Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

PM Narendra Modi Strong Message To Army On Pak Escalation1
పాక్‌ తూటాలకు... క్షిపణులతో బదులివ్వండి

న్యూఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్‌ ప్రతిస్పందన ఇకపై సరికొత్త రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. ‘‘పాక్‌తూటాలకు కచ్చితంగా క్షిపణులతో సమాధానం చెప్పండి. అది చేపట్టే ఒక్కో దుశ్చర్యకూ కలలో కూడా ఊహించనంత బలంగా బదులివ్వండి’’ అని సైనిక దళాలను ఆదేశించాశారు. త్రివిధ దళాల అధినేతలతో ఆయన ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్, విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై విస్తృతంగా చర్చించారు. పాక్‌ దాడులను సహించడానికి ఏ మాత్రమూ వీల్లేదంటూ మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదంపై, ముష్కరులపై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఇంకా ముగియలేదని స్పష్టంచేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే చెల్లించాల్సిన మూల్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కశ్మీర్‌ అంశంలో విదేశీ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించేది లేదని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్‌తో జరిగే ఏ చర్చలైనా సరే కేవలం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)ను, పాక్‌లో దాక్కున్న ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించడంపైనే ఉంటాయని కేంద్రం తేల్చిచెప్పింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న పీఓకేను, ఉగ్రవాద మూకలను భారత్‌కు అప్పగించాల్సిందేనని, పాక్‌కు మరో గత్యంతరం లేదని స్పష్టం చేసింది. ‘‘ఆ దేశంతో చర్చలు వీటిపై మాత్రమే జరుగుతాయి. అది కూడా కేవలం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంఓ) స్థాయిలో మాత్రమే కొనసాగుతాయి’’ అని కేంద్రం ఉద్ఘాటించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ సహా ఉగ్రవాదుల అప్పగింతపై తప్ప మరో అంశంపై చర్చించే ప్రసక్తే లేదని తెలిపింది. ఉగ్రవాదానికి పాక్‌ మద్దతు కొనసాగుతున్నంత కాలం సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం తథ్యమని పేర్కొంది. విదేశాంగ మంత్రులు, లేదా జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో చర్చలు జరగాలని పాక్‌ ప్రతిపాదిస్తుండగా అందుకు భారత్‌కు అంగీకరించడం లేదు.దాడి చేస్తే గట్టిగా ఎదురుదెబ్బజేడీ వాన్స్‌కు మోదీ స్పష్టీకరణ న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: పాకిస్తాన్‌ ఒకవేళ భారత్‌పై మళ్లీ దాడికి దిగితే అంతకంటే గట్టిగానే ఎదురుదెబ్బ తీస్తామని అమెరికాకు మోదీ తేల్చిచెప్పారు. తమ ప్రతిస్పందన అత్యంత తీవ్రస్థాయిలో, దాయాదికి వినాశకరంగా ఉంటుందని స్పష్టంచేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ శనివారం మోదీతోఫోన్‌లో మాట్లాడారు. కాల్పుల విరమణ ఒప్పందం గురించి ప్రస్తావించారు. అనంతరం విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌తో కూడా వాన్స్‌ చర్చించారు. పాక్‌ కాల్పులు ఆపితేనే సంయమనం పాటిస్తామని అమెరికాకు భారత్‌ తేల్చిచెప్పినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. భారత్‌–పాక్‌ ఘర్షణల గురించి అమెరికా నిఘా వర్గాల నుంచి ఆందోళనకరమైన సమాచారం అందిన కారణంగానే మోదీ తో వాన్స్‌ మాట్లాడారని సమాచారం. సున్నితమైన అంశం కావడంతో బయటకు వెల్లడించలేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ పాక్‌ దాడులను తిప్పికొట్టాలని ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది ఆదేశం న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్తాన్‌ సైన్యం దాడులకు దిగితే గట్టిగా ప్రతిస్పందించాలని, తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఆర్మీ కమాండర్లకు సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది ఆదేశాలు జారీ చేశారు. దాడులను తిప్పికొట్టే విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. సైనిక చర్యలు నిలిపివేస్తూ అంగీకారానికి వచ్చినట్లు భారత్, పాక్‌ శనివారం ప్రకటించడం తెలిసిందే. అయినప్పటికీ పాక్‌ సైన్యం కవి్వంపు చర్యలకు పాల్పడింది. శనివారం రాత్రి సరిహద్దుల్లో కాల్పులు జరపగా, భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఈ పరిణామాలపై ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది సమీక్ష జరిపారు. మరోసారి పాక్‌ సైన్యం కాల్పులకు గట్టిగా ప్రతిస్పందించాలని ఆదేశించారు. ఈ విషయంలో ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ఆయన తేల్చిచెప్పారు.

Ahmed Sharif Chaudhry Says Pakistan Jet damaged Clash with India2
అవును.. మా యుద్ద విమానం ధ్వంసమైంది: పాక్‌ అధికారిక ప్రకటన

ఇస్లామాబాద్‌: భారత్‌, పాకిస్తాన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. భారత ముప్పెట దాడి చేస్తూ పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ యుద్ధ విమానంపై అటాక్‌ చేయడంతో అది ధ్వంసమైంది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్‌ ఆర్మీకి చెందిన సీనియర్‌ అధికారి ఎట్టకేలకు అంగీకరించారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు.పాకిస్తాన్ సైన్యం, వైమానిక దళం, నావికాదళ సీనియర్ అధికారులు ఆదివారం అర్ధరాత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. ఇటీవల భారత్‌ జరిపిన దాడిలో పాకిస్తాన్‌ యుద్ధ విమానం ధ్వంసమైందని అధికారికంగా ప్రకటించారు. భారత్‌ దాడులను ఎదుర్కొనే క్రమంలో ఇలా జరిగిందన్నారు. అయితే నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, భారత్‌-పాకిస్తాన్ మధ్య శనివారం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.ఇదే సమయంలో భారత పైలట్‌.. పాకిస్తాన్‌ సైన్యానికి పట్టుబడ్డారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చౌదరి స్పందించారు. ఇది ఫేక్‌ వార్త అని ఖండించారు. భారత్‌ పైలట్‌ ఎవరూ తమ ఆధీనంలో లేరని స్పష్టం చేశారు. అలాగే, భారత్‌ దాడులను తాము సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధ నేపథ్యంలో భారత్‌ తీసుకున్న ఓ కీలక నిర్ణయం శత్రువు వెన్నువిరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో.. అప్పటి వరకూ అణ్వాయుధాలున్నాయంటూ ప్రగల్బాలు పలికిన దాయాది దేశం వెన్నులో వణుకుపుట్టింది. మొత్తం పరిస్థితే మారిపోయింది. పాకిస్తాన్‌ అధికారిక రాజధాని ఇస్లామాబాద్‌ అయినా.. పాలన మొత్తం జరిగేది రావల్పిండి నుంచే. ఇక్కడ చక్లాలాలోని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ కార్యాలయం నుంచే సైన్యానికి ఆదేశాలు వెళుతుంటాయి. శనివారం తెల్లవారుజామున భారత్‌ లక్ష్యంగా ఎంచుకున్న పాక్‌లోని కీలక ప్రాంతాల్లో రావల్పిండి సమీప నూర్‌ ఖాన్‌ వైమానిక స్థావరం అత్యంత ప్రధానమైనది. ఇక్కడ గగనతల రీఫ్యూయలర్‌ ట్యాంకర్‌ విమానాలు, భారీ రవాణా విమానాలు ఉన్నాయి. అప్పటికే పాకిస్థాన్‌ సైన్యం దిల్లీ లక్ష్యంగా ప్రయోగించిన ఫతాహ్‌-11 బాలిస్టిక్‌ క్షిపణులను భారత బలగాలు... గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400తో మధ్యలోనే పేల్చివేసింది. శుక్రవారం అర్ధరాత్రి శ్రీనగర్‌ నుంచి నలియా వరకు 26 లక్ష్యాలపైకి పాక్‌ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించగా వాటన్నింటినీ భారత రక్షణ దళాలు సమర్థంగా అడ్డుకున్నాయని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.

AP Farmers reject land acquisition for Sports City: Andhra Prades3
మా బతుకులతో ‘ఆడుకోవద్దు’

భూమితో మాది విడదీయరాని అనుబంధం.. వ్యవసాయం తప్పితే మాకు వేరే వృత్తి తెలియదు.. తక్కువో ఎక్కువో ఉన్నదాంట్లోనే పంటలు పండించుకుంటున్నాం, గుట్టుగా బతుకుతున్నాం.. కన్నతల్లి లాంటి భూమిని మానుంచి లాక్కుని మా జీవితాలతో ఆటలాడొద్దు.. గతంలో భూ సమీకరణకు తీసుకున్న భూములకే ఇప్పటికీ దిక్కూమొక్కు లేదు.. ఇప్పుడు మా నుంచి తీసుకున్న భూమికి ఎప్పుడు న్యాయం చేస్తారు? కళ్లముందు ఉన్న భూమిని పోగొట్టుకుని.. ఎక్కడో ఇచ్చే భూమి మాకెందుకు? – స్పోర్ట్స్‌ సిటీ భూసమీకరణ గ్రామసభల్లో రైతులుసాక్షి ప్రతినిధి, విజయవాడ: రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా, మా భూములు ఎందుకివ్వాలని నిలదీస్తున్నా, తమ జీవితాలతో ఆడుకోవద్దని వేడుకుంటున్నా, స్పోర్ట్స్‌ సిటీ పేరుతో భూ సమీకరణ ద్వారా భారీఎత్తున భూములను తీసుకునేందుకే ప్రభుత్వం సిద్ధమవుతోంది. అన్నదాతలు ససేమిరా అంటున్నా.. మాయమాటలతో మభ్యపెట్టి ముందుకు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగానే అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వీటిలో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే సర్కారు తన ధోరణిని మార్చుకోవడం లేదు.ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు, త్రిలోచనాపురం, కాచవరం, కేతనకొండ, జమీమాచవరంలో స్పోర్ట్స్‌ సిటీకి అవసరమైన భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిలో తీసుకునేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు ఏర్పాటు చేశారు. వాస్తవానికి స్పోర్ట్స్‌ సిటీకి తొలుత కృష్ణా నది లంక గ్రామాలు, లంక భూములను ప్రభుత్వ పెద్దలు ఎంచుకున్నారు. నెల రోజుల క్రితం కృష్ణా పరీవాహక ప్రాంతమైన చినలంక, పెదలంక, ఇబ్రహీంపట్నం, జూపూడిలో లంక భూములను మున్సిపల్‌ శాఖ మంత్రి పి.నారాయణ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, పలువురు ఎమ్మెల్యేలు పరిశీలించారు. కానీ, ఈ భూములకు కృష్ణా వరద తాకిడి ఉంటుందనే కారణంతో తాజాగా మూలపాడు పరిధిలోని మెరక ప్రాంత భూములపై కన్నేశారు.అయితే, స్పోర్ట్స్‌ సిటీ, ఐకానిక్‌ బ్రిడ్జి పేరుతో విలువైన, జీవనాధారమైన భూములను తీసుకునేందుకు ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని రైతులు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. స్పోర్ట్స్‌ సిటీ పేరుతో వ్యాపారం చేసేందుకే తమ భూములను తీసుకుంటున్నారనే అభిప్రాయం రైతుల్లో నెలకొంది. దీంతో పంట పొలాలను ఇవ్వబోమని విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య ఎదుట తెగేసి చెప్పారు. వారు ఒప్పుకోకున్నా ఏదోరకంగా భూములు స్వా«దీనం చేసుకునే ఎత్తుగడల్లో ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. ఒప్పుకోకున్నా ఒప్పుకొన్నట్లు.. రైతుల అభిప్రాయ సేకరణకు రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో గ్రామ సభలు నిర్వహించారు. మూలపాడు సభలో కొందరు భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. కానీ, వెంటనే 90 శాతం మంది రైతులు ల్యాండ్‌ పూలింగ్‌లో భూములు ఇవ్వబోమని తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు తెగేసి చెప్పారు. అమరావతి రాజధానినే ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదని ఇక తమ ప్రాంతాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారని సూటిగా ప్రశి్నంచారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే తాము పొలాలను ఎలా ఇస్తామని నిలదీశారు. భూమి మా చేతిలో ఉంటేనే బంగారంజమీమాచవరంలో సభకు హాజరైన రైతులు అందరూ ల్యాండ్‌ పూలింగ్‌లో భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాచవరం, కేతనకొండ గ్రామ సభల్లో ఆర్డీవో కావూరి చైతన్య పాల్గొన్నారు. కాచవరంలో ఒకరిద్దరు భూస్వాములు మినహా మిగిలిన రైతులు ప్రభుత్వానికి పొలాలు ఇవ్వబోమని ప్రకటించారు. కేతనకొండలో రైతులు నిరసనగా చప్పట్లు కొడుతూ మరీ పొలాలు ఇచ్చేది లేదని వెల్లడించారు. ‘భూమి మా ఆధీనంలో ఉంటే పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అవసరాలకు వాడుకుంటాం. ప్లాటు ఇవ్వడానికి మరో మూడు నాలుగేళ్లు పడుతుంది. అప్పటివరకు మా అవసరాలు ఎలా తీరతాయి’ అంటూ ఆర్డీవో చైతన్యను రైతులు సూటిగా ప్రశి్నంచారు.2,874 ఎకరాల సేకరణకు ఎత్తుగడ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం మండలం ఐదు గ్రామాల పరిధిలోని భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో సేకరించేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభల్లో స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి గ్రామాల్లో ఉన్న భూముల వివరాలను వెల్లడించారు. మూలపాడులో 313 ఎకరాలు, కాచవరంలో 590 ఎకరాలు, త్రిలోచనాపురంలో 1,390 ఎకరాలు, జమీమాచవరంలో 301 ఎకరాలు, కేతనకొండలో 280 ఎకరాలు చొప్పున మొత్తం 2,874 ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకోనున్నారు. వీటిలో ఎక్కువగా పట్టా భూములు ఉండగా, ఎన్‌ఎస్‌పీ కాలువ, ప్రభుత్వ అసైన్‌మెంట్, లంక భూములు కొన్ని ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతుల పొట్టకొడతారా? చిన్న, సన్నకారు రైతుల భూములను ల్యాండ్‌ పూలింగ్‌లో తీసుకోవడం దుర్మార్గమైన చర్య. వారి పొట్టకొడతారా? పూలింగ్‌పై ప్రతి గ్రామంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. రెవెన్యూ అధికారుల వద్ద వారి ఆవేదనను వెల్లడించారు. భూములే జీవనాధారం అని కూడా తేల్చిచెప్పారు. మెజార్టీ రైతుల అభిప్రాయం మేరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. –గరికపాటి శ్రీదేవి, జెడ్పీ వైస్‌ చైర్మన్, మూలపాడు 3 పంటలు పండే భూములు.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఇబ్రహీంపట్నంలో ఎకరా రూ.కోటి నుంచి రూ.2 కోట్ల ధర పలుకుతోంది. మా భూ­ముల్లో ఏడాదికి మూడు పంటలు పండుతాయి. వీటిని ప్రభుత్వానికి ఇచ్చేది లేదు. – ఎస్‌డీ జానీ, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్, కేతనకొండ ఉన్నది 80 సెంట్లు.. అదీ తీసుకుంటారా? 80 సెంట్ల భూమిలో వ్యవసాయం చేస్తున్నా. కొంత భాగం పొలంలో గ్రాసం పెంచి పాడి పరిశ్రమను నిర్వహిస్తున్నా. కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నాకు వ్యవసాయం తప్ప మరో పని తెలియదు. ఇప్పుడు ఉన్న పొలం తీసు­కుని ప్లాటు ఇస్తామంటే ఎలా? – ఆళ్ల శ్రీనివాసరావు, రైతు, త్రిలోచనాపురం

Rasi Phalalu: Daily Horoscope On 12-05-2025 In Telugu4
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. ఊహలు నిజమవుతాయి

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: పౌర్ణమి రా.9.03 వరకు, తదుపరి బహుళ పాడ్యమి, నక్షత్రం: విశాఖ పూర్తి (24 గంటలు), వర్జ్యం: ప.11.40 నుండి 1.26 వరకు, దుర్ముహూర్తం: ప.12.21 నుండి 1.13 వరకు, తదుపరి ప.2.56 నుండి 3.48 వరకు అమృతఘడియలు: రా.10.16 నుండి 12.03 వరకు, మహ వైశాఖి, బుద్ధపూర్ణిమ; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.33, సూర్యాస్తమయం: 6.18. మేషం...... సన్నిహితులు, మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి.వృషభం... సన్నిహితులతో సఖ్యత. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. వాహనాలు, భూములు కొంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు బాధ్యతలు తగ్గుతాయి.మిథునం.... ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు.కర్కాటకం... ప్రయాణాల్లో మార్పులు. అనుకోని ధన వ్యయం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వ్యాపారులకు నిరాశ. ఉద్యోగులకు చిక్కులు.సింహం... ఉద్యోగయత్నాలలో విజయం. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్నది సాధిస్తారు. దైవచింతన. ధనలాభం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఒత్తిళ్లు తొలగుతాయి.కన్య... బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆలయాల దర్శనాలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిళ్లు.తుల..... చిన్ననాటి మిత్రులతో సఖ్యత. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. ధన,వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. వాహనయోగం.వృశ్చికం..... ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారులకు నిరుత్సాహం. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు సామాన్యస్థితి.ధనుస్సు... ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఉద్యోగయత్నాలలో కదలికలు. వ్యాపారులు ముందడుగు. ఉద్యోగులకు అనుకూల మార్పులు. దైవచింతన.మకరం... ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారులు ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.కుంభం.... కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారులకు గందరగోళం. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.మీనం... బంధువులు విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారులకు లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

Chandrababu coalition govt cheated in Aarogyasri Aasara Money to Poor5
‘ఆసరా’కు ఎసరు.. బాలింతలకు కొసరు

సాక్షి, అమరావతి: ‘ఆడబిడ్డ నిధి’ కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏటా రూ.18 వేలు ఇస్తాం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం.. బడికెళ్లే ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం అందిస్తాం’.. అంటూ ఎన్నికలకు ముందు ఎన్నో సాధ్యంకాని హామీలను ఎడాపెడా ఇచ్చేసిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కటీ అమలుచేయకుండా మహిళలను దగా చేస్తున్నారు. తానిచ్చిన హామీలను అటకెక్కించడమే కాకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను సైతం నిర్దాక్షిణ్యంగా ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద బాలింతలకు అందే రూ.ఐదు వేల ఆసరా సాయానికీ మంగళం పాడేశారు. వైఎస్‌ జగన్‌ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రసవానంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 24 గంటల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో బాలింతకు ఆసరా సాయాన్ని ఇచ్చేవారు. కానీ, గతేడాది టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఈ సాయాన్ని పూర్తిగా అటకెక్కించింది. ఇలా ఆరోగ్యశ్రీ ఆసరాకు గండికొట్టి ఏకంగా రూ.5 వేలు చొప్పున బాలింతలకు నష్టం చేకూరుస్తూ.. కేవలం రూ.వందలు విలువచేసే సబ్బు, పౌడర్‌ డబ్బాలతో కూడిన బేబీ కిట్‌ ఇస్తామంటూ ప్రకటించింది.ఐదేళ్లలో 15 లక్షల మందికి అన్యాయం..రాష్ట్రంలో ఏటా ఆరోగ్యశ్రీ పథకం కింద మూడు లక్షలకు పైగా ప్రసవాలు నమోదవుతుంటాయి. ఆరోగ్య ఆసరా పథకం కింద ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంటనే వీరందరికీ గత ప్రభుత్వంలో రూ.5 వేలు చొప్పున బ్యాంకులో జమచేసేవారు. ఈ సాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేయడంతో ఏటా మూడు లక్షల చొప్పున లెక్కేసినా 2024–29 మధ్య ఐదేళ్లలో 15 లక్షల మంది మహిళలకు సాయం నిలిచిపోతుంది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున ఐదేళ్లలో కనిష్టంగా రూ.750 కోట్లను పేద, మధ్యతరగతి బాలింతలు నష్టపోతున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోంది. మొదటి ఏడాదిలో రూ.5 వేలు చొప్పున ఇప్పటికే బాలింతలకు దాదాపు రూ.150 కోట్ల మేర కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే సక్రమంగా తమకు ఆసరా సాయం అంది ఉండేదని వీరు చెబుతున్నారు. ఇలా పెద్ద మొత్తంలో పేదింటి మహిళలకు నష్టం చేకూర్చి కేవలం రూ.వందలు విలువచేసే కిట్లు పంపిణీకి ప్రభుత్వం ప్రయత్నిస్తుండడంపై వారు దుమ్మెత్తి పోస్తున్నారు.కిట్‌ల కొనుగోలులోనూ లూటీ తంతు?ఇక ఆస్పత్రులకు మందుల సరఫరా.. అత్యవసర వైద్యసేవల కల్పన.. రోగనిర్ధారణ.. ఇలా వివిధ రకాల కాంట్రాక్టులను ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు అవినీతిమయంగా మార్చేశారు. అయినవాళ్లు, పెద్ద మొత్తంలో కమీషన్లు ఇచ్చే సంస్థలకే కాంట్రాక్టు కట్టబెట్టడం ద్వారా పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇదే తంతు బేబీ కిట్‌ల కొనుగోలులోనూ చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికే బేబీ కిట్‌లు సరఫరా చేసే ఒకరిద్దరు కాంట్రాక్టర్లు ఓ అమాత్యుడిని కలిసినట్లు తెలిసింది. ఆ అమాత్యుడి సిఫార్సుతో వీరు వైద్యశాఖను సంప్రదించినట్లు సమాచారం.

Amitabh Bachchan breaks silence on Operation Sindoor6
సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది

కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్‌ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్‌ సిందూర్‌లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్‌ రాయ్‌ బచ్చన్‌) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్‌ సిందూర్‌... జై హింద్‌... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్‌ను షేర్‌ చేశారు అమితాబ్‌ బచ్చన్‌.

Miss World Contestants for Nagarjunasagar this evening7
నేడు సాగర్‌.. రేపు చార్మినార్‌..

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా తలపెట్టిన కార్యక్రమాలను ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించనున్నారు. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య యుద్ధ వాతావరణం, పోటీదారుల భద్రత నేపథ్యంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణపై నిర్వాహకులు తొలుత సందిగ్ధంలో పడ్డారు. ముఖ్యంగా చార్మినార్‌ వద్ద హెరిటేజ్‌ వాక్, అనంతరం పాత నగరంలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు కార్యక్రమాలు రద్దు చేసే అంశాన్ని పరిశీలించారు. కానీ ఇప్పుడు వాటిని యధావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. సరిహద్దులో ఉద్రిక్తతలు కొంత తగ్గిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఈ కార్యక్రమాలను యధావిధిగా నిర్వహించనున్నారు. స్వాగత విందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉంది. ఇక సోమవారం సాయంత్రం పోటీదారులు, విదేశీ ప్రతినిధులు నాగార్జున సాగర్‌ సమీపంలోని బుద్ధవనం పర్యటనకు వెళ్లనున్నారు. బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ జరిగే కార్యక్రమాన్ని వారు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అక్కడే రాత్రి విందు అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరతారు. చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకు నడక మంగళవారం సాయంత్రం పోటీదారులు చార్మినార్‌ నుంచి లాడ్‌బజార్‌ వరకు నడుస్తూ పరిసరాలను వీక్షిస్తారు. షాపింగ్‌ చేస్తారు. చార్మినార్‌ చరిత్రను తెలుసుకుంటారు. అనంతరం చౌమొహల్లా ప్యాలెస్‌లో జరిగే స్వాగత విందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా సంప్రదాయ వాద్యకచేరీ కొనసాగుతుంది. విందులో ఇంటర్‌ కాంటినెంటల్, తెలంగాణ వంటకాలు విందులో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌ ధమ్‌ కీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా, బగారా బైంగన్, పత్తర్‌ కీ ఘోష్, పనీర్‌ టిక్కా, పులావ్, దహీ వడ, పానీపురి, బాదుషా, గులాబ్‌ జామూన్‌ లాంటి వంటకాలు రుచి చూపించనున్నారు. ధమ్‌ కీ బిర్యానీ ఎక్కువ మసాలా ఘాటు లేకుండా తయారు చేయాలని ఆదేశించారు. ఇక యూరప్, ఆఫ్రికా, ఆమెరికా, కరేబియన్, ఆసియా ఓషియానా ప్రాంతాల సుందరీమణులు సైతం ఉన్నందున వారి స్థానిక వంటకాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. పోటీల్లో పొల్గొనే సుందరీమణుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరంలోని నాలుగు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లనుంచి మెనూ తెప్పించి పరిశీలించి, ఒక హోటల్‌కు ఆర్డర్‌ ఇచ్చారు. ఆసియా వంటకాలలో సుషీ (జపాన్‌), డిమ్‌సమ్‌ (చైనా), థాయ్‌ గ్రీన్‌ కర్రీ (థాయ్‌లాండ్‌) వంటివి, యూరోపియన్‌ వంటకాలైన ఇటాలియన్‌ పాస్తా, ఫ్రెంచ్‌ రాటటౌలీ, స్పానిష్‌ పాయెల్లా, అమెరికా ఖండానికి సంబంధించిన మెక్సికన్‌ టాకోస్, బ్రెజిలియన్‌ ఫెయిజోడా, అమెరికన్‌ బార్బెక్యూ రిబ్స్‌ లాంటివి, ఆఫ్రికాకు చెందిన ఇథియోపియన్‌ డోరో వాట్, మొరాకన్‌ టాగిన్, హమ్ముస్‌తో పాటు మెడిటరేనియన్‌ ఫలాఫెల్, క్వినోవా సలాడ్‌ లాంటి వాటిని వడ్డించే వీలుందని సమాచారం. మెనూను మిస్‌ వరల్డ్‌ లిమిటెడ్‌ ప్రతినిధులకు చూపి వారు అనుమతించినవే సిద్ధం చేస్తారని తెలుస్తోంది. మే 26న హైటెక్స్‌లో జరిగే గలా డిన్నర్‌ సందర్భంగా తెలంగాణ ఫుడ్‌ ఫెస్టివల్‌ కూడా ఉంటుందని చెబుతున్నారు.

IPL 2025 set to resume by May 168
16 లేదా 17 నుంచి ఐపీఎల్‌!

న్యూఢిల్లీ: ప్రతీ వేసవిలో మెరుపు క్రికెట్‌ వినోదాన్ని పంచే ఐపీఎల్‌కు ఈసారి ఉద్రిక్త పరిస్థితుల సెగ తగిలింది. భారత్, పాక్‌ల మధ్య డ్రోన్ల యుద్ధంతో లీగ్‌ను వారంపాటు వాయిదా వేశారు. ఇపుడు తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్న బీసీసీఐ ఐపీఎల్‌ పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ వారాంతంలోనే ఆటను తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ నెల 16 లేదంటే 17 నుంచి ఐపీఎల్‌ మళ్లీ మొదలవనుంది. ఫైనల్‌ వేదికను కోల్‌కతా నుంచి అహ్మదాబాద్‌కు మార్చే యోచనలో బీసీసీఐ ఉంది. ఈ మార్పునకు వర్ష సూచనే కారణమని తెలిసింది. ఆటగాళ్ల సంసిద్ధత, విదేశీ ఆటగాళ్లను వెంటనే రప్పించే ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయాలని రేపటికల్లా ఫ్రాంచైజీలన్నీ రెడీగా ఉండాలని బీసీసీఐ సూచించింది. అన్నీ డబుల్‌ హెడర్‌లేనా? ఈ నెలాఖరుకల్లా ఐపీఎల్‌ను పూర్తిచేయాలని పట్టుదలతో ఉన్న లీగ్‌ పాలకమండలి మిగతా లీగ్‌ మ్యాచ్‌ల్ని డబుల్‌ హెడర్‌ (రోజూ రెండు మ్యాచ్‌ల చొప్పున)లుగా నిర్వహించే ప్రణాళికతో ఉంది. హైదరాబాద్‌లోనే ఆ రెండు ప్లే ఆఫ్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు ఎలాంటి నిరాశలేకుండా ముందనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే రెండు ‘ప్లేఆఫ్స్‌’ మ్యాచ్‌లు ఉప్పల్‌ స్టేడియంలోనే జరుగుతాయని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి. తేదీలు మారినా... తొలి క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారు. అయితే రెండో క్వాలిఫయర్‌ సహా ఫైనల్‌ పోరుకు వేదికైన కోల్‌కతాలోనే వాతావరణ సమస్యలు ఎదురవుతాయని తెలిసింది. ఈ నేపథ్యంలో విజేతను తేల్చే మ్యాచ్‌కు వర్షం అడ్డులేకుండా ఉండేలా అహ్మదాబాద్‌ను ఫైనల్‌ వేదికగా ఖరారు చేసే అవకాశముంది. మొత్తానికి సోమవారం షెడ్యూల్‌పై కసరత్తు పూర్తి చేస్తారని ఐపీఎల్‌ వర్గాలు తెలిపాయి.

India Operation Sindoor Success Over Pakistan9
అన్ని విధాలా భారత్‌దే పైచేయి.. ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు చావుదెబ్బ

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్‌ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్‌ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే.లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్‌ హాహాకారాలు పాక్‌ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్‌ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్‌ తేలి్చచెప్పింది.

Hubble Telescope sees wandering black hole slurping up stellar spaghetti10
నక్షత్రాన్నే నమిలేస్తూ.. మింగేస్తూ

నక్షత్రం అంటేనే అంతులేని ఉష్ణంతో, దేదీప్యమానంగా వెలిగిపోతూ వందల కోట్ల కిలోమీటర్ల దాకా కాంతిని వెదజల్లే శక్తియంత్రం. అలాంటి నక్షత్రాన్ని అరటిపండులా అమాంతం మింగేస్తున్న రాకాసి కృష్ణబిలం జాడను అత్యంత అధునాతన హబుల్‌ టెలిస్కోప్‌ కనిపెట్టింది. నక్షత్రం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్న ఈ బ్లాక్‌హోల్‌ మిగతా కృష్ణబిలాల్లా నక్షత్రమండలం(గెలాక్సీ) కేంద్రస్థానంలో కాకుండా కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా ఉండటం మరో విశేషం. గెలాక్సీ మధ్యలో కాకుండా చాలా దూరంగా సైతం భారీ కృష్ణబిలాలు మనగల్గుతాయని, వాటి అపారమైన గురుత్వాకర్షణ బలాలు సమీప స్టార్‌లనూ సమాధి చేస్తాయని తొలిసారిగా వెల్లడైంది. సాధారణంగా నక్షత్రాలను కృష్ణబిలం తనలో కలిపేసుకునే (టైడల్‌ డిస్ట్రప్షన్‌ ఈవెంట్‌–టీడీఈ) దృగ్విషయం గెలాక్సీ మధ్యలో చోటుచేసుకుంటుంది. కానీ ఇలా టీడీఈ అనేది గెలాక్సీ మధ్యలో కాకుండా వేరే చోట సంభవించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ‘ఏటీ2024టీవీడీ’అని పేరు పెట్టారు. మింగేస్తున్న ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి ఆ అంతర్థానమవుతోన్న నక్షత్రం ద్రవ్యరాశికంటే ఏకంగా 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. నక్షత్రమండలం కేంద్రస్థానం చుట్టూ తిరిగే ఏదైనా నక్షత్రం అనుకోకుండా కృష్ణబిలం చెంతకు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ బ్లాక్‌హోల్‌ ఉందనే విషయం తెలుస్తుంది. బ్లాక్‌ తాను మింగేసే ఖగోళ వస్తువును ఉన్నది ఉన్నట్లుగాకాకుండా ఆకారాన్ని నూడుల్స్‌లాగా సాగదీసి సాగదీసి లోపలికి లాగేసుకుంటుంది. ఈ ప్రక్రియనే స్పాగెటిఫికేషన్‌ అంటారు. తాజాగా నక్షత్రాన్ని మింగేస్తున్న క్రమంలోనే ఈ కృష్ణబిలం ఉనికి వెలుగులోకి వచ్చింది. అమెరికా శాండిగోలోని పాలోమార్‌ అబ్జర్వేటరీలోని ఆప్టికల్‌ కెమెరా తొలిసారిగా దీనిని గుర్తించింది. ఈ బ్లాక్‌హోల్‌ మన భూమికి ఏకంగా 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. హబుల్‌ టెలిస్కోప్‌ దీనిపై మరింత పరిశోధన చేసింది. సాధారణంగా కృష్ణబిలంలోకి నక్షత్రం లాగబడే క్రమంలో ఆ నక్షత్రం ఊహించనంత స్థాయిలో అతినీలలోహిత కాంతిని బయటకు వెదజల్లుతుంది. తర్వాత బ్లాక్‌హోల్‌ లోపలికి వెళ్లిపోయి ఆ స్టార్‌ అంతర్థానమవుతుంది. కేంద్రం నుంచి ఎంతో దూరంలో బ్లాక్‌హోల్‌ ఈ బ్లాక్‌హోల్‌ తనకు ఆశ్రయం ఇచ్చిన నక్షత్రమండలానికి సంబంధించిన కేంద్రస్థానంలో ఉండకుండా ఏకంగా 2,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీంతో కేంద్రస్థానంలోని బ్లాక్‌హోల్స్‌ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తుందేమో అని తెల్సుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలోకి దిగింది. ఈ కృష్ణబిలంపై ఓ కన్నేశామని చంద్ర ఎక్స్‌–రే అబ్జర్వేటరీ, నేషనల్‌ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీలోని వెరీ లార్జ్‌ అరే రేడియో టెలిస్కోప్‌ పరిశోధకుల బృందాలు తెలిపాయి. రెండు గెలాక్సీల విలీనం తర్వాత ఇలాంటి కృష్ణబిలాలు ఇలా సుదూరంగా మిగిలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. లేదంటే రెండు అయస్కాంతాల తరహాలో రెండు కృష్ణబిలాల వ్యతిరేక బలాల వల్ల ఇది సుదూరంగా నెట్టివేయబడి ఉండొచ్చని ఇంకొందరు అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. ‘‘కేంద్రస్థానంలో స్థిరంగా ఉండిపోకుండా ఇలా సంచార జీవిలా ఎక్కడో మౌనంగా ఉన్న ఇలాంటి కృష్ణబిలాలు కొత్త తరహా పరిశోధనలకు సాయపడతాయి’’అని బెర్‌క్లీలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోరి్నయాలో సంబంధిత పరిశోధనలో ప్రధాన రచయిత, ఖగోళశాస్త్రంలో పోస్ట్‌ డాక్టోరల్‌ యుహాన్‌ యాఓ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న వెరీ సి.రూబిన్‌ అబ్జర్వేటరీ సాయంతో ఇలాంటి ఖగోళ వింతలను మరింత పరిశోధన జరగనుంది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement