Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Director General Of Military Operations Press Meet Over Operation Sindoor1
మరోసారి కాల్పులు జరిపితే అంతు చూస్తాం..పాక్‌కు ఇండియన్‌ ఆర్మీ వార్నింగ్‌

ఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనే లక్ష్యంతో తలపెట్టిన ఆపరేషన్‌ సిందూర్‌తో సుమారు 100మందికి పైగా ఉగ్రవాదుల్ని హత మార్చినట్లు త్రివిధ దళాల డీజీఎంవోలు (డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రారంభించాంఉగ్రవాద శిబిరాలను మాత్రమే టార్గెట్‌ చేశాంఉగ్రవాద ట్రైనింగ్‌ సెంటర్లను ముందే గుర్తించాందాడికి ముందే ట్రైనింగ్‌ సెంటర్లను ఖాళీ చేశారుమురిద్కేలో ఉగ్రవాద ట్రైనింగ్‌ క్యాంపులను తొలిసారి నాశనం చేశాంఅజ్మల్‌ కసబ్‌,డేవిడ్‌ హెడ్లీ లాంటి వాళ్లు ఇక్కడే ట్రైనింగ్‌ తీసుకున్నారు9 ఉగ్రవాదుల క్యాంపులపై దాడి చేశాం100 మంది ఉగ్రవాదులు ఎయిర్‌ స్ట్రైక్‌లో హతమయ్యారుమేం ఎయిర్‌ స్ట్రైక్‌ చేసిన తర్వాత పీవోకే వద్ద పాక్‌ కాల్పులు జరిపిందిఉగ్రవాద శిబిరాలపై దాడి వీడియోలు, ఆ వీడియోల్ని విడుదల చేస్తున్నాంపాకిస్తాన్‌ మాత్రం ప్రార్ధనా స్థలాలు,స్కూళ్లను టార్గెట్‌ చేసింది.ఉగ్రవాదులు వారికి సంబంధించిన స్థలాలు మాత్రమే టార్గెట్‌ చేశాంలాహోర్‌ నుంచి డ్రోన్‌,యూఏవీలతో భారత ఎయిర్‌ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌ చేసింది.గైడెడ్‌ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను నాశనం చేశాం లాహోర్‌ నుంచి డ్రోన్‌,యూఏవీలతో భారత ఎయిర్‌ బేస్‌లను, ఆర్మీ క్యాంపులను టార్గెట్‌ చేసింది.గైడెడ్‌ మిస్సైల్స్‌తో ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేశాంలాహోర్‌లో ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టంను నాశనం చేశాంఈనెల 8,9వ తేదీవరకు శ్రీనగర్‌ నుంచి నలియా వరకు డ్రోన్‌లతో దాడులు చేసిందిఈ నెల 7 నుంచి 10వ తేదీల మధ్యలో 35 నుంచి 40 మంది పాక్‌ సైనికులు మృతి చెందారు మరోసారి ​కాల్పులు జరిపితే పాక్‌ను వదిలిపెట్టంనిన్న మధ్యాహ్నం 3.15గంటలకు పాక్‌ డీజీఎంవో మాకు ఫోన్‌ చేశారుకాల్పుల విమరణకు అంగీకరించాలని పాక్‌ ప్రాధేయ పడిందివిరమణకు అంగీకరించాంకాల్పుల విరమణకు అంగీకరించామో లేదో.. కొన్ని గంటల్లోనే పాక్‌ కాల్పులకు విమరణకు పాల్పడిందికాల్పులు జరిపింనందుకు పాక్‌కు వార్నింగ్‌ మెసేజ్‌ పంపాంఒకవేళ ఈ రోజు రాత్రి కాల్పులు జరిపితే పాక్‌పై దాడి చేసేందుకు ఇండియన్‌ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉందిమరోసారి కాల్పులు జరిపితే పాక్‌ అంతు చూస్తాంపాక్‌ కాల్పుల్లో చనిపోయిన సైనికులకు మా నివాళులుఆపరేషన్‌ సిందూర్‌లో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారుభారత సైనికుల త్యాగం వృధా కాదుఈ రోజు రాత్రి ఏం జరుగుతుంతో మానిటర్‌ చేస్తున్నాం​

US Vice President JD Vance Called To PM Narendra Modi2
ప్రధాని మోదీకి జేడీ వాన్స్‌ ఫోన్‌

న్యూఢిల్లీ: -అగ్రరాజ్యం అమెరికా సాక్షిగా భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ చర్చలకు ముందు భారత ప్రధాని నరేంద్ర మోదీకి యూఎస్‌ఏ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలపై మోదీతో మాట్లాడారు జేడీ వాన్స్‌. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు జేడీ వాన్స్‌. అయితే పాక్‌ దాడి చేస్తే తాము దాడికి దిగుతామంటూ జేడీ వాన్స్‌కు మోదీ స్పష్టం చేశారు. తమ సంయమనం బలహీనత కాదని, దేశ భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని మోదీ పేర్కొన్నారు ఉగ్రవాదంపై రాజీపడే ప్రసక్తే లేదని జేడీ వాన్స్‌కు తేల్చిచెప్పారు నరేంద్ర మోదీ. రేపు(సోమవారం) పాకిస్తాన్‌ తో కాల్పుల విరమణ అంశానికి సంబంధించి చర్చలు జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్‌ ఫోన్‌ చేసి మాట్లాడటం చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ నేతృత్వంలో భారత్‌-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అంశంపై చర్చలు జరుగునున్న తరుణంలో జేడీ వాన్స్‌ ముందగా పోన్‌ చేసి మోదీతో మాట్లాడారు. అయితే అంతకమునుపే కశ్మీర్‌ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పీవోకే విషయంలో భారత్‌ రాజీపడే ప్రసక్తే ఉండదన్నారు. దీనికి ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని అమెరికాకు పరోక్షంగా చెప్పేశారు మోదీ. పీవోకే తమదేనని, ఇందులో ఎవరు జోక్యం అవసరం లేదన్నారు. పీవోకేను తమకు అప్పగించడం ఒక్కటే పాకిస్తాన్‌ కు ఉన్న ఆప్షన్‌ అని మోదీ తెగేసి చెప్పేశారు. కాగా, భారత్, పాకిస్తాన్‌ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి. పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్‌.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్‌ కాదా?. అందుకు పహల్గామ్‌ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్‌ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్‌ సిందూర్‌ సిద్ధంగానే ఉందనే సంకేతాలు పంపింది భారత ప్రభుత్వం.

Road accident to Tirumala RTC bus at Chandragiri3
చంద్రగిరి వద్ద డివైడర్‌ను డీకొట్టిన బస్సు

తిరుపతి జిల్లా: చంద్రగిరి మండలం అగరాల నారాయణ కళాశాల సమీపంలో కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు35 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలుపలువురు పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపుడ్రైవర్, కండక్టర్‌కు తీవ్ర గాయాలువేలూరు నుంచి తిరుమలకు వస్తున్న తిరుమల ఆర్టీసీ బస్సుప్రమాదంలో నుజ్జు నుజైన బస్సునిత్ర మత్తులో డ్రైవింగ్‌ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానంబస్సులో చిక్కుకుపోయిన ప్రయానికులు, సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు

Talks with Pak only on return of PoK says PM Modi4
పీవోకే విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు: మోదీ

ఢిల్లీ: పీవోకేపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ విషయంలో తమ వైఖరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని తేల్చి చెప్పారు.. పీవోకేను మాకు అప్పగించడం తప్ప పాక్‌కు వేరే మార్గం లేదన్నారు మోదీ. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియ లేదని, పాక్‌ కాల్పులు జరిపితే భారత్‌ దాడులు చేయడం ఖాయమన్నారు.. ‘వాళ్లు (పాక్‌) ఒక్క తూటా పేలిస్తే.. మీరు క్షిపణితో దాడి చేయండి’ అంటూ త్రివిధ దళాలకు మోదీ ఫ్రీ హ్యాండ్‌ ఇచ్చారు. రేపు పాకిస్తాన్‌తో చర్చల వేళ భారత్‌ వైఖరి ఏమిటో ప్రధాని మోదీ ఒక్కరోజు ముందుగానే ప్రపంచానికి తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో అవసరమైతే తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు పీవోకే విషయంలో తమకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని, దానిని పాక్‌ తమకు అప్పగించడం తప్పితే మరో మార్గం లేదని మోదీ వ్యాఖ్యానిండంతో ట్రంప్‌ దీనికి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదనే విషయాన్ని మోదీ సూటిగా చెప్పేశారు.ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్,సీడీఎస్‌తో పాటు త్రివిధ దళాదిపతులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రధాని మోదీ పీవోకే విషయంలో ప్రపంచ దేశాలకు ఓ సందేశాన్ని పంపించారు. అదే సమయంలో పాక్‌కు గట్టిగా బదులివ్వాలని త్రివిధ దళాలకు ఆదేశాలివ్వడం సంచలనంగా మారింది #WATCH | Delhi: Prime Minister Narendra Modi chairs a meeting at 7, LKM. Defence Minister Rajnath Singh, EAM Dr S Jaishankar, NSA Ajit Doval, CDS, Chiefs of all three services present. pic.twitter.com/amcU1Cjmbu— ANI (@ANI) May 11, 2025కాగా, భారత్, పాకిస్తాన్‌ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్‌.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్‌ కాదా?. అందుకు పహల్గామ్‌ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్‌ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్‌ సిందూర్‌ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్‌.

Miss World Contestants for Nagarjunasagar this evening5
నేడు సాగర్‌.. రేపు చార్మినార్‌..

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం, పోటీదారుల భద్రత నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులు తొలుత సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్, అనంతరం పాత నగరంలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు కార్యక్రమాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇప్పుడు వాటిని యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు కొంత తగ్గిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించనున్నారు. స్వాగత విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక సోమవారం సాయంత్రం పోటీదారులు, విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్‌ సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అక్కడే రాత్రి విందు అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరతారు. చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకు నడక మంగళవారం సాయంత్రం పోటీదారులు చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్‌ చేస్తారు. చార్మినార్‌ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో ఇంటర్‌ కాంటినెంటల్, తెలంగాణ వంటకాలు విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌ ధమ్‌ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్‌ కీ ఘోష్, పనీర్‌ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్‌ జామూన్‌ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్‌ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. ఆసియా వంటకాలలో సుషీ (జపాన్‌), డిమ్‌సమ్‌ (చైనా), థాయ్‌ గ్రీన్‌ కర్రీ (థాయ్‌లాండ్‌) వంటివి, యూరోపియన్‌ వంటకాలైన ఇటాలియన్‌ పాస్తా, ఫ్రెంచ్‌ రాటటౌలీ, స్పానిష్‌ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్‌ టాకోస్, బ్రెజిలియన్‌ ఫెయిజోడా, అమెరికన్‌ బార్బెక్యూ రిబ్స్‌ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్‌ డోరో వాట్, మొరాకన్‌ టాగిన్, హమ్ముస్‌తో పాటు మెడిటరేనియన్‌ ఫలాఫెల్, క్వినోవా సలాడ్‌ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్‌లో జరిగే గలా డిన్నర్‌ సందర్భంగా తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌ కూడా ఉంటుందని చెబుతున్నారు.

Baloch fighters Sensational Comments On Pakistan6
పాక్‌పై బలూచ్‌ లిబరేషన్‌ ఆర్మీ కీలక ప్రకటన

మాంగోచార్‌ తమకు స్వతంత్ర దేశం కావాలని ఎప్పట్నుంచో డిమాండ్‌ చేస్తున్న బలూచ్‌ తిరుగుబాటు దారులు.. మరోసారి కీలక ప్రకటన చేశారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ డిమాండ్‌ చేశారు. అదే సమయంలో పాక్‌ ఉగ్రస్థావరాలపై దాడులకు దిగిన భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌పై భారత్‌ సైనిక చర్య తీసుకుంటే, పశ్చిమ సరిహద్దుల నుంచి పాక్‌పై తిరుగుబాటు చేస్తామన్నారు. భారత్‌కు సైనిక శక్తిగా నిలుస్తామంటూ ప్రకటించారు. పాకిస్తాన్‌లో 40 శాతం భూభాగం తమదేనని, తమకు ప్రత్యేక దేశం కావాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టారు. అవకాశం దొరికినప్పుడల్లా పాకిస్తాన్‌కు నిద్ర పట్టకుండా చేస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగ్రవాదులు ఏరివేతే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టగా, అందుకు బలూచ్‌ తిరుగుబాటుదారులు సైతం మద్దతు తెలుపుతున్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రదేశంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Mukesh Ambani World Largest Mango Farm Details7
అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?

భారతదేశంలో దాదాపు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారతీయ కుబేరుడు 'ముకేశ్ అంబానీ' గురించి అందరికి తెలుసు. కానీ ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారు కూడా అని కొంత మందికి మాత్రమే తెలిసి ఉంటుంది.ముకేశ్ అంబానీకి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో సుమారు 600 ఎకరాల మామిడి తోట ఉంది. ఇక్కడ 200 కంటే ఎక్కువ మామిడి పండ్ల రకాలు ఉన్నట్లు సమాచారం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడితోట కావడం గమనార్హం. ఇందులో కేసర్, అల్ఫోన్సో, రత్న, సింధు, నీలం, ఆమ్రపాలి వంటి దేశీయ మామిడి జాతులు.. ఫ్లోరిడాకు చెందిన టామీ అట్కిన్స్, కెంట్ & ఇజ్రాయెల్ దేశానికి చెందిన లిల్లీ, కీట్, మాయా వంటి అంతర్జాతీయ రకాలు ఉన్నట్లు సమాచారం.ముకేశ్ అంబానీ మామిడి తోటలో ప్రతి ఏటా 600 టన్నుల కంటే ఎక్కువ అధిక నాణ్యత కలిగిన మామిడి పళ్ళు ఉత్పత్తి అవుతాయి. వీటిని రిలయన్స్ సంస్థ భారతదేశంలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తూ.. ఆసియాలోనే అతిపెద్ద మామిడి ఎగుమతిదారుగా రికార్డ్ సృష్టించింది.ఇదీ చదవండి: సీసం నుంచి గోల్డ్ ఉత్పత్తి: బంగారాన్ని బఠానీల్లా కొనేయొచ్చా?మామిడి తోట పెట్టడానికి కారణం1997లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని.. కాలుష్య నియంత్రణ మండలి తగిన చర్యలు తీసుకోవలసి వచ్చింది. అలాంటి సమయంలో అక్కడ మామిడి తోటను ఏర్పాటు చేయడం జరిగింది. అదే నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి తోటగా గుర్తింపు తెచ్చింది. ఈ మామిడి తోట ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం.

Virat Kohli most likely to confirm retirement: Reports8
మ‌న‌సు మార్చుకోని కోహ్లి.. త్వ‌ర‌లోనే రిటైర్మెంట్‌?

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లి టెస్టుల‌కు రిటైర్మెంట్ ప్ర‌కటించేందుకు సిద్ద‌మ‌య్యాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందే టెస్టు క్రికెట్ నుంచి కోహ్లి త‌ప్పుకుంటాడ‌ని, ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని బీసీసీఐకి తెలియ‌జేసిన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.ఈ క్ర‌మంలో క‌నీసం ఇంగ్లండ్ సిరీస్ వ‌ర‌కైనా కొన‌సాగేలా కోహ్లిని ఒప్పించేందుకు బీసీసీఐ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. చాలా మంది మాజీ క్రికెట‌ర్లు కూడా కోహ్లిని త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యంపై పున‌రాలోచ‌న చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ సిరీస్‌తోనే టీమిండియా 2025- 27 వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్ ప్రారంభం కానుంది. ఒకవేళ విరాట్ రిటైర్మెంట్ ప్రకటిస్తే, ఈసారి ఇంగ్లండ్‌కు వెళ్లే జ‌ట్టులో అనుభవం లేని యువ ఆట‌గాళ్లే ఉండే ఛాన్స్ ఉంది. ఈ క్ర‌మంలోనే బీసీసీఐ అత‌డి మ‌న‌సు మార్చేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.మ‌న‌సు మార్చుకోని కోహ్లి.. కానీ కోహ్లి మాత్రం రిటైర్మెంట్ దిశ‌గానే అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. విరాట్ త‌ను మొద‌ట తీసుకున్న నిర్ణ‌యానికే క‌ట్టుబ‌డి ఉన్నాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కోహ్లి త‌న టెస్టు రిటైర్మెంట్ విష‌యంపై వారాల క్రితమే సెలెక్టర్లకు సమాచారం ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో జ‌రిగే టెస్టు సిరీస్‌లో ఆడేలా అత‌డిని ఒప్పించడానికి బీసీసీఐ ప్ర‌య‌త్నిస్తోంది.కానీ అత‌డి మాత్రం త‌న నిర్ణ‌యాన్ని మార్చుకునేలా క‌న్పించ‌డం లేదు. వచ్చే వారం జరిగే సెలక్షన్ సమావేశంలో కోహ్లి కొన‌సాగుతాడా? లేదా అన్నది తేలిపోనుంది అని బీసీసీఐ వ‌ర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాయి. కాగా రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టికే టెస్టుల‌కు విడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. అత‌డి స్దానంలో భార‌త టెస్టు జట్టు కెప్టెన్‌గా శుబ్‌మ‌న్ గిల్ ఎంపికయ్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌కు భార‌త జ‌ట్టును మే 23న బీసీసీఐ ప్ర‌క‌టించ‌నుంది. విరాట్ ఇప్పటివరకు 123 టెస్టుల్లో భార‌త్‌ ప్రాతినిధ్యం వహించాడు. 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి.చ‌ద‌వండి: IND vs SL: ముక్కోణ‌పు వ‌న్డే సిరీస్ విజేత‌గా భార‌త్.. ఫైన‌ల్లో శ్రీలంక చిత్తు

Samantha says fans asked her for a pic on the day my dad no more9
నాన్న మరణించిన రోజు.. నవ్వుతూ ఫోటోలు దిగా: సమంత

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడు హీరోయిన్ మాత్రమే కాదు.. నిర్మాత కూడా. శుభం మూవీతో నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇ‍చ్చింది. ప్రస్తుతం ఆమె నిర్మించిన శుభం సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన సామ్.. ఇటీవల పలు ఇంటర్వ్యూలకు హాజరైంది. ఈ నేపథ్యంలో ఓ బాధాకర సంఘటనను వెల్లడించింది. తన తండ్రి అంత్యక్రియలకు వెళ్తంటే కొంతమంది సెల్ఫీలు అడిగారని గుర్తు చేసుకుంది.సమంతా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అభిమానులు తన దగ్గరికి ఫోటోలు తీయడానికి వచ్చినప్పుడు తాను ఎప్పుడూ నో చెప్పలేదు. చెన్నైలో తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సమయంలోనే కొంతమంది అభిమానులు ఫోటో తీయడానికి తన దగ్గరికి వచ్చారు. అయినా నేను వారికి నో చెప్పలేదు. ఎందుకంటే తన విజయానికి కారణం తన అభిమానులే. మనం సెలబ్రిటీలు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నామో వారికి తెలియకపోవచ్చు. అందుకే నేనెప్పుడూ అభిమానుల ఫోటోలకు నో చెప్పను' అని ఆ సంఘటనను గుర్తు చేసుకుందిఆ రోజును గుర్తుచేసుకుంటూ.. 'డిసెంబర్‌లో నాన్న మరణించారని నా తల్లి నుంచి ఉదయం నాకు ఫోన్ వచ్చింది. నేను వెంటనే ముంబయి నుంచి చెన్నైకి విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది. కొంతకాలంగా నాన్నతో మాట్లాడకపోవడంతో నేను షాక్‌కు గురయ్యాను. నాలో ఎలాంటి స్పందన లేకుండా విమానంలో కూర్చుండిపోయా. ఆ సమయంలో కొందరు నా ఫోటో కోసం అడిగిన విషయం నాకు గుర్తుంది. నేను నిలబడి వారితో ఫోటోలకు నవ్వుతూ ఉన్నా" అని తెలిపింది. మనం ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియదు.. తెలియనివారితో ఫోటో అడగడానికి చాలా ధైర్యం అవసరం.. అందుకే నో చెప్పి వారిని బాధపెట్టాలని అనుకోలేదని సమంత వెల్లడించింది.ఆ సంఘటన తనను ఒక సెలబ్రిటీగా ఉండటంలో ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఆలోచించేలా చేసిందని సమంత పేర్కొంది. వారితో సెల్ఫీల కోసం నేను నవ్వుతున్నప్పుడు అది నా మనసును తాకిందని.. ఎందుకంటే తండ్రి మరణించిన రోజున ఏ వ్యక్తి నవ్వాలని అనుకోడని వివరించింది. ఇది పూర్తిగా వేరే ప్రపంచమని సమంత తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే సమంత 'బంగారం' అనే మూవీలో కనిపించనుంది.

Rahul Gandhi Writes To PM Narendra Modi10
మోదీ జీ.. ఇలా చేస్తే మంచిది: రాహుల్ గాంధీ లేఖ

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలు. ఆపై చోటు చేసుకున్న కాల్పుల విరమణ అంగీకారంతో పరిస్థితులు సద్దుమణిగాయి.పాకిస్తాన్ కాళ్ల బేరానికి డైరెక్ట్‌గా భారత్‌ను ఆశ్రయించకపోయినా అమెరికా అడ్డం పెట్టుకుని కాల్పుల విరమణకు వచ్చారన్నది జగమెరిగిన సత్యం. భారత్, పాక్‌లు కాల్పుల విరమణకు అంగీకారం అంటూ ముందుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఇక్కడ యుద్ధానికి కాలుదువ్వింది పాకిస్తాన్‌.. అసలు కాల్పులకు పాల్పడుతోంది ఎవరు?. అది పాకిస్తాన్‌ కాదా?. అందుకు పహల్గామ్‌ ఘటన సాక్ష్యం కాదా?. మరి కాల్పుల విరమణ అనేది ఇక్కడ కేవలం పాకిస్థాన్‌ కే వర్తిస్తుందనేది ప్రపంచానికి అంతటికీ అర్థమైంది.అయితే కాల్పులు విరమణ అంగీకారం అన్న మూడు గంటల వ్యవధిలోనే పాక్ మళ్లీ దానిని ఉల్లంఘించి భారత్ పై కాల్పులకు దిగింది. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిన భారత్.. పాకిస్తాన్ దుస్సాహసాన్ని మళ్లీ ప్రపంచం ముందు ఉంచకల్గింది. ఈ పరిస్థితుల నడుమ దాయాది పాకిస్తాన్‌ను అంత త్వరగా నమ్మలేమన్నది కూడా తేలిపోయింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌ను భారత్ కొనసాగించనుంది. ఈ విషయాన్ని భారత ఆర్మీ స్పష్టం చేసింది కూడా. పాక్‌ ఏమైనా దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్‌ సిందూర్‌ సిద్ధంగానే ఉందనే సంకేతాలిచ్చింది భారత్‌.ఇదంతా ఒకటైతే, అసలు ఆపరేషన్ సిందూర్‌తో పాటు పలు అంశాల్ని పార్లమెంట్ లో చర్చించాల్సిన అవసరం ఉందని అంటున్నారు ఏఐసీసీ నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఈ విన్నపాన్ని మోదీ జీ త్వరగా పరిశీలిస్తారని అనుకుంటున్నానని, ఇలా చేయడం మంచిదని రాహుల్‌ గాంధీ లేఖ ద్వారా తెలిపారు.ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేయండిపాకిస్తాన్ తో యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్ తదితర అంశాలను పార్లమెంట్ వేదికగా చర్చించాలని కోరుతున్నారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ రాశారు.‘ మోదీ జీ.. మీరు ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ను నిర్వహించండి. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లో ఆపరేషన్ సిందూర్ అంశంతో పాటు కాల్పుల విరమణ అంశాన్ని కూడా చర్చిద్దాం. ఈ విషయాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఆ విషయాల గురించి చెప్పడం అత్యంత కీలకంగా భావిస్తున్నాను. కాల్పుల విరణమ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలి. ఈ విషయాలను చర్చించడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి. మన ముందున్న సవాళ్లను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఇదొక సువర్ణావకాశం అవుతుంది. ఈ మా డిమాండ్ ను త్వరగా పరిశీలిస్తారని విశ్వసిస్తున్నాను’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.రాజ్యసభ ప్రతిపక్ష నేత, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే కూడా ఇదే విషయాన్ని మోదీకి లేఖ ద్వారా తెలిపినట్లు మరొక కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.LoP Lok Sabha and LoP Rajya Sabha have just written to the PM requesting for a special session of Parliament to be convened immediately. Here are the letters pic.twitter.com/exL6H5aAQy— Jairam Ramesh (@Jairam_Ramesh) May 11, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement