగా నటించిన హీరో ఆశోక్‌ స్పందిస్తూ.. ‘థాంక్యూ సో మచ్‌ సర్‌! నేను మీకు పెద్ద అభిమానిని. మా సినిమాను మీరు చూసి అభినందిచటంతో నేను ఇక్కడ డ్యాన్స్‌ చేస్తున్నాను’ అని రీట్వీట్‌ చేశారు. అదే విధంగా ఈ చిత్రంలో కథానాయికగా నటించిన హీరోయిన్‌ రితికా సింగ్‌ స్పందిస్తూ.. ‘ఓ మై గాడ్‌. ఇది నిజమా?! థాంక్యూ సో మచ్‌ సర్‌! మీ నుంచి వచ్చిన అభినందనతో మాకు ఈ రోజు చాలా గోప్పగా మారింది’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఓ మై గాడ్‌!! మీకు నేను పెద్ద అభిమానిని, మీ అభినందనలతో నా మైడ్‌ బ్లాక్‌ అయిపోయది సర్‌’ అంటూ చిత్ర దర్శకుడు అశ్వత్ మారిముత్తు ట్విటర్‌లో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement