చెత్త వేయద్దన్నందుకు..చితక్కొట్టారు.. | Youngsters Attack Mother And Daughter In Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటిముందు చెత్త వేయద్దన్నందుకు..

Jul 3 2019 10:22 AM | Updated on Jul 3 2019 10:38 AM

Youngsters Attack Mother And Daughter In Hyderabad - Sakshi

మహిళపై దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన మహిళ కూతురిని...

సాక్షి, హైదరాబాద్‌ : తమ ఇంటిముందు చెత్త వేయవద్దని అన్నందుకు తల్లీకూతుళ్లపై దాడికి పాల్పడ్డారు కొందరు యువకులు. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ ఇంటి ముందు కొందరు యువకులు తరుచూ చెత్త వేస్తుండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం కూడా వారు చెత్త వేయటానికి ప్రయత్నించగా.. తన ఇంటిముందు చెత్త వేయవద్దని, చెత్తకుండీలో వేయండని ఆ మహిళ సదరు యువకులను కోరింది. అయితే ఆగ్రహించిన యువకులు మహిళపై దాడికి తెగబడ్డారు. అడ్డువచ్చిన మహిళ కూతురిని కూడా విచక్షణారహితంగా చితకబాదారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. యువకుల దాడిలో గాయపడిన తల్లీకూతుళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయండని అంటూ కన్నీరుమున్నీరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement