
మన దేశ భవిష్యత్ ఇప్పుడు ఒక కొత్త తరం మీద ఆధారపడి ఉంది. వారే జనరేషన్ జెడ్. 1996–2000 మధ్య పుట్టిన వారిని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. మిలేనియల్స్‌కి, వీళ్లకి ఎంతో తేడా ఉంది. భారత్‌లో మాత్రమే కాదు ప్రపంచ దేశాల్లో అభివృద్ధిలో వారిదే కీలకపాత్ర. జనరేషన్ ఎక్స్(1965–80 మధ్య పుట్టినవారు) తరం తల్లిదండ్రుల చేతుల మీదుగా పెరిగిన వీరి ఆలోచన, అభిప్రాయాలు వ్యక్తం చేయడం ఇతర తరాలకి ఎన్నో తేడాలున్నాయి. ఈ మధ్య కాలంలో పలు సంస్థలు చేసిన సర్వేల్లో జెనరేషన్ జెడ్ స్వభావాల్ని అంచనా వేశాయి.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం..
ప్రస్తుతం జనరేషన్ జెడ్ జనాభా దాదాపుగా 10 కోట్ల వరకు ఉంటుంది.
జెనరేషన్ జడ్‌లో 25% మంది నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటూ సామాజిక బాధ్యత కలిగి ఉన్నారు.
ఆర్థిక మాంద్యం సమయంలో పెరిగి పెద్దవడంతో డబ్బుల్ని పొదుపు చేయాలన్న స్పృహ కలిగి ఉన్నారు.
మిగిలిన తరాలతో పోల్చి చూస్తే సహనం ఎక్కువ. ఆచరణ సాధ్యంగా ఉండాలని ప్రయత్నిస్తారు.
తమ వ్యక్తిగత ఆసక్తులు, కుటుంబానికి, తాము చేసే పనికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు.
అలాగే వీరిలో మానసిక సమస్యలూ ఎక్కువే. 35 శాతం మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు.