రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

Actress Ramya Marriage Plans in Karnataka - Sakshi

యశవంతపుర : శాండిల్‌వుడ్‌ నటి, మాజీ ఎంపీ రమ్య రాజకీయాలకు, సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. తన చిన్ననాటి స్నేహితుడు రఫెల్‌ను వివాహం చేసుకుని దుబాయిలో స్థిరపడాలని నిర్ణయించకున్నట్లు సమాచారం. ఆమె వివాహంపై సామాజిక మాధ్యమాలలో జోరుగా చర్చ సాగుతోంది. కన్నడ చిత్రసీమలో ప్రముఖుల సరసన నటించిన రమ్య 2013లో మండ్య లోకసభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సోషల్‌ మీడియా నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter |
తాజా సమాచారం కోసం డౌన్ లోడ్ చేసుకోండి

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top