జి.మాడుగులలో 100 కేజీల గంజాయి స్వాధీనం | vishakapatnam Police arrest three drug peddlars, seize ganja ... | Sakshi
Sakshi News home page

జి.మాడుగులలో 100 కేజీల గంజాయి స్వాధీనం

Sep 5 2013 10:27 AM | Updated on Sep 1 2017 10:28 PM

జి.మాడుగుల మండలం మత్సపురం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జి. మాడుగుల మండలం మత్సపురం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మాడుగుల పోలీస్ స్టేషన్కు తరలించి వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

 

అలాగే హైదరాబాద్లోని కూకట్పల్లిలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ప్రదీప్ బుధవారం ఆటోడ్రైవర్పై దురుసుగా ప్రవర్తించాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఆటోడ్రైవర్ పై కానిస్టేబుల్ దాడి చేశాడు. దాంతో ఆటో డ్రైవర్ కూకట్పల్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement