పోలీసులపై దాడి చేసి మరీ.. కూతురి కిడ్నాప్‌!

Family Kidnaps Own Daughter From Police Custody In UP - Sakshi

లక్నో : తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కారణంతో.. పోలీసు కస్టడీలో ఉన్న ఇంటి ఆడపడచును కిడ్నాప్‌ చేసిందో కుటుంబం. ఈ క్రమంలో తమకు అడ్డుపడిన పోలీసులను సైతం కొట్టి ఆమెను అపరించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. వివరాలు... ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ ముస్లిం యువతి.. ఇంట్లో నుంచి పారిపోయి... ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో చంపుతామని బెదిరించారు. ఈ క్రమంలో నవజంట పోలీసులను ఆశ్రయించింది. అయితే తమ అమ్మాయి మైనరు అని, ఈ పెళ్లి చెల్లదంటూ ఆమె కుటుంబ సభ్యులు వాదించారు. దీంతో అమ్మాయికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రికి తరలించాలని కోర్టు ముజఫర్‌ నగర్‌ పోలీసులను ఆదేశించింది.

ఈ నేపథ్యంలో పోలీసు కారులో ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించే క్రమంలో.. అడ్డగించిన కుటుంబ సభ్యులు కారు నుంచి ఆమెను లాక్కువెళ్లారు. ఆ సమయంలో అడ్డువచ్చిన పోలీసులను, స్థానికులపై కూడా దాడి చేశారు. కాగా సమీపంలో ఉన్న ఓ అడవిలో యువతి జాడ తెలియడంతో పోలీసులు ఆమెను మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top