Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India And Pakistan Ceasefire DGMO Meeting Updates1
కాసేపట్లో భారత్‌, పాక్‌ చర్చలు.. మోదీ నివాసంలో కీలక సమావేశం

DGMO Meeting Updatesఢిల్లీ..ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశంసమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో కీలక భేటీ 👉భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలో కాసేపట్లో(మధ్యాహ్నం 12 గంటలకు) కాల్పుల విరమణ, తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (DGMO)లు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.👉ఈ చర్చల్లో భారత్‌ తరఫున లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొననున్నారు. రెండు దేశాల మధ్య చర్చల నేపథ్యంలో గత రాత్రి సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కాల్పుల విరమణను పాకిస్తాన్ రేంజర్స్ అతిక్రమించలేదు. ఎలాంటి కవ్వింపు చర్యలకు సైతం పాల్పడలేదు. అయితే, పాకిస్తాన్ నమ్మలేమని.. అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు సూచించాయి.👉ఇక, ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు డీజీఎంవో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై మీడియాకు ఆయన వివరించనున్నారు. Delhi | Media briefing by Director General Military Operations of All Three Services - Indian Army, Indian Navy and Indian Air Force today at 2:30 PM— ANI (@ANI) May 12, 2025👉ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు భారత్ డీజీఎంవోతో పాకిస్థాన్‌ డీజీఎంవో హాట్ లైన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి.. వెంటనే అమలు చేద్దామని కోరారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ప్రకటించారు. కాగా, పాకిస్తాన్ నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు ఎదురైన తీవ్రమైన ప్రతిదాడి తప్పదని భారత్‌ ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ తూటా కాలిస్తే.. భారత్ ఫిరంగి గుండు పేల్చాలని ప్రధాని మోదీ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారు.

Chandrababu coalition govt cheated in Aarogyasri Aasara Money to Poor2
‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు

సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్‌ జగన్‌ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్‌ డబ్బాలతో కూడిన బేబీ కిట్‌ ఇస్తామంటూ ప్రకటించింది.ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.కిట్‌ల కొనుగోలులోనూ లూటీ తంతు?ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్‌ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్‌లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం.

 Actor Vishal Health Update Out Now3
నటుడు విశాల్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీమ్‌

కోలీవుడ్‌ నటుడు విశాల్‌ మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యంపై తన పీఆర్‌ టీమ్‌ క్లారిటీ ఇచ్చింది. తమిళనాడులోని విల్లుపురంలో ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్‌లో హీరో విశాల్ స్పృహ తప్పి పడిపోవడంపై వారు వివరణ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వలనే విశాల్‌ అస్వస్థతకు గురయ్యారని వారు చెప్పారు. దీంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం విశాల్‌ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని, అభిమానులు ఎవరూ ఆందోళ చెందాల్సిన అవసరం లేదన్నారు.తమిళనాడు విల్లుపురంలో ఉండే కూవాగం గ్రామంలో ఉన్న ఆలయంలో కొద్దిరోజులుగా చిత్తిరై (తమిళమాసం) వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో విశాల్‌ అతిథిగా పాల్గొన్నారు. ఆదివారం నాడు మిస్‌ కువాగం ట్రాన్స్‌జెండర్‌ బ్యూటీ కాంటెస్ట్‌ను నిర్వాహుకులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్‌ కొద్దిసేపట్లోనే ఉన్నట్టుండి వేదికపై స్పృహ తప్పి పడిపోయారు. ఈ క్రమంలోనే ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Ricky Ponting Convinced Foreign Players To Stay Back in India: PBKS CEO4
మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!.. ఆటగాళ్లకు సర్ది చెప్పిన హెడ్‌ కోచ్‌

భారత్‌- పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌-2025 (IPL 2025) వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ నేపథ్యంలో లీగ్‌లో పాల్గొంటున్న విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంతమంది ఇప్పటికే స్వదేశాలకు చేరుకునే క్రమంలో దుబాయ్‌ వరకు వెళ్లినట్లు సమాచారం. అయితే, పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంఛైజీ ఆటగాళ్లకు వారి హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ (Ricky Ponting) సర్దిచెప్పినట్లు తెలుస్తోంది.మరేం పర్లేదు.. ఇక్కడే ఉందాం!సొంత దేశానికి తిరిగి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ... పాంటింగ్‌ ఢిల్లీలోనే ఉండేందుకు ప్రాధాన్యతనిచ్చాడు. అప్పటికే అతడి లగేజీ విమానాశ్రయానికి చేరుకోగా... అతి కష్టం మీద దానిని తిరిగి తెప్పించుకున్నాడు. అప్పటికే భారత్‌ నుంచి స్వదేశాలకు తిరుగు పయనమైన విదేశీ ఆటగాళ్లతో పాటు మిగిలిన వారిలో పాంటింగ్‌ దైర్యం నింపాడు.ఈ విషయం గురించి పంజాబ్‌ కింగ్స్‌ జట్టు సీఈవో సతీశ్‌ మీనన్‌ మాట్లాడుతూ.. ‘స్వదేశానికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ పాంటింగ్‌ నిరాకరించాడు. అంతేగాకుండా విదేశీ ఆటగాళ్లలో ధైర్యం నింపాడు. వారంతా త్వరలో జట్టుతో చేరబోతున్నారు’ అని పేర్కొన్నాడు.కాగా ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ జట్టులో ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్‌ స్టొయినిస్, ఆరోన్‌ హార్డీ, జోష్‌ ఇన్‌గ్లిస్, జేవియర్‌ ఉన్నారు. కాగా భారత్‌- పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌- ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య గురువారం ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్‌ అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే.వందే భారత్‌ రైలులోశత్రు దేశ వ్యూహాలకు చెక్‌ పెట్టే క్రమంలో ధర్మశాలలో బ్లాక్‌ అవుట్‌ (విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం) చేయడంతో త్వరత్వరగా స్టేడియాన్ని ఖాళీ చేయించడంతో పాటు.. ఆటగాళ్లను కూడా బీసీసీఐ అక్కడి నుంచి తరలించింది. ఈ క్రమంలో ధర్మశాల నుంచి ఢిల్లీకి వందే భారత్‌ రైలులో ఆటగాళ్లను తరలించింది.ఇందులో భాగంగా బస్సులు, ట్రైన్‌లు మారుతూ ప్రయాణించడంతో విదేశీ ఆటగాళ్లలో ఒకరకమైన భయాందోళన పెరిగిపోవడంతో... వారంతా తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని ఆశించారు. ‘దాడుల వార్తలతో విదేశీ ఆటగాళ్లు కాస్త ఆందోళన చెందారు. వీలైనంత త్వరగా దేశం వీడి ఇళ్లకు చేరుకోవాలని భావించారు.వారి స్థానంలో ఉంటే ఎవరైనా అలాగే అనుకుంటారు. అయితే భారత్, పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ అనంతరం పాంటింగ్‌ వారికి సర్దిచెప్పాడు’ అని ఓ అధికారి తెలిపారు. కాగా పంజాబ్‌ పేస్‌ ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ మాత్రం దుబాయ్‌కు చేరుకున్నారు. ఐపీఎల్‌ తిరిగి ప్రారంభం కావడంపై త్వరలో ప్రకటన రానుండగా... జట్లన్నీ తమ ఆటగాళ్లను అందుబాటులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఆదివారం ఫ్రాంఛైజీలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా, శనివారం భారత్‌- పాకిస్తాన్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి రాగా.. పరిస్థితులు కాస్త చక్కబడ్డాయి. ప్లే ఆఫ్స్‌ రేసులో పంజాబ్‌ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలో తిరిగి ఐపీఎల్‌ ప్రారంభం కానుంది. మే 16 లేదంటే 17న తిరిగి ఆరంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ మార్గదర్శనం, శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలో ఈ సీజన్‌లో పంజాబ్‌ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఢిల్లీతో గురువారం మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు 10.1 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి 122 పరుగులు చేసింది. ఐపీఎల్‌ తిరిగి ప్రారంభమైనప్పుడు ఈ మ్యాచ్‌ అక్కడి నుంచే కొనసాగే అవకాశాలున్నాయి. ఒకవేళ ఇందులో గెలిస్తే పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఇప్పటికి శ్రేయస్‌ సేన ఖాతాలో పదిహేను పాయింట్లు ఉన్నాయి. చదవండి: క్షిపణి దాడి నుంచి తప్పించుకున్న ఆసీస్‌ క్రికెటర్లు!

stock market updates on may 12 20255
భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే సోమవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:45 సమయానికి నిఫ్టీ(Nifty) 598 పాయింట్లు పెరిగి 24,607కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1938 పాయింట్లు ఎగబాకి 81,389 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 100.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.22 అమెరికన్‌ డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.4 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో గతంతో పోలిస్తే స్థిరంగా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.07 శాతం లాభపడింది. నాస్‌డాక్‌ 0.01 శాతం ఎగబాకింది.భారత్, పాకిస్తాన్‌ మధ్య దాదాపు యుద్ధమేఘాలు అలుముకోవడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు గత వారం చివర్లో బలహీనపడ్డాయి. అయితే వారాంతాన కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ సరిహద్దు పొడవునా పాక్‌ అతిక్రమణలకు పాల్పడినట్లు వెలువడిన వార్తలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచినట్లు స్టాక్‌ నిపుణులు తెలియజేశారు. దీంతో మరోసారి అనిశ్చిత పరిస్థితులు తలెత్తినట్లు పేర్కొన్నారు. వెరసి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేవరకూ మార్కెట్లను నిశితంగా పరిశీలించాలని అభిప్రాయపడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Ahmed Sharif Chaudhry Says Pakistan Jet damaged Clash with India6
అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్‌ అధికారిక ప్రకటన

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ యుద్ధ విమానంపై అటాక్‌ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన సీనియర్‌ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్‌ జరిపిన దాడిలో పాకిస్తాన్‌ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్‌ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్‌-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్‌.. పాకిస్తాన్‌ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్‌ వార్త అని ఖండించారు. భారత్‌ పైలట్‌ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్‌ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. పాక్‌ను దెబ్బకొట్టాం..మరోవైపు.. ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ సాధించిన విజయాలను మన సైన్యం ఆదివారం వెల్లడించిన విషయం తెలిసిందే. పాక్‌ విమానాలను నేల కూల్చామని ఎయిర్‌ మార్షల్‌ ఎ.కె.భారతి తెలిపారు. అయితే, ఆ సంఖ్య ఎంత అన్నది ఆయన చెప్పలేదు. ‘‘మన సరిహద్దు లోపలికి పాక్‌ యుద్ధవిమానాలను రాకుండా నిరోధించాం. కాబట్టి వాటి శకలాలు మా దగ్గర లేవు. కాకపోతే కచ్చితంగా కొన్ని విమానాలను కూల్చాం’’ అని తెలిపారు.బ్రహ్మోస్‌ సూపర్‌ పవర్‌..ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో భారత్‌ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్‌ అధికారిక రాజధాని ఇస్లామాబాద్‌ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్‌ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్‌ ట్యాంకర్‌ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్‌ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్‌-11 బాలిస్టిక్‌ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్‌ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్‌ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

Qatar Royal Family 747-8 jumbo jet Gift To Trump7
ట్రంప్ ఖతార్‌ పర్యటన.. భారీ బహుమతి రెడీ

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఖతార్‌ భారీ ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని ట్రంప్‌కు బహుమతిగా ఇవ్వనున్నట్లు సమాచారం. ట్రంప్‌ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్‌ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ వారంలో మధ్యప్రాచ్య పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌, ఖతార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌.. ఖతార్‌ పాలక కుటుంబం నుంచి విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని బహుమతిగా స్వీకరించనున్నట్లు సమాచారం. ట్రంప్‌ తన పర్యటనలో భాగంగా ఖతార్‌కు వచ్చినపుడు ఈ కానుకను ప్రకటించే అవకాశముంది. దీనిపై ఖతార్‌ ప్రభుత్వం అధికారికంగా ఇంకా స్పందించలేదు. ఒక విదేశీ ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద కానుకను అమెరికా అధ్యక్షుడు స్వీకరించడం, దాని చట్టబద్ధతపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.Qatar to Gift $400 Million Plane to President Trump:▪️According to ABC News, the Trump administration is set to accept a luxury Boeing 747-8 jumbo jet—valued at around $400 million—from the Qatari royal family.▪️The plane will serve as Air Force One for Trump until just… pic.twitter.com/d1H7OdyNmD— Beau Bannon🇺🇸 (@BeauBannon) May 11, 2025అయితే, విదేశీ ప్రభుత్వం నుండి ఇంత పెద్ద బహుమతిని అధ్యక్షుడు స్వీకరించడంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అమెరికా రాజ్యాంగంలోని జీతాల నిబంధన, ఆర్టికల్ I, సెక్షన్ 9, క్లాజ్ 8, ప్రభుత్వ పదవిలో ఉన్న ఎవరైనా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఏదైనా.. రాజు, యువరాజు లేదా విదేశీ రాష్ట్రం.. నుండి ఏదైనా బహుమతి, జీతం, కార్యాలయం లేదా బిరుదును స్వీకరించడాన్ని నిషేధిస్తుంది. ఈ నేపథ్యంలో, అమెరికా అధికారులు దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్‌ వన్‌) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీ విరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షనుగా ఉపయోగిస్తారు. సురక్షితమైన కమ్యూనికేషన్లు, ఇతర అవసరమైన సౌకర్యాలు జోడించాలని యోచిస్తున్నారు.

Meet Executive Chef Challa Laxminarayana Success Story In Telugu8
సక్సెస్‌ అంటే...‘సాఫ్ట్‌వేర్‌’ ఒక్కటే కాదు బాస్‌!

తెనాలి: చల్లా లక్ష్మీనారాయణ– ‘ ఏదో ఒక రోజు పెద్ద చెఫ్‌ని అవుతాను’ అంటూ చిన్నప్పుడు అన్నప్పుడు, అందరూ నవ్వుకున్నారు. అయితే, అమ్మను తొలి గురువుగా తీసుకున్న ఆయన, పాకశాస్త్రంలో అపూర్వ శిఖరాలను అధిరోహించారు. ఆధునిక నలభీమునిగా, ప్రత్యేకమైన రెసిపీల సృష్టిలో తన ప్రతిభను చాటారు. ఆయన వంటల ప్రయాణం.. ‘శ్రమ’కు ‘రుచి’ని మేళవించి, ఆహారప్రియులను ‘ఔరా..’ అనిపించింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అమెరికా వరకు ఆయన ప్రస్థానం, నిజంగా ఈ రంగంలో యువతకు ప్రేరణ. ప్రస్తుతం వీసా రెన్యువల్‌ కోసం భారత్‌కు వచ్చిన ఆయన స్ఫూర్తిదాయక జీవన ప్రయాణం మీ కోసం.. అదృష్టానికి తొలి మెట్లు.. లక్ష్మీనారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి రూరల్‌ మండలానికి చెందిన అంగలకుదురు. తెనాలిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, హైదరాబాద్‌లోని ఐఐహెచ్‌ఎంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా పొందారు. ఒక హోటల్‌లో ఉద్యోగంతోపాటు హోటల్‌ మేనేజ్‌మెంట్, టూరిజంలో పీజీ డిప్లొమా కూడా పూర్తి చేశారు. ఆపై సింగపూర్‌లో ఫుడ్‌ హైజీన్‌ కోర్సు అభ్యసించి, ముంబయిలోని బ్రిటిష్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా హోటల్‌ మేనేజ్‌మెంట్, కేటరింగ్‌ టెక్నాలజీలో దూరవిద్య ద్వారా కోర్సు పూర్తి చేశారు. 1997లో ఆయన వృత్తి జీవితం ప్రారంభమైంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రముఖ హోటళ్లలో చెఫ్‌గా సేవలందించారు. 2007–09 కాలంలో సింగపూర్‌లోని నయూమి హోటల్స్‌లో చెఫ్‌గా పనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం మైసూరు, కూర్గ్‌ ప్రాంతాల్లోని రిసార్ట్స్, తిరుపతిలోని ఐసీటీ హోటల్‌లో సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాకినాడ, చెన్నై నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో పనిచేశారు. శ్రమతోపాటు ప్రతిభకు గుర్తింపుగా అదృష్టం తలుపు తట్టినట్లు 2023లో అమెరికా నుంచి ఆహ్వానం లభించింది. అక్కడి కాలిఫోర్నియాలో ప్రసిద్ధ హోటల్‌లో చెఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: ఎండినా... నిమ్మ అమ్మే! వరించిన అవార్డులు సింగపూర్‌లోని వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ చెఫ్స్‌ సొసైటీ, సౌత్‌ ఇండియన్‌ చెఫ్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఐసీఏ), ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కలినరీ అసోసియేషన్‌ (ఐఎఫ్‌సీఏ), అమెరికన్‌ కలినరీ ఫెడరేషన్‌ (ఏసీఎఫ్‌) సభ్యత్వాలు లక్ష్మీనారాయణకు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ తిరుపతి, విశాఖపట్నం వేదికగా నిర్వహించిన వంటకాల పోటీలతో పాటు అనేక సోలో, గ్రూపు విభాగాల్లో పాల్గొని పలు ప్రతిష్టాత్మక అవార్డులను ఆయన గెలుచుకున్నారు. ఎన్నో దేశాల వంటకాల్లో మేటిగా.. పలు దేశాల వంటకాలలో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. దక్షిణ భారతీయ వంటకాలకే పరిమితం కాకుండా థాయ్, ఇటాలియన్, మెక్సికన్‌ వంటి అంతర్జాతీయ వంటకాల్లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. నీటిపై పెరిగే మొక్కల నుంచి తయారు చేసే ప్రత్యేకమైన ‘హనీ చిల్లీ చెస్ట్‌ నట్స్‌’ రెసిపీలో లక్ష్మీనారాయణ సిద్ధహస్తులు. ఆయన తయారు చేసే మరో ప్రసిద్ధ వంటకం ‘చిల్లీ తోఫు’ కూడా ఎంతో ఆదరణ పొందింది. నాన్‌వెజిటేరియన్‌ వంటకాల విషయంలో, మటన్‌ కర్రీతో దోసెలా స్ట్రీమ్‌ చేసి వడ్డించే ప్రత్యేకమైన ‘మటన్‌ మొప్పాస్‌’, మంగళూరు శైలిలో ‘ఘీ రోస్ట్‌ ప్రాన్స్‌’, ఆంధ్ర ప్రత్యేకత అయిన ‘నాటుకోడి–రాగిముద్ద’, అరుదైన ‘జాక్‌ఫ్రూట్‌ బిర్యానీ’, మసాలా రుచులతో నిండిన ‘గుంటూరు మటన్‌ ఫ్రై బిట్‌ బిర్యానీ’లు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.‘సాఫ్ట్‌వేర్‌’ ఒక్కటే మార్గం కాదునేటి యువతకు ‘సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం’ ఒక్కటే మార్గం కాదు. హోటల్, టూరిజం వంటి రంగాలలోనూ అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నా వృత్తి విషయానికి వస్తే, ప్రతి దేశం నాకు ఒక కొత్త పాఠం, ప్రతి వంటకం ఒక కొత్త సవాలు. ఇన్నేళ్ల ప్రయాణంలో అనుభవించిన అవమానాలు, ఒంటరితనం, సుదీర్ఘమైన పనిగంటలు– ఇవన్నీ నా ఎదుగుదలకు బలమైన మూల స్తంభాలయ్యాయి. వంటకాలు తయారు చేయడం మాత్రమే కాదు, వాటిలో మనసు కలపాలి. పదార్థాలకు భావాలను మేళవించినప్పుడే వంటకానికి ప్రాణం వస్తుంది. – చల్లా లక్ష్మీనారాయణ

Miss World Contestants for Nagarjunasagar this evening9
నేడు సాగర్‌.. రేపు చార్మినార్‌..

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం, పోటీదారుల భద్రత నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులు తొలుత సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్, అనంతరం పాత నగరంలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు కార్యక్రమాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇప్పుడు వాటిని యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు కొంత తగ్గిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించనున్నారు. స్వాగత విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక సోమవారం సాయంత్రం పోటీదారులు, విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్‌ సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అక్కడే రాత్రి విందు అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరతారు. చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకు నడక మంగళవారం సాయంత్రం పోటీదారులు చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్‌ చేస్తారు. చార్మినార్‌ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో ఇంటర్‌ కాంటినెంటల్, తెలంగాణ వంటకాలు విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌ ధమ్‌ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్‌ కీ ఘోష్, పనీర్‌ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్‌ జామూన్‌ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్‌ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. ఆసియా వంటకాలలో సుషీ (జపాన్‌), డిమ్‌సమ్‌ (చైనా), థాయ్‌ గ్రీన్‌ కర్రీ (థాయ్‌లాండ్‌) వంటివి, యూరోపియన్‌ వంటకాలైన ఇటాలియన్‌ పాస్తా, ఫ్రెంచ్‌ రాటటౌలీ, స్పానిష్‌ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్‌ టాకోస్, బ్రెజిలియన్‌ ఫెయిజోడా, అమెరికన్‌ బార్బెక్యూ రిబ్స్‌ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్‌ డోరో వాట్, మొరాకన్‌ టాగిన్, హమ్ముస్‌తో పాటు మెడిటరేనియన్‌ ఫలాఫెల్, క్వినోవా సలాడ్‌ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్‌లో జరిగే గలా డిన్నర్‌ సందర్భంగా తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌ కూడా ఉంటుందని చెబుతున్నారు.

India release Pak Army personnel Names Attended terrorists funeral10
పాక్‌కు చెక్‌ పెట్టిన భారత్‌.. ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఉన్నది వీరే..

ఢిల్లీ: ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర స్థావరాలపై దాడులే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్‌ సిందూర్‌లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే, ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది.వివరాల ప్రకారం.. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్‌ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు.. పాక్‌ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. అయితే, తొలుత తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్‌ బుకాయించినా భారత్‌ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది.ఇక, తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్‌ అధికారుల పేర్లను భారత్‌ విదేశాంగశాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్నది వీరే.. లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్‌ కమాండర్‌, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్‌, లాహోర్ 11వ ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్, బ్రిగేడియర్‌ మహ్మద్‌ ఫర్ఖాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్‌ పంజాబ్ పోలీస్, మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్‌ అసెంబ్లీ మెంబర్ ఉన్నారు. Video showing Pakistani Army officials attending the funerals of slain Lashkar-e-Taiba (LeT) terrorists yesterday. The man leading the Janaza is Hafiz Abdul Rauf - a US designated terrorist.Once again blurring the lines between state and terror - the world is watching you 🇵🇰 pic.twitter.com/MjsJXcyDMl— Vinayak Tripathi (@belikevinayak) May 8, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement