Employement
-
టెలికంలో కొలువుల మేళా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయిలో నియామకాలు పెరుగుతున్నాయి. 2025 ప్రథమార్ధంలో కంపెనీలు 45 శాతం మంది ఫ్రెషర్లను తీసుకునే యోచనలో ఉన్నాయి. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరియర్ ఔట్లుక్ నివేదిక (2025 జనవరి–జూన్ ప్రథమార్ధం)లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, టెలికం రంగం వేగంగా 5జీ నెట్వర్క్, క్లౌడ్ సిస్టమ్స్ వైపు మళ్లుతూ, సైబర్ సెక్యూరిటీకి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిశ్రమలో ఉద్యోగాల కల్పన గణనీయంగా ఉంటోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరులో ఫ్రెషర్ల హైరింగ్ స్థిరంగా కొనసాగుతోంది. నైపుణ్యాలకు ప్రాధాన్యత ప్రత్యేక నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్ఎఫ్ ఇంజినీర్లు, నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్టులు, ఫీల్డ్ టెక్నికల్ ఇంజినీర్లు, జూనియర్ డెవాప్స్ ఇంజినీర్లు, క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్లు మొదలైన వారికి డిమాండ్ ఉంటోంది. హైరింగ్‌పై కంపెనీల ఆసక్తి, గతేడాది ద్వితీయార్థంలో (జులై–డిసెంబర్) నమోదైన 48 శాతం నుంచి స్వల్పంగా కాస్త తగ్గినప్పటికీ నియామకాల జోరు మాత్రం కొనసాగుతోంది. ఆర్ఎఫ్ ఇంజినీర్లకు ఢిల్లీ (49 శాతం), అహ్మదాబాద్ (41 శాతం), కోయంబత్తూర్‌లో (35 శాతం) అత్యధికంగా డిమాండ్ నెలకొంది. నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్టులకు బెంగళూరు, ముంబై, నాగ్‌పూర్‌లో వరుసగా 48 శాతం, 43 శాతం, 38 శాతం మేర డిమాండ్ ఉంది. ఇక ఫీల్డ్ టెక్నికల్ ఇంజినీర్లకు హైదరాబాద్ (55 శాతం), కోల్‌కతా (48 శాతం), ఇండోర్‌లో (43 శాతం) ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జూనియర్ డెవాప్స్ ఇంజినీర్లకు పుణె (44 శాతం), గురుగ్రాం (40 శాతం), కొచి్చలో (35 శాతం) డిమాండ్ ఉంది. అటు క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్లకు చెన్నై (51 శాతం), నాగ్‌పూర్ (45 శాతం), చండీగఢ్‌లో (37 శాతం) అత్యధికంగా నియామక అవకాశాలు నమోదయ్యాయి. డొమైన్ సర్టిఫికేషన్లు కావాలి.. ఫ్రెషర్లకు టెలికం రంగంలో వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఉంటున్నప్పటికీ, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్లాంటి నిర్దిష్ట డొమైన్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటోంది. ఆర్ఎఫ్ వైర్లెస్ ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్లో సర్టీఫికేషన్లకు డిమాండ్ నెలకొంది. సంక్లిష్టమైన నెట్వర్క్ వినియోగాన్ని క్రమబద్ధీకరణ, మేనేజ్మెంట్ కార్యకలాపాల నిర్వహణకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, టాస్క్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాంలు లాంటి టెక్నాలజీ టూల్స్ వినియోగం కీలకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక నైపుణ్యాలతో సరిపెట్టుకోకుండా, ఉద్యోగార్థులు అనలిటికల్ రీజనింగ్, పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మల్చుకోవడం, ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ సహా సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా దృష్టి పెట్టాలని టీమ్‌లీజ్ ఎడ్టెక్ వ్యవస్థపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు. ‘‘టెలికం పరిశ్రమ వృద్ధి చెందుతున్నప్పటికీ, కంపెనీలు కేవలం కార్యకలాపాల విస్తరణ కోసమే ఉద్యోగులను తీసుకోవడం లేదు. విశిష్టమైన నైపుణ్యాలున్న ప్రతిభావంతులను తీసుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి. ఆర్ఎఫ్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ ఎకోసిస్టమ్స్లాంటి అంశాల్లో సర్టిఫికేషన్లు ఉన్న ఫ్రెషర్లు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం టెలికం విధుల్లో ఐటీ, డేటా కార్యకలాపాలు కూడా కలిసి ఉంటున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఇలా మారిన పరిస్థితులను బట్టి బోధనాంశాలను కూడా సవరించడంపై విద్యా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగార్థులు కూడా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి’’ అని చెప్పారు. -
ఏటా 80 లక్షల ఉద్యోగాలు
న్యూయార్క్: వచ్చే 10–12 ఏళ్లలో భారత్ ఏటా 80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తేనే 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలన్న లక్ష్యం సాకారమవుతుందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకోసం స్థూల దేశీయోత్పత్తిలో తయారీ రంగం వాటా కూడా మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 1990లలో సంస్కరణలు అమల్లోకి వచ్చాక సుమారు ముప్ఫై ఏళ్ల పాటు దేశానికి వెలుపల పరిస్థితులు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ, వచ్చే 10–20 ఏళ్ల పాటు అలా ఉండకపోవచ్చని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో చైనా ఏ విధంగానైతే తయారీ రంగంలో ఆధిపత్యం సాధించిందో, మనం కూడా జీడీపీలో తయారీ రంగ వాటాను పెంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కొలంబియా వర్సిటీలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. సంపన్న దేశాలకు కృత్రిమ మేథ, టెక్నాలజీ, రోబోటిక్స్లాంటివి సవాలు కాదని, కానీ అభివృద్ధి ప్రస్థానంలో ఉన్న దేశాలకు సమస్యాత్మకంగా ఉండవచ్చని పేర్కొన్నారు. ‘భారీ జనాభా ఉండే భారత్ ఇది పెద్ద సవాలే. దీనికి సులభతరమైన సమాధానాలేమీ లేవు. ఓవైపు, ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలకు, ఐటీ నైపుణ్యాల అవసరం తక్కువగా ఉండే సరీ్వస్ కొలువులకు కృత్రిమ మేథతో ముప్పు పొంచి ఉంది. మరోవైపు, ఏటా 80 లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం నెలకొంది‘ అని నాగేశ్వరన్ వివరించారు.చిన్న సంస్థలకు అనుకూల పరిస్థితులు కల్పించాలి..2047 నాటికి భారతీయ సంస్థలను అంతర్జాతీయ వేల్యూ చెయిన్లలో భాగం చేయడంతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) అనుకూల పరిస్థితులు కల్పించాల్సి ఉంటుందని నాగేశ్వరన్ చెప్పారు. తయారీ, ఎంఎస్ఎంఈలు రెండూ కలిసి ప్రయాణిస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శక్తివంతమైన తయారీ హబ్‌లుగా ఎదిగిన దేశాలన్నింటిలోనూ ఎంఎస్ఎంఈలకు అనువైన పరిస్థితులను కల్పించడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా పెట్టుబడుల ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందని నాగేశ్వరన్ చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను మరింత రాబట్టుకోవడమో లేదా వచ్చిన పెట్టుబడులను మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంపైనో దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.8 శాతం వృద్ధి రేటు కష్టమే.. ప్రస్తుత పరిస్థితుల్లో 8 శాతం వృద్ధి రేటును నిలకడగా సాధించడం కష్టమైన వ్యవహారమేనని నాగేశ్వరన్ తెలిపారు. అయితే, దేశీయంగా నియంత్రణలను సడలించడంపై దృష్టి పెట్టి, రాబోయే ఒకటి..రెండు దశాబ్దాల పాటు స్థిరంగా 6.5 శాతం వృద్ధినైనా సాధించగలిగితే.. నెమ్మదిగా 7 శాతం వైపు వెళ్లొచ్చని ఆయన చెప్పారు. విధానాలపరంగా చూస్తే, గతంలోలాగా జీడీపీ వృద్ధిలో ఎగుమతులు ప్రాధాన్య పాత్ర పోషించే పరిస్థితి ఉండకపోవచ్చని నాగేశ్వరన్ వివరించారు. ఆర్థిక సంక్షోభానికి ముందు తొలి దశాబ్దకాలంలో ఏటా జీడీపీ వృద్ధిలో ఎగుమతుల వాటా 40 శాతం వరకు ఉండేదని, అప్పట్లో స్థూల దేశీయోత్పత్తి సగటున 8–9 శాతం స్థాయిలో వృద్ధి నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. రెండో దశాబ్ద కాలంలో జీడీపీ వృద్ధిలో ఎగుమతుల వాటా 20 శాతానికి పడిపోయిందని, మూడో దశాబ్ద కాలంలో ఇది మరింతగా తగ్గిపోవచ్చని నాగేశ్వరన్ చెప్పారు. అలాగని ఎగుమతులను తక్కువ చేసి చూడటానికి వీల్లేదని, వాటితో పాటు దేశీయంగా నాణ్యత, పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, లాజిస్టిక్స్, లాస్ట్–మైల్ కనెక్టివిటీలాంటి అంశాలపైనా మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుందని వివరించారు. -
కాంట్రాక్ట్ మహిళా టెకీలకు సవాళ్లు
ముంబై: కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నాలజీ ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వారు ఎక్కువగా ఎంట్రీ స్థాయికే పరిమితమవుతున్నారే తప్ప కెరియర్లో పెద్దగా ముందుకెళ్లలేకపోతున్నారు. అలాగే పురుషులతో పోలిస్తే వేతనాల్లోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయి. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, రిమోట్ వర్క్ అవకాశాలు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే (డీఈఐ) విధానాలు గత నాలుగేళ్లలో మహిళా టెకీల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. 2020లో కాంట్రాక్టు టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య 9.51 శాతంగా ఉండగా, 2024లో ఇది 27.98 శాతానికి పెరిగింది. ఐటీ సర్వీసుల రంగంలో మహిళా సిబ్బంది వాటా 7.8 శాతం నుంచి 21.2 శాతానికి పెరిగింది. అయితే, ఇది చెప్పుకోతగ్గ స్థాయిలో కెరియర్ పురోగతికి దారితీయడం లేదు. మధ్య స్థాయి ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం 4.13 శాతం నుంచి 8.93 శాతానికి మాత్రమే పెరగడం ఇందుకు నిదర్శనం. ఎంట్రీ స్థాయిని దాటి పురోగమించేందుకు మహిళలకు గణనీయంగా అవరోధాలు ఉండటాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. 2020–2024 మధ్య టీమ్‌లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బందిలోని 13,000 మంది అసోసియేట్స్ గణాంకాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వేతనాల్లోనూ వ్యత్యాసాలు.. వేతనాల విషయానికొస్తే పురుషులు, మహిళల మధ్య ఎంట్రీ స్థాయి కొలవుల్లో 6 శాతం, మధ్య స్థాయి ఉద్యోగాల్లో 19 శాతం వరకు వ్యత్యాసం ఉంటోంది. అయితే, సీనియర్ స్థాయిలో మాత్రం 13 శాతంగా ఉంటోంది. ‘కాంట్రాక్ట్ టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం హర్షణీయమే అయినప్పటికీ, లింగ సమానత సాధించాలంటే నియామకాల పరిధికి మించి బహుముఖ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. లీడర్షిప్ స్థానాల్లో మహిళలకు ప్రాతినిధ్యం అంతగా లేకపోవడం, పురుషులతో పోలిస్తే వేతనాల మధ్య వ్యత్యాసాలు అలాగే కొనసాగుతుండటమనేది వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులను చేయాల్సిన ఆవశ్యకతను సూచిస్తోంది. మహిళలు ఉద్యోగాల్లో చేరడమే కాకుండా, కెరియర్లో పురోగమించేందుకు, సారథ్య బాధ్యతల్లో రాణించేందుకు అవసరమైన పరిస్థితులను కలి్పంచే దిశగా కంపెనీలు కృషి చేయాలి‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు. -
పీఎమ్ఈజీపీ రుణాలు..: పెన్నుల నుంచి పాలిమర్స్ దాకా...
మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఉన్న పథకాలు, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ మెలకువలు, అందుతున్న రుణాలు, వడ్డీ రేటు, సబ్సిడీలు, ఎక్కడ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అవసరమైన డాక్యుమెంట్లు, సక్సెస్ రేట్ వంటి వివరాలను ‘‘ఓనర్‘షి’ప్’’ పేరుతో ప్రతి శనివారం అందిస్తున్నాం! ఈ వారం స్కీమ్ పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్.పీఎమ్ఈజీపీ... ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. 2008లో మొదలైన ఈ పథకం గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి కల్పించి వారి ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎమ్ఎస్ఎమ్ఈ (MSME) పర్యవేక్షణలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమీషన్ కేవీఐసీ ద్వారా ఇది అమలవుతోంది. రూ. లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు రుణసౌకర్యం అందుతోంది. అభ్యర్థులు పది శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకుల ద్వారా 90 శాతం రుణ సహాయాన్ని పొందవచ్చు. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, దివ్యాంగులు, మాజీ ఆర్మీ సిబ్బంది మాత్రం అయిదు శాతం పెట్టుబడి పెట్టుకుంటే బ్యాంకులు 95 రుణాన్ని అందిస్తాయి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ఫిజికల్లీ చాలెంజ్డ్, ట్రాన్స్‌జెండర్స్, గ్రామీణ ప్రాంతం వారికి 35 శాతం రాయితీ కూడా లభిస్తుంది. జనరల్ కేటగిరీలోని వారికేమో పట్టణాల్లో 15 శాతం, గ్రామీణ ప్రాంతంలో 25 శాతం సబ్సిడీ కేటాయించారు. ఇలా దరఖాస్తు చేసుకోవాలి... ముందుగా అభ్యర్థులు పీఎమ్ఈజీపీ పోర్టల్‌లోకి వెళ్లి అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి. అందులో వివరాలను స్పష్టంగా, పూర్తిగా నింపాలి. తర్వాత దాన్ని గ్రామీణప్రాంతాలవారైతే కేవీఐసీకి, పట్టణ ప్రాంతం వారైతే డీఐసీకి అప్లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకున్న 10 నుంచి 15 రోజుల్లో అధికారుల నుంచి స్పందన ఉంటుంది. అధికారుల తనిఖీ అనంతరం వారి సూచన మేరకు.. కేంద్రప్రభుత్వ సంస్థలు ఇస్తున్న ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ శిక్షణ తీసుకోవాలి. ఆ శిక్షణకు సంబంధించిన పరీక్ష కూడా పాసై, సర్టిఫికెట్ పొందాలి. అర్హతలు... 18 ఏళ్లు నిండి, కనీసం ఎనిమిదవ తరగతి పాసై ఉండాలి. స్వయం సహాయక బృందాలు కూడా అర్హులే! ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సిన పత్రాలు... 1. వ్యాపారానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్, 2. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో సహా వివరాలు నమోదు చేసిన అప్లికేషన్ ఫామ్, 3. ఐడీ, అడ్రస్ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్, 4. శిక్షణ పొందిన ఆంట్రప్రెన్యూర్ డెవలప్మెంట్ప్రోగ్రామ్ సర్టిఫికెట్. 5. ఎక్స్‌పీరియెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్. వ్యాపారాలు... పేపర్ నాప్కిన్స్, పేపర్ బ్యాగ్స్, పేపర్ ప్లేట్స్.. అనుబంధ ఉత్పత్తులు, నాన్ ఓవెన్ బ్యాగ్స్, పెన్నుల తయారీ, షాంపూ, డిటర్జెంట్లు, ఆర్టిఫిషియల్ ఆర్నమెంట్స్ తయారీ, ΄్యాక్డ్ వాటర్, ఎల్ఈడీ లైట్లు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు వంటి ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ పరికరాలు, రసాయన పాలిమర్లు, టెక్స్టైల్స్, ఫారెస్ట్ ఇండస్ట్రీ వంటివాటికీ ఈ పథకం కింద రుణాలు పొందవచ్చు. గ్రామీణప్రాంతాల్లో వ్యవసాయాధారిత, పాడి, వర్తక విభాగాల్లోనూ దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. 2022– 2025 మధ్య కాలంలో ఈ పథకానికి 13,554.42 కోట్ల రూపాయలను కేటాయించారు.– బి.ఎన్. రత్న, బిజినెస్ కన్సల్టెంట్, దలీప్మీ సందేహాలను పంపవలసిన మెయిల్ ఐడీ : ownership.sakshi@gmail.comనిర్వహణ : సరస్వతి రమ -
ఉపాధికి చేయూత కావాలి
బలమైన ఆర్థిక వృద్ధికి ఉపాధి కల్పన ఎంతో అవసరం. ఇందుకు వీలుగా మౌలిక రంగం, ఆతిథ్యం, స్టార్టప్‌లు, ఎడ్టెక్, ఎంఎస్ఎంఈ రంగాలకు కావాల్సిన పెట్టుబడులు సమకూర్చడంతోపాటు, ప్రోత్సాహకాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి, శిక్షణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ మేరకు చర్యలు అవసరమని తెలిపాయి. పర్యాటకం–ఆతిథ్యం ఉపాధి కల్పనలో, ఆర్థిక వ్యవస్థకు చేయూతలో ఆతిథ్య పరిశ్రమ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు నూర్మహల్ గ్రూప్ సీఎండీ మన్బీర్ చౌదరి చెప్పారు. 2047 నాటికి జీడీపీలో 3 ట్రిలియన్ డాలర్ల పర్యాటకం లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా, ఆతిథ్య పరిశ్రమకు బడ్జెట్ 2025లో ప్రోత్సాహకాలకు చోటు కల్పించాలని కోరారు. ఈ రంగానికి పరిశ్రమ హోదా డిమాండ్ ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నట్టు తెలిపారు. ఈ హోదా కల్పిస్తే ఆతిథ్య పరిశ్రమకు రుణ సదుపాయాలు మెరుగుపడతాయన్నారు. ఎడ్టెక్ డేటా సైన్స్, పునరుత్పాదక ఇంధనం, కృత్రిమ మేధ (ఏఐ) నైపుణ్యాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సిల్వర్‌లైన్ ప్రెస్టీజ్ స్కూల్ వైస్ చైర్మన్, విద్యా రంగ విధానాల నిపుణుడు నమన్ జైన్ సూచించారు. నైపుణ్య అభివృద్ధి, శిక్షణపై మరిన్ని పెట్టుబడులు స్థిరమైన వృద్ధికి కీలకమన్నారు. సరిపడా నైపుణ్యాలు లేకపోవడం వల్లే ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. భారత్ 7–8 శాతం వృద్ధి రేటును సాధించేందుకు ఉపాధి కల్పనను పెంచాలని ఇటీవలే మెకిన్సే అధ్యయనం సూచించడాన్ని వెర్టెక్స్ గ్లోబల్ సర్వీసెస్ సీఈవో గగన్ అరోరా గుర్తు చేశారు. 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్టార్టప్‌లు స్టార్టప్‌లు, వెంచర్ స్టూడియోల అవసరాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని టీ9ఎల్ క్యూబ్ వ్యవస్థాపకుడు గౌరవ్ గగ్గర్ కోరారు. స్టార్టప్‌లకు ఏంజెల్ ట్యాక్స్ తొలగించడాన్ని గొప్ప చర్యగా అభవర్ణించారు. దీనివల్ల పెట్టుబడులు రాక పెరుగుతుందన్నారు. పరిశ్రమకు నిధుల సమస్య ప్రధానంగా ఉందని, బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో స్టార్టప్ ఎకోసిస్టమ్ (వ్యవస్థ)కు వెంచర్ స్టూడియోలు ఊతంగా నిలుస్తున్నట్టు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళతరం చేయడంతోపాటు, మరింత మెరుగ్గా రుణాలు అందేలా చూడాలని కోరారు. పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లకు నిధులు సమకూర్చే వెంచర్ క్యాపిటలిస్టులకు పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించాలని గౌరవ్ గగ్గర్ డిమాండ్ చేశారు. దీనివల్ల దేశ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు ఎంతో ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త ఉద్యోగానికి సై
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో ఎక్కువ మంది ఈ ఏడాది కొత్త ఉద్యోగం కోసం అన్వేషించనున్నారు. ఈ అన్వేషణ ఇంతకుముందెన్నడూ లేనంత కఠినంగా ఉండనున్నట్టు ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ లింక్డెన్ ఇండియా నిర్వహించిన అధ్యయనంలో తెలిపింది. అర్హతలు ఉన్న నిపుణులను గుర్తించడం సవాలుగా 69 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన దరఖాస్తుల పరిశీలన కోసం హెచ్ఆర్ నిపుణులు రోజులో 3–5 గంటల సమయాన్ని వెచ్చిస్తున్నారు. 49 శాతం మంది గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అన్ని అర్హత ప్రమాణాలు సరితూగే దరఖాస్తుదారులు సగం కంటే తక్కువే ఉంటున్నట్టు 55 శాతం హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ‘‘ఉద్యోగ మార్కెట్ కఠినంగా మారుతోంది. ఉద్యోగాన్వేషణ మరింత ఆలోచనాత్మకంగా ఉండాలని ఇది సంకేతమిస్తోంది. మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా సవాళ్లతో కూడిన ఉద్యోగ మార్కెట్లోనూ కొత్త అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, కెరీర్లో మంచి వృద్ధిని చూడొచ్చు’’అని లింక్డెన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరీర్ ఎక్స్పర్ట్ నిరజిత బెనర్జీ అన్నారు. గతేడాది నవంబర్ 27 నుంచి, డిసెంబర్ 16 మధ్య ఈ అధ్యయనం జరిగింది. ఇందులో 22,010 మంది నిపుణులు పాల్గొన్నారు. భారత్‌తోపాటు, స్పెయిన్, ఐర్లాండ్, బ్రెజిల్, యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ, ఆస్ట్రేలియా, జపాన్, స్వీడన్, సింగపూర్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అధ్యయనం కొనసాగింది. ఈ ఉద్యోగాల్లో వృద్ధి ఎక్కువ.. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్, రోబోటిక్స్ టెక్నీషియన్, క్లోజింగ్ మేనేజర్ ఈ ఏడాది భారత్‌లో ఎక్కువ వృద్ధి చెందే ఉద్యోగాలుగా లింక్డెన్ తెలిపింది. భారత్‌లో ప్రతి ఐదుగురు వృత్తి నిపుణుల్లో ముగ్గురు కొత్త రంగంలో, కొత్త విభాగంలో ఉద్యోగానికి సంసిద్ధంగా ఉండగా.. కొత్త అవకాశాలను సొంతం చేసుకునేందుకు వీలుగా నైపుణ్యాలను నేర్చుకోనున్నట్టు 39 శాతం మంది చెప్పారు. భవిష్యత్తులో ప్రతి ఉద్యోగానికి సంబంధించిన విలువను కృత్రిమ మేథ (ఏఐ) పెంచనున్నట్టు ఈ అధ్యయనం తెలిపింది. మహిళలు మరిన్ని ఉద్యోగ పాత్రల్లోకి అడుగుపెట్టున్నట్టు పేర్కొంది. నవంబర్‌లో పెరిగిన ఉపాధి ఈపీఎఫ్ఓ సభ్యత్వంలో 4.88 శాతం పెరుగుదల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ)లో సభ్యత్వం నవంబర్‌లో 4.88 శాతం (2023 నవంబర్‌తో పోల్చి) పెరిగింది. ఉపాధి పెరుగుదలను సూచిస్తూ సమీక్షా నెల్లో ఈపీఎఫ్ఓలో 14.63 లక్షల నికర సభ్యత్వం నమోదయినట్లు తాజా పేరోల్ గణాంకాలు పేర్కొన్నాయి. ఇక 2024 అక్టోబర్‌తో పోల్చితే నికర సభ్యత్వం నెలవారీగా 9.07 శాతం పెరగడం గమనార్హం. నవంబర్‌లో నికర మహిళా సభ్యుల చేరిక 3.13 లక్షలు. అక్టోబర్‌తో పోల్చితే ఇది 12.16 శాతం అధికం. వార్షిక పెరుగుదల 11.75 శాతం. నెలలో 20.86 శాతం నికర సభ్యుల చేరికతో మహారాష్ట్ర ముందుంది. మహారాష్ట్ర తర్వాత ఐదు శాతానికిపైగా సభ్యత్వ నమోదులతో కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌లు నిలిచాయి. -
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
పచ్చని కొలువులు తోడుంటే..!
2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలనేది భారత్ లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు పడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులకు తెరతీయడంతో.. గ్రీన్ జాబ్స్‌కు ఫుల్ డిమాండ్ నెలకొంది.పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కంపెనీలు ఇప్పుడు నిపుణులకు రారామ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తోడు మరిన్ని కొత్త ప్రాజెక్టులు జతవుతుండటంతో భారీగా సిబ్బంది కొరత నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, విక్రమ్ సోలార్, జెన్సాల్ గ్రూప్ తదితర సంస్థలు నియామకాల జోరు పెంచిన వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్, వాతావరణ విశ్లేషణ, సోలార్ సెల్–మాడ్యూల్ తయారీ, కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో నిపుణులకు భారీగా అవకాశాలున్నాయనేది పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు, హెచ్ఆర్ ఏజెన్సీల మాట! సౌర, పవన విద్యుత్‌తో పాటు జల, అణు విద్యుత్ ఇతరత్రా హైబ్రీడ్ ప్రాజెక్టులు రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తాయి. అదానీ.. 50 గిగావాట్లు బహుముఖ రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. పునరుత్పాదక ఇంధనంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. సౌర, పవన, హైబ్రీడ్ ప్రాజెక్టుల విస్తరణకు అనుగుణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రధాన కార్యకలాపాలు, మెయింటెనెన్స్‌లో నిపుణుల నియమాకాలపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 2030 నాటికి 50 గిగావాట్ల (జీడబ్యూ) రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని అదానీ లక్ష్యంగా పెట్టుకుంది. డేటా సైంటిస్టులు, ఎలక్ట్రికల్–సివిల్ ఇంజినీర్లు, బిజినెస్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సరఫరా వ్యవస్థల స్పెషలిస్టులతో పాటు పరికరాల ప్రొక్యూర్మెంట్లో అనుభవం గల వారికి కూడా కంపెనీ పెద్దపీట వేస్తోంది.హైరింగ్‌లో టాటా ‘పవర్’ ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ; సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్స్–మెయింటెనెన్స్, ఇంజినీరింగ్–టెక్నాలజీ తదితర ఉద్యోగాల భర్తీలో తలమునకమైంది. భారీ ప్రాజెక్టులకు తోడు, రూఫ్‌టాప్ సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 2,500 పైగా సిబ్బంది ఉన్నారు. ‘పునరుత్పాదక విద్యుత్‌కు సంబంధించి ప్రాజెక్టులు ఫాస్ట్‌ట్రాక్‌లో నడుస్తున్నాయి. ఈ మేరకు అనేక ఎంఓయూలు కుదుర్చుకున్నాం. గుజరాత్లో 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటిద్వారా అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ భారీ విస్తరణ, వృద్ధికి అనుగుణంగా హైరింగ్ జోరు పెంచుతున్నాం’ అని టాటా పవర్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ హిమల్ తివారీ పేర్కొన్నారు. ఇక జెన్సాల్ గ్రూప్ బ్యాటరీలు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్–ల్యాండ్ డెవలప్మెంట్, పర్యావరణం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో నిపుణుల వేటలో ఉంది. 2024–2032 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన మార్కెట్ వార్షికంగా 8.7 శాతం వృద్ధి (సీఏజీఆర్) చెందుతుందని అంచనా. → 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలనేది భారత్ లక్ష్యం. → ప్రస్తుతం భారత్‌లో గ్రీన్ ఎనర్జీ (భారీ జలవిద్యుత్, అణు విద్యుత్‌తో సహా) ఉత్పత్తి సామర్థ్యం 208 గిగావాట్లు. మొత్తం విద్యుదుత్పత్తిలో ఇది దాదాపు 46%. గత 9 ఏళ్లలో 400 శాతం ఎగబాకడం విశేషం. → సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత 9 ఏళ్లలో 30 రెట్లు ఎగసి 89.4 గిగావాట్లకు చేరింది. → పవన విద్యుత్ సామర్థ్యం 2014 నుంచి ఇప్పటిదాకా రెట్టింపునకు పైగా ఎగసి 47.19 గిగావాట్లకు చేరుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐటీ కొలువులు.. చిగురిస్తున్న ఆశలు!
ఐటీ రంగం ఉద్యోగాల విషయంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం (2023–24, క్యూ1)లో వరుసగా ఏడో క్వార్టర్లోనూ టాప్–5 ఐటీ దిగ్గజాల మొత్తం సిబ్బంది సంఖ్య తగ్గింది. అయితే, గతంతో పోలిస్తే తగ్గుదల జోరుకు భారీగా అడ్డుకట్ట పడటం సానుకూలాంశం. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా మళ్లీ ఐటీ రంగం పెరిగిన ఉద్యోగులతో కళకళలాడే పరిస్థితి వస్తుందంటున్నారు పరిశ్రమ విశ్లేషకులు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా... దేశీ ఐటీ రంగంలో ఇవి టాప్–5 కంపెనీలు. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో వీటి మొత్తం సిబ్బంది సంఖ్య సీక్వెన్షియల్‌గా (గతేడాది క్యూ4తో పోలిస్తే) 2,034 మంది తగ్గారు. అయితే, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా.. ఈ మూడు దిగ్గజాలు మాత్రం ఏప్రిల్–జూన్ క్వార్టర్లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడం విశేషం.‘గడిచిన ఐదు క్వార్టర్లలో ఉద్యోగుల తగ్గుదల జోరుకు క్రమంగా అడ్డుకట్ట పడటం సానుకూల పరిణామం’ అని హైరింగ్ కంపెనీ ఎక్స్‌ఫెనో బిజినెస్ హెడ్ (టెక్నాలజీ సిబ్బంది నియామకాలు) దీప్తి ఎస్ పేర్కొన్నారు. టాప్–5లో మూడు దిగ్గజ సంస్థలు క్యూ1లో నికరంగా ఉద్యోగులను జత చేసుకోవడంతో నియామకాల రికవరీ ఆశలు చిగురిస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ఐటీ పరిశ్రమ మళ్లీ కొత్త ఉద్యోగుల చేరికలతో కళకళలాడే అవకాశం ఉందని కూడా ఆమె అంచనా వేస్తున్నారు. హైరింగ్‌పై ఆర్థిక అనిశ్చితి ఎఫెక్ట్... దేశీ ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లయిన అమెరికా, యూరప్‌లలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుండటంతో గత ఏడాదిన్నరగా హైరింగ్‌కు ముఖం చాటేస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఉద్యోగాల్లో కోతలకు కూడా తెరతీశాయి. అయితే, ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 ఫలితాల్లో ఈ ప్రతికూల పరిస్థితులు సద్దుమణుగుతున్న సంకేతాలు వెలువడ్డాయి. టాప్–5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య ఈ జూన్ నాటికి 15,23,742కు చేరింది. మార్చి చివరికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 15,25,776గా నమోదైంది. టీసీఎస్ సిబ్బంది 6,06,998కి చేరింది. కొత్తగా 5,452 మంది జతయ్యారు. ఇన్ఫోసిస్ ఉద్యోగుల సంఖ్య 3.15 లక్షలకు చేరింది. 1,908 మంది తగ్గారు. హెచ్‌సీఎల్ టెక్‌లో దాదాపు 8,000 మంది తగ్గుదలతో మొత్తం సిబ్బంది 2.27 లక్షలకు చేరారు. విప్రోలో ఉద్యోగుల సంఖ్య క్యూ1లో స్వల్పంగా 337 మంది పెరిగి 2.34 లక్షలకు చేరింది. టెక్ మహీంద్రాకు నికరంగా 2,165 మంది జతకావడంతో మొత్తం ఉద్యోగులు 1.47 లక్షలకు పెరిగారు. అయితే, గతేడాది క్యూ1 నాటి సిబ్బంది సంఖ్యతో పోలిస్తే బిగ్–5 కంపెనీల్లో 46,325 మంది ఉద్యోగులు తగ్గారు. గడిచిన రెండేళ్లలో టాప్–5 కంపెనీల మొత్తం ఉద్యోగుల సంఖ్య 3 శాతం తగ్గగా... అంతక్రితం మూడేళ్ల కాలంతో పోలిస్తే 18 శాతం పెరిగారని దీప్తి తెలిపారు. ఐటీ హైరింగ్ విషయంలో సాధారణ స్థాయికి రావడానికి మరికొన్నాళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, తాజా గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయని ఆమె చెబుతున్నారు. 2,034: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ1లో సీక్వెన్షియల్‌గా తగ్గుదల.15,23,742: ఈ ఏడాది జూన్ (క్యూ1) చివరి నాటికి ఈ బిగ్5 కంపెనీల మొత్తం సిబ్బంది సంఖ్య 15,23,742. 5: గడిచిన ఐదు త్రైమాసికాలుగా సిబ్బంది తగ్గుదల క్రమంగా శాంతించడం సానుకూలాంశం. ఫ్రెషర్లకు చాన్స్.. ఐటీ రంగంలో ఫ్రెషర్ల హైరింగ్ భారీగా పుంజుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15,000–20,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ క్యూ1 ఫలితాల సందర్భంగా ప్రకటించింది. విప్రో సైతం 10,000–12,000 మందికి ఈ ఏడాది ఉద్యోగావకాశాలు కల్పిస్తా మని పేర్కొంది. ప్రధానంగా జెనరేటివ్ ఏఐ, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ విభాగాల్లో కూడా అదనంగా ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. క్యూ1లో 3,000 మంది ఫ్రెషర్లకు (న్యూ జెన్ అసోసియేట్స్) అవకాశం ఇచి్చనట్లు తెలిపింది. ఇక హెచ్‌సీఎల్ టెక్ కొత్తగా 10,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని ప్రకటించింది. టీసీఎస్ సైతం క్యాంపస్ హైరింగ్‌పై దృష్టిపెడుతోంది. మొత్తంమీద ఈ ఐటీ పరిశ్రమ ఫ్రెష్ హైరింగ్ 1,00,000–1,20,000 స్థాయిలో ఉండొచ్చని హెచ్ఆర్ కన్సల్టెన్సీ ఎక్స్‌ఫెనో అంచనా. గతేడాది 60,000 స్థాయితో పోలిస్తే ఇది భారీగానే లెక్క. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Union Budget 2024-25: ఉపాధికి ఊతం.. ధరలకు కళ్లెం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో వృద్ధి రేటు అంచనాలను ప్రభుత్వం అచితూచి నిర్ధేశించింది. స్థూలదేశీయోత్తత్తి (జీడీపీ) వృద్ధి 6.5–7 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్థిక సర్వేలో లెక్కగట్టింది. ఉపాధి కల్పనను పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కిచెప్పింది. ధరాభారంతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీ లేదా కూపన్ల రూపంలో నిర్ధిష్టంగా ఆర్థిక తోడ్పాటు కల్పించాల్సిఇన అవసరం ఉందని కూడా సర్వే సూచించింది. దేశంలో తయారీ రంగానికి తోడ్పాటు అందించడంతో పాటు ఎగుమతులను పెంచాలంటే చైనా నుంచి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెంచాల్సిందేనని స్పష్టం చేసింది. కాగా, గతేడాది (2023–24) 8.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే, ఈ ఏడాది వృద్ధి రేటు అంచనాలు చాలా తక్కువగా ఉండటం విశేషం. ఆర్బీఐ నిర్దేశించిన 7.2 శాతం వృద్ధి రేటు అంచనాలతో పోలి్చనా సర్వేలో వృద్ధి అంచనా తగ్గింది. అనిశి్చత వర్షపాతం, ప్రైవేటు రంగంలో పెట్టుబడుల మందగమనం వంటివి వృద్ధి అంచనాల తగ్గుదలకు ప్రధాన కారణంగా సర్వే పేర్కొంది. ‘భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన వృద్ధి బాటలో పయనిస్తోంది. ప్రపంచ భౌగోళిక, రాజకీయ సవాళ్లన్నింటినీ దీటుగా ఎదుర్కొంటోంది’ అని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సర్వే ముందుమాటలో పేర్కొన్నారు. కాగా, నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడం ద్వారా మధ్యకాలం పాటు నిలకడగా 7% వృద్ధి రేటు కొనసాగవచ్చని సర్వే తేల్చిచెప్పింది.కార్మిక సంస్కరణలు వేగవంతం... కేంద్రంలో వరుసగా మూడోసారి కొలువుదీరిన మోదీ సర్కారు 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా 2024–25 పూర్తి స్థాయి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేటు పెట్టుబడులను పెంచడం, చిన్న–మధ్య తరహా వ్యాపారాలకు చేయూతనందించడం, సాగును లాభసాటిగా మార్చేలా వ్యవసాయ సంస్కరణలు, వాతావరణ మార్పుల సమస్యను ఎదుర్కొనేందుకు వనరుల సమీకరణ, ఆర్థిక అసమానాతలను తగ్గించడం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. విద్య, ఉపాధి మధ్య అంతరాన్ని పూడ్చాలని కూడా సర్వే నొక్కిచెప్పింది. దేశంలో ఉద్యోగ కల్పనకు మరింత సానుకూల వాతావరణాన్ని సృష్టించాలంటే కార్మిక సంస్కరణల అమలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొంది. ‘దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుగుణంగా 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సి ఉంటుంది’ అని సర్వే తెలిపింది. చైనా పెట్టుబడులు పెరగాలి... భారత్ ఎగుమతులు, దేశీ తయారీ రంగం మరింత పుంజుకోవాలంటే, చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) పెరగాలని, లేదంటే చైనా సరఫరా వ్యవస్థతో భారత్ అనుసంధానం కావాల్సి ఉంటుందని సర్వే అభిప్రాయపడింది. మరోపక్క, చైనా నుంచి దేశంలోకి దిగుమతులు తగ్గాలని కూడా పేర్కొంది. ‘అమెరికా తదితర కీలక మార్కెట్లకు భారత్ ఎగుమతులు భారీగా పెరగాలంటే చైనా పెట్టుబడులపై మనం మరింత దృష్టి సారించాలి. తూర్పు ఆసియా దేశాలు గతంలో ఇదే విధంగా లబ్ధి పొందాయి’ అని సర్వే తెలిపింది. 2020లో గాల్వాన్‌లో చోటు చేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా భారత్ టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా 200 చైనా మొబైల్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం బీవైడీ భారీ పెట్టుబడి ప్రతిపాదనలను కూడా తిరస్కరించింది. 2000–2024 మధ్య భారత్ అందుకున్న మొత్తం ఎఫ్‌డీఐలలో చైనా కేవలం 0.37% (2.5 బిలియన్ డాలర్లు) వాటాతో 22 స్థానంలో ఉంది. కాగా, కీలక ఖనిజాల విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సర్వే స్పష్టం చేసింది.పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీవడ్డీరేట్ల నిర్ణయంలో ఆహార ధరలను పక్కనబెట్టండి... ఆర్బీఐకి సర్వే సూచన వడ్డీ రేట్లను నిర్ణయించడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆహార ద్రవ్యోల్బణాన్ని చూడటం మానేయాలని ఆర్థిక సర్వే సూచించింది. అధిక ఆహార ధరలను ఎదుర్కోవటానికి పేదలకు కూపన్లు లేదా ప్రత్యక్ష నగదు బదిలీని ప్రభుత్వం అన్వేíÙంచాలని సర్వే పేర్కొంది. ‘‘భారతదేశ ద్రవ్యోల్బణ లక్ష్య ఫ్రేమ్‌వర్క్.. ఫుడ్ ఆరి్టకల్స్‌ను పక్కనబెట్టాలి. అధిక ఆహార ధరలు చాలా సందర్భాల్లో సరఫరాలకు సంబంధించిన సమస్యే తప్ప, డిమాండ్ ప్రేరితం కాదు’’ అని ఆర్థిక సర్వే పేర్కొంది. మధ్య, దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం అవుట్‌లుక్ ధరల యంత్రాంగం పటిష్టత, మార్కెట్ అంశాలు, నిత్యావసారాల దేశీయ ఉత్పత్తి, దిగుమతులు వంటి అంశాలపై ఆధారపడుతుందని వివరించింది. అననుకూల వాతావరణం, తక్కువ రిజర్వాయర్ స్థాయిలు, పంట నష్టం వ్యవసాయ ఉత్పత్తిని ప్రభావితం చేసి, గత రెండేళ్లలో ఆహార ధరలను పెంచడానికి దారితీసిందని కూడా సర్వే పేర్కొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు–రెపో (ప్రస్తుతం 6.5 శాతం) నిర్ణయానికి ఆర్బీఐ వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై ఆధారపడే సంగతి తెలిసిందే. ప్లస్ 2 లేదా మైనస్ 2తో ఇది 4 శాతంగా ఉండాలే చూడాలని ఆర్బీఐకి కేంద్రం నిర్ధేశిస్తోంది. ఈ సూచీలో ఫుడ్ ఆరి్టకల్స్ ఒక భాగం. రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం లక్ష్యాన్ని సాధించడంలో ఆహార ధరలు ఒడిదుడుకులు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. ఇదే అంశంపై ఆందోళన వ్యక్తంచేస్తూ ఆర్బీఐ 2023 ఫిబ్రవరి నుంచి యథాతథ వడ్డీరేట్ల వ్యవస్థను కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పక్కనపెట్టి... రుణ రేట్లను తగ్గిస్తే ఆ నిర్ణయం వృద్ధికి దోహదపడుతుందన్నది సర్వే అభిప్రాయం. ప్రయివేట్ రంగ పెట్టుబడులు కీలకం ప్రయివేట్ రంగ ఫైనాన్సింగ్, కొత్త వర్గాల నుంచి వనరుల సమీకరణ దేశీయంగా నాణ్యమైన మౌలిక సదుపాయాల(ఇన్ఫ్రా) నిర్మాణానికి కీలకమని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పాలసీలు, సంస్థాగత మద్దతుతోపాటు.. రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సైతం ప్రధాన పాత్ర పోషించవలసి ఉంటుంది. మౌలిక రంగంలోని వివిధ విభాగాలకు పెట్టుబడులు సమకూర్చడంలో గణాంకాలు, మార్గదర్శకాలు తదితర నివేదికలు అత్యవసరం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కున్న డిమాండ్‌ను అంచనా వేయడం, ఉపవిభాగాల కల్పనలో సౌకర్యాల వినియోగం వంటి అంశాలకు ప్రస్తుత డేటాబేస్ సామర్థ్యం సరిపోదు. ఆర్థికపరమైన ఒత్తిడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏకీకృత ప్రణాళికల నేపథ్యంలో ఆచరణసాధ్యమైన ప్రాజెక్టులను చేపట్టి పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం కీలకమవుతుంది.రైల్వేల సామర్థ్యం పెరగాలి.. సామర్థ్యాలను వేగంగా పెంచుకోవడం, కార్యకలాపాలను ఆధునీకరించుకోవడం, ఇంధన ఆదా తదితర అంశాలపై రైల్వేస్ ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే సూచించింది. ఇందుకు అనుగుణంగా సరకు రవాణా కోసం ప్రత్యేక కారిడార్లు, హై స్పీడ్ రైళ్లు, వందే భారత్.. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ .. ఆస్థా స్పెషల్ ట్రెయిన్స్ వంటి ఆధునిక ప్యాసింజర్ సరీ్వస్ రైళ్లు, అధిక సామర్థ్యం ఉండే రైల్వే కోచ్‌లు, లాస్ట్–మైల్ రైల్ లింకేజీలు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేయాలని పేర్కొంది. లాజిస్టిక్స్ వ్యయాలను, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు రైల్వేస్ 3 ప్రధాన కారిడార్ల రూపకల్పనలో ఉందని వివరించింది. ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే కారిడార్లు, ఇంధన.. ఖనిజ.. సిమెంట్ కారిడార్లు, రైల్ సాగర్ (పోర్టు కనెక్టివిటీ) కారిడార్లు వీటిలో ఉన్నాయని పేర్కొంది.పర్యాటక రంగంలో అవకాశాలు అపారం..పర్యాటక రంగం కలి్పస్తున్న అవకాశాలను సొంతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. కరోనా విపత్తు తర్వాత పర్యాటక రంగం వేగంగా కోలుకోవడాన్ని ప్రస్తావించింది. ‘2023లో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించారు. క్రితం ఏడాదితో పోల్చి చూస్తే 43.5 శాతం ఎక్కువ. భారత పర్యాటక రంగం వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచంలో 39వ ర్యాంక్ సొంతం చేసుకుంది. పర్యాటకం ద్వారా రూ. 2.3 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభించింది. ఇది క్రితం ఏడాదితో పోలి్చతే 65.7% అధికం’అని సర్వే తెలిపింది. కృత్రిమ మేథ (ఏఐ) భారత సేవల ఎగుమతులపై ప్రభావం చూపిస్తుందన్న ‘క్యాపిటల్ ఎకనమిక్స్’ నివేదికను ప్రస్తావిస్తూ.. ఉపాధి కల్పన విషయంలో తక్కువ నైపుణ్యాలపై ఆధారపడిన పర్యాటకం ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తోందని పేర్కొంది. వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకందేశీ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా మారుతున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. టెక్నాలజీ, ఇన్నొవేషన్, డిజిటైజేషన్ దన్నుతో మూలధన నిర్మాణం, పెట్టుబడుల విస్తరణలో క్యాపిటల్ మార్కెట్ల వాటా బలపడుతోంది. అంతేకాకుండా దేశీ స్టాక్ మార్కెట్లు ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక విపత్కర పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ రిసు్కలు, వడ్డీ రేట్లుసహా కమోడిటీ ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలోనూ దేశీ క్యాపిటల్ మార్కెట్లు గతేడాది(2023–24) ఉత్తమ పనితీరు చూపిన వర్ధమాన మార్కెట్లలో ఒకటిగా నిలిచాయి. ఈ కాలంలో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఇన్వెస్టర్లకు భారీ(25%కిపైగా) రిటర్నులు అందించాయి. ఇందుకు స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వం, దేశీ ఇన్వెస్టర్ల బలిమి తోడ్పాటునిచి్చనట్లు సీతారామన్ పేర్కొన్నారు. 2024 మే నెలలో ఈక్విటీ మార్కెట్ల విలువ 5 ట్రిలియన్ డాలర్ల(రూ. 415 లక్షల కోట్లు)కు చేరింది. ప్రస్తుతం 9.5 కోట్లమంది రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యక్షంగా 2,500 లిస్టెడ్ కంపెనీలలో 10% వాటాను కలిగి ఉన్నారు. గతేడాది ప్రైమరీ మార్కెట్ల ద్వారా రూ. 10.9 లక్షల కోట్ల మూలధన ఏర్పాటుకు సహకారమందింది.వ్యవసాయంలో సత్వర సంస్కరణలు వ్యవసాయ రంగంలో సంస్కరణలను వెంటనే చేపట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. లేదంటే ఈ రంగంలో నెలకొన్న వ్యవస్థీకృత సమస్యలు దేశ వృద్ధికి అడ్డుపడతాయని విధానకర్తలను హెచ్చరించింది. తూర్పు ఆసియా దేశాలు, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలి్చతే.. దేశ వ్యవసాయరంగం సామర్థ్యాలను ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి తేవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పనకు వ్యవసాయరంగ సామర్థ్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ రంగంపై దేశవ్యాప్తంగా చర్చలు అవసరమని నాగేశ్వరన్ పిలుపునిచ్చారు. ‘‘దేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ఎలాంటి సంక్షోభంలో లేదు. కాకపోతే నిర్మాణాత్మక మార్పు అవసరం. ఎందుకంటే వాతావరణ మార్పులు, నీటి సమస్య రానున్న రోజుల్లో పెద్దవి కానున్నాయి’’అని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విద్యుత్, ఆదాయపన్ను, మద్దతు ధరల పరంగా సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ ప్రస్తుత విధానాలను తిరిగి సమీక్షించా లని అభిప్రాయపడింది. టెక్నాలజీ ఆధునికీకరణ, మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచడం, సాగులో ఆవిష్కరణలు, వ్యవసాయం–పరిశ్రమల మధ్య అనుసంధానత పెంపు దిశగా సంస్కరణలను సూచించింది. ఆర్థిక సర్వే హైలైట్స్..→ అసాధారణరీతిలో వరుసగా మూడోసారి ప్రజలు మోదీ 3.0 సర్కారుకు పట్టం కట్టడం దేశంలో రాజకీయపరమైన, విధానపరమైన స్థిరత్వాతనికి అద్దం పడుతోంది. → అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయ వృద్ధి చోదకాలు 2023–24లో ఆర్థిక పురోగతికి దన్నుగా నిలిచాయి. → భౌగోళిక, రాజకీయ సవాళ్లను ధీటుగా ఎదుర్కొంటూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన, స్థిరమైన ప్రగతిని సాధిస్తోంది. → కరోనా మహమ్మారి తదనంతరం దేశీయ వ్యాపార, వాణిజ్య రంగం రికవరీ కోసం ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంది. → వాణిజ్యం, పెట్టుబడులు, వాతావారణ మార్పుల వంటి ప్రపంచ సమస్యల విషయంలో వివిధ దేశాలతో ఒప్పందాలు క్లిష్టతరంగా మారాయి. → స్వల్పకాలానికి ద్రవ్యోల్బణం అంచనాలు తగ్గుముఖ ధరోణిలోనే ఉన్నప్పటికీ, పప్పుధాన్యాల కొరత , ధరల ఒత్తిడి నిలకడగా కొనసాగుతోంది. → సాధారణ వర్షపాతం, దిగుమతులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ధరలు శాంతించడంతో ఆర్బీఐ సానుకూల ద్రవ్యోల్బణం అంచనాలకు దన్నుగా నిలుస్తోంది. → అధిక ఆహార ధరలతో అల్లాడుతున్న పేదలు, అల్పాదాయ వర్గాలకు ప్రత్యక్ష నగదు బదిలీలు, నిర్దిష్ట కొనుగోళ్లకు కూపన్ల రూపంలో కొంతకాలం పాటు ప్రయోజనాలను అందించాలి. → భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానంపై ప్రభావం చూపొచ్చు. → భారతదేశ ఆర్థిక సేవల రంగం పటిష్టమైన అవకాశాలున్నాయి. ఈ రంగంలో కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా, దేశీయంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. → కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు పటిష్టంగా ఉండటంతో ప్రైవేటు పెట్టుబడులు మరింత పుంజుకోనున్నాయి. → పన్ను నిబంధలనను సరళతరం చేయడం, వ్యయ నియంత్రణ, డిజిటైజేషన్ వంటివి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను సాధించేందుకు దోహదం చేస్తున్నాయి. → భారత వృద్ధి పథానికి క్యాపిటల్ మార్కెట్లు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచ రాజకీయ, ఆర్థిక షాక్‌లకు మన మార్కెట్లు ఎదురొడ్డి నిలుస్తున్నాయి. → చైనా నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) జోరందుకోవడం వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థలు మెరుగుపరచడంలో, ఎగుమతులను పెంచుకోవడంలో భారత్‌కు దన్నుగా నిలుస్తుంది. → 2024లో దేశంలోకి వచి్చన రెమిటెన్సులు (ప్రవాసులు స్వదేశానికి పంపిన నిధులు) 3.4 శాతం వృద్ధితో 124 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ ఏడాది ఈ మొత్తం 129 బిలియన్ డాలర్లను తాకనుంది.గ్రీన్ ఎనర్జీ @ రూ. 30 లక్షల కోట్ల పెట్టుబడులు దేశీయంగా 2024–2030 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన (ఆర్ఈ) రంగంలో రూ. 30.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలవని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం స్థల సమీకరణ సమస్యలను పరిష్కరించుకోవడం, సానుకూల నిబంధనలతో నిధులను సమీకరించుకోవడం కీలకమని పేర్కొంది. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ లక్ష్యాలను సాధించే క్రమంలో వివిధ విభాగాలకు ఆర్థికంగా లబ్ధి చేకూరగలదని వివరించింది. మరోవైపు, ఉద్గారాల విషయంలో 2070 నాటికి తటస్థ స్థాయికి చేరుకోవాలంటే భారత్‌కు ఏటా సగటున 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని సర్వే తెలిపింది. నిధులను సమకూర్చుకోవడమనేది ఒక అసాధారణ సవాలు కాగలదని వివరించింది.14 శాతం ఐఫోన్ల తయారీ ఇక్కడే ఎల్రక్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా భారత్ తన వాటాను పెంచుకుంటున్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. 2023–24లో స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ యాపిల్ 14% ఐఫోన్లను భారత్‌లోనే అసెంబుల్ చేసినట్టు వెల్లడించింది. దేశ ఎలక్ట్రానిక్స్ తయారీ 2014 తర్వాత నుంచి గణనీయమైన వృద్ధిని చూస్తోందంటూ, 2021–22లో అంతర్జాతీయంగా మన వాటా 3.7%. దేశ జీడీపీలో 4% వాటాను ఆక్రమించింది. ఎల్రక్టానిక్స్ ఎగుమతుల్లో మొబైల్ ఫోన్ల విభాగం అధిక వృద్ధిని చూస్తోందని, అమెరికాకు మొబైల్ ఫోన్ల ఎగుమతులు 2022–23లో 2.2 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2023–24లో 5.7 బిలియన్ డాలర్లకు దూసుకుపోయినట్టు వివరించింది. 2022–23లో దేశీయంగా ఎల్రక్టానిక్స్ తయారీ రూ.8.22 లక్షల కోట్లకు చేరితే, ఎగుమతులు రూ.1.9 లక్షల కోట్లకు పెరిగినట్టు తెలిపింది.ఏటా 78 లక్షల కొలువులు సృష్టించాలి.. కార్మిక శక్తి పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయేతర రంగాల్లో 2030 నాటికి ఏటా దాదాపు 78.5 లక్షల ఉద్యోగాలను కలి్పంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి అనేది ఉద్యోగాల కల్పన కన్నా జీవనోపాధి కల్పించడంపై ఆధారపడి ఉంటుందని సర్వే వివరించింది. వ్యవసాయ రంగంలో కార్మిక శక్తి 2023లో 45.8 శాతం స్థాయి నుంచి 2047 నాటికి 25 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇదంతా వ్యవసాయేతర రంగాల వైపు మళ్లు తుంది కాబట్టి ఆ మేరకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుందని సర్వే పేర్కొంది. పీఎల్ఐ స్కీములు, మిత్రా టెక్స్టైల్ స్కీము మొదలైనవి ఇందుకు కొంత తోడ్పడగలవని తెలిపింది. స్టాఫింగ్ కంపెనీల ద్వారా తాత్కాలిక సిబ్బంది నియామకాలు పెరుగుతున్నందున అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు దీన్నొక మాధ్యమంగా ఉపయోగించుకోవచ్చని వివరించింది. తయారీ రంగ శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి సాధన దిశగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు వ్యాపారసంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పునఃసమీక్షించాలని సూచించింది. వర్కర్ల తొలగింపునకు కాకుండా ఉద్యోగాల కల్పనకు కృత్రిమ మేథ(ఏఐ)రెని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై కార్పొరేట్లు మరింతగా దృష్టి పెట్టాలని ముందుమాటలో ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. వికసిత భారత్ వైపు పయనంవికసిత భారత్‌ను నిర్మించే దిశగా ముందుకు సాగుతున్నందున ప్రస్తుత పటిష్టతలతోపాటు మరింత పురోగతికి అవకాశాలు ఉన్న మార్గాలను సర్వే గుర్తించింది. ఆర్థిక సర్వే మన ఆర్థిక వ్యవస్థ ప్రబలమైన పటిష్టతలతను హైలైట్ చేస్తోంది. మా ప్రభుత్వం తీసుకువచి్చన వివిధ సంస్కరణల ఫలితాలను కూడా సుస్పష్టం చేస్తోంది. – ఎక్స్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అంచనాలు సుసాధ్యం7 శాతం వృద్ధి రేటు సాధన భారత్‌కు తేలికే. మేము నిరాశావాదులం కాదు. రుతుపవనాల పురోగతి సవాళ్లను కూడా మేము పరిగణనలోకి తీసుకుంటున్నాము. ఫైనాన్షియల్ రంగం అవుట్‌లుక్ పటిష్టంగా కనబడుతోందని, పొదుపులను ఫైనాన్షియల్ మార్కెట్లవైపునకు మళ్లించడాన్ని చూస్తే.. భారత్ కుటుంబాలు కష్టాల్లో లేవన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. – వి. అనంత నాగేశ్వరన్, సీఈఏ పార్లమెంట్లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నేపథ్యంలో బడ్జెట్ బృందంతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి పంకజ్ చౌదరి -
కష్టాలకు గొడుగు పట్టారు
కేరళలోని అట్టపాడి గిరిజనప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు అనేకం చోటు చేసుకున్నాయి. కారణం పౌష్టికాహార లోపం. పోషకాలు ఇచ్చే అటవీ ఆహారం నశించిపోయి గర్భిణులకు తిండి కరువైంది. దాంతో ఒక స్వచ్ఛంద సంస్థ వారిని గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చింది. 2015 నుంచి ‘కార్తుంబి’ (తూనీగ) అనే బ్రాండ్ కింద ఆ గిరిజన మహిళలు తయారు చేస్తున్న గొడుగులు దేశమంతా అమ్ముడుపోతున్నాయి. తాజాగా ప్రధాని మోడి తన ‘మన్ కీ బాత్’లో వీరిని శ్లాఘించారు. కర్తుంబి గురించి....‘కేరళ సంస్కృతిలో గొడుగులు ఒక భాగం. అక్కడి కార్తుంబి గొడుగుల గురించి నేను ప్రస్తావించ దలుచుకున్నాను. రంగు రంగుల ఆకర్షణీయమైన ఈ గొడుగులను ఆదివాసి మహిళలు తయారు చేస్తారు. కేరళలోని చిన్న పల్లె నుంచి తయారయ్యే ఈ గొడుగులు నేడు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలకు చేరుతున్నాయి. ఓకల్ ఫర్ లోకల్‌కు ఇంతకుమించిన ఉదాహరణ ఏం కావాలి’ అని జూన్ 30న తన 111వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడి కర్తుంబి గొడుగుల గురించి చేసిన ప్రస్తావన అక్కడి గిరిజన మహిళల ముఖాన చిర్నవ్వులు తేవడమే కాదు దేశవ్యాప్తంగా వారు సాగిస్తున్న కృషిని తెలిపింది. చాలామంది నేడు కార్తుంబి గొడుగుల గురించి తెలుసుకుంటున్నారు. ఆ గాథతో స్ఫూర్తి పొందుతున్నారు.పాలక్కాడ్‌లో గిరిజనులుపాలక్కాడ్లోని లోపలి పల్లెల్లో ముడుగ, ఇరుల, కర్ముగ తదితర గిరిజనులు ఉంటారు. చాలా ఏళ్లపాటు వీరికి డబ్బు అవసరం ఏర్పడలేదు. అటవీ ఆహారమే వీరి ఆహారం. అయితే 2012 నుంచి ఈప్రాంతంలో నవజాత శిశువుల మరణాలు ఎక్కువగా నమోదవడం స్వచ్ఛంద సంస్థలు గమనించాయి. 2012 నుంచి 2015 వరకు ఇక్కడ అనధికారికంగా 200 శిశుమరణాలు జరిగి ఉంటాయని అంచనా. ఇందుకు కారణం గర్భిణులకు పౌష్టికాహారం లేకపోవడమే. ‘మేము తినే కందమూలాలు, పండ్లు, ఆకుకూరలు ఇప్పుడు అడవుల్లో లేవు. క్రూరమృగాల భయం వల్ల మేము వ్యవసాయం చేయము. మాకు అంతిమంగా డబ్బుతో అవసరం ఏర్పడింది. అది మా దగ్గర లేదు. కాబట్టి మేము ఆహారం కొనుక్కుని తినే పరిస్థితుల్లో లేము’ అని అక్కడ మహిళలు చె΄్పారు. దాంతో పాలక్కాడ్‌లో గిరిజనుల కోసం పని చేసే ‘తంపు’ అనే స్వచ్ఛంద సంస్థ వీరి సమస్యను లోకానికి తెలియచేసింది. గల్ఫ్‌లో పని చేస్తున్న కేరళీయుల బృందం వీరి సాయానికి ముందుకు వచ్చింది. ఫలితంగా ఏర్పడిందే ‘కార్తుంబి’ గొడుగుల బ్రాండ్.రంగుల తూనీగపాలక్కాడ్లో పిల్లల కోసం పని చేసే ఒక సంస్థ ‘కార్తుంబి’ (తూనీగ) పేరుతో అందరికీ తెలుసు. అందరినీ ఆకర్షించే ఈ పేరుతోనే బ్రాండ్ ఏర్పాటు చేసి ఆదివాసీ మహిళలకు గొడుగుల తయారీలో శిక్షణ ఇచ్చారు. మొదట 70 మందిని ఎంపిక చేసి వారికి మెటీరియల్ సరఫరా చేస్తే గొడుగులు ఎలా చేయాలో నేర్పారు. ఆ తర్వాత వారు తమ రోజువారీ పనులు చేసుకుంటూనే ఇంట్లో వీలైనప్పుడల్లా గొడుగులు తయారు చేసే వెసులుబాటు ఇచ్చారు. ఒక గొడుగు తయారు చేస్తే 30 రూపాయల కూలీతో ఈ పని మొదలైంది. 2017 నుంచి కేరళ గిరిజన సంక్షేమ శాఖ ఫండ్ రిలీజ్ చేస్తోంది. వీరి నుంచి తయారైన గొడుగులు వివిధ సంస్థల ద్వారా మార్కెటింగ్ అవుతున్నాయి.సీజన్లో 17 వేల గొడుగులు70 మంది మహిళలతో మొదలైన ఈ పని నేడు 350 గిరిజన మహిళలకు చేరుకుంది. వీరు జనవరి నుంచి మే చివరి వరకు మాత్రమే పని చేస్తారు. జూన్ మొదటి వారంలో మాన్సూన్ రావడంతో గొడుగుల అమ్మకాలు ఉంటాయి కాబట్టి. ఒక సీజన్లో వీరంతా కనీసం 17 వేల గొడుగులు తయారు చేస్తున్నారు. ఒక్కొక్క మహిళ రోజుకు 700 నుంచి వేయి రూపాయల వరకు సంపాదిస్తుంది. ఈ త్రీఫోల్డ్ గొడుగులు మెటీరియల్‌ను బట్టి 350 రూపాయల నుంచి 649 రూపాయల వరకూ అందుబాటులో ఉన్నాయి.గొడుగుల దానంచలికాలంలో రగ్గుల దానం ఎంత అవసరమో వానాకాలంలో గొడుగుల దానం అంత అవసరం. కార్తుంబి గొడుగుల మార్కెటింగ్ కోసం ఒక టెకీ సంస్థ కార్పొరేట్ సంస్థలను సంప్రదించి వారిచేత గొడుగులు కొనేలా చేస్తోంది. ఉద్యోగులకు, పేదవారికి ఉచితంగా ఇచ్చేలా చూస్తుంది. అలాగే కేరళలో వానాకాలంలో స్కూళ్లకు వచ్చిపోయే పేద పిల్లలకు గొడుగులు చాలా అవసరం. అందుకే ‘స్కూలు పిల్లలకు కార్తుంబి గొడుగులు’ పేరుతో కూడా క్యాంపెయిన్లు జరుగుతుంటాయి. సీజన్ మొదట్లో బల్క్‌గా ఈ గొడుగులు కొని పిల్లలు పంచుతుంటారు చాలామంది. ఇప్పుడు ప్రధాని ప్రసంగం వల్ల కేరళలోని ఇతర మహిళలు కూడా ఈ గొడుగుల తయారీ పట్ల ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో వానలొస్తే రంగు రంగుల కార్తుంబి తూనీగలు ప్రతి ఒక్కరి నెత్తిమీద ఎగురుతుంటాయని ఆశిద్దాం. -
Sahithi chiluveru: టెకీ ఉద్యోగం నుంచి టేస్టీ ఫుడ్ బిజినెస్ వరకు
ఒక అందమైన ఆలోచనను సక్రమంగా అమలులో పెడితే పల్లెటూరు నుంచి కూడా విదేశాలకు విస్తరించవచ్చు అని నిరూపిస్తుంది చిలువేరు సాహితి. చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఉపాధిని సృష్టిస్తోంది. 26 ఏళ్ల వయసులో తనతోపాటు మరో ఇరవై మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో వ్యవసాయాధారిత జీవనాల మధ్య వెలుగుతున్న సాహితిని పలకరిస్తే విజయావకాశాన్ని వంటలతో అందిపుచ్చుకుంటున్నానని వివరిస్తుంది.‘‘నాకు రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం నాకో ఉపాధిని కల్పిస్తుంది అని మాత్రం ఊహించలేదు. బీటెక్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో నాలుగేళ్లు ఉద్యోగం చేశాను. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడంతో ఊరు వచ్చేశాను. ఆ టైమ్‌లో మా అమ్మ కన్యాకుమారి చేసే వంటలను ఆస్వాదిస్తూ ఉండేదాన్ని. ఖాళీ సమయంలో సరదాగా తీసుకున్న వంటల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ పేజీ క్రియేట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఆ పోస్టులకు లైకులు వెల్లువెత్తుతుండేవి. ఒకటి నుంచి మొదలు.. ఓరోజున ఉన్నట్టుండి ఒక ఫాలోవర్ నుంచి ‘మాకు స్వీట్స్ చేసి పంపుతారా’ అంటూ ఒక పోస్ట్ వచ్చింది. కాదనటమెందుకులే, ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అని... ఆ ఆర్డర్ పూర్తిచేసి, కొరియర్ ద్వారా పంపించాం. ఆ తర్వాత మరో రెండు ఆర్డర్లు వచ్చాయి. అలా నెలకు ఒకటి రెండు ఆర్డర్లు రావడం మొదలయింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. నా వంటలకు మంచి డిమాండ్ ఉందని అర్థమైంది. దానినే ఉపాధిగా ఎందుకు చేసుకోకూడదూ అని... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఫుడ్ తయారీనే వ్యాపారంగా ఎంచుకున్నాను. ముందు మా ఇంటివరకే పనులు ఉండేవి. తర్వాత పనులు పెరగడంతో ఊళ్లోనే ఉన్న మా చుట్టుపక్కల మహిళలను ఫుడ్ తయారీకి నియమించుకున్నాం. స్నాక్స్, ఊరగాయలు, స్వీట్లు, మసాలా పొడులతో పాటు మిల్లెట్ ఉత్పత్తులు, ఇన్స్టంట్ మిక్స్‌లు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు నెలకు 30 నుంచి 40 ఆర్డర్లు వస్తున్నాయి.మరో 20 మందికి...పదిహేనేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఒక ఉద్యోగికి వచ్చే ప్యాకేజీని ఇప్పుడు నా వ్యాపారం ద్వారా పొందుతున్నాను. నాతోపాటు మరో 20 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాను. వీరిలో పదిమంది తమ ఇళ్ల నుంచే పచ్చళ్లు, పొడులు, ఇతర పిండి వంటలు తయారు చేసి వాటిని అందంగా ΄్యాక్ చేసి ఇస్తారు. మా ఇంటి మొదటి అంతస్తులోని రెండు గదులను నా కంపెనీ ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’కి కేటాయించుకున్నాను. పదిహేను రకాల పచ్చళ్లు, 40 రకాల పిండి వంటలు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్సర్లు, మసాల పొడులు.. దాదాపు 70 ర కాల వంటకాలు తయారు చేస్తుంటాం. మన దేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ.. దేశాలలో ఉండే మన తెలుగువారికి కొరియర్ ద్వారా పచ్చళ్లు, పొడులు పంపిస్తున్నాను.ఎక్కడా ప్లాన్ లేదు.. ఏ మాత్రం ప్లాన్ లేకుండా నా వ్యాపారం వృద్ధి చెందుతూ వస్తోంది. ఇంట్లో పెట్టిన ఆవకాయతో ఆరంభమైన ఈ బిజినెస్‌లో వచ్చిన ఆర్డర్ల ప్రకారం పెట్టుబడి పెడుతూ, ఆదాయాన్ని పొందుతున్నాను. ఫుడ్ బిజినెస్ కాబట్టి ఏడాది క్రితం లైసెన్స్ కూడా తీసుకున్నాను. మా ఊరికి మరింత పేరుతెచ్చేలా ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ బ్రాండ్ ఉత్పత్తులను విస్తరించాలనుకుంటున్నాను. కానీ, తయారీ మాత్రం మా ఊరి నుంచి, మా ఇంటి నుంచే చేస్తుంటాను.సవాళ్లను అధిగమిస్తూ.. రుచికరమైన వంటకాల తయారీలో పదార్థాలు కూడా అంతే నాణ్యమైనవి ఉండాలి. సరైన శుభ్రత పాటించాలి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను సేకరించడం, వాటిని సమయానుకూలంగా తయారీలో వాడటం పెద్ద సవాల్‌గానే ఉంటోంది. అలాగే, సీజనల్‌గా ఉండే సమస్యల్లో ముఖ్యంగా వర్షాకాలం ΄్యాకింగ్లు తడవడం వంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు తిరిగి రీప్లేస్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. చాలా మందితో డీల్ చేయాలి, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి సహనంతో ఉండాలి. ఈ ప్రయాణం నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘చిన్న అమ్మాయివే కానీ, మా ఇంట్లో బామ్మలు చేసిన వంటకాల రుచి చవి చూస్తున్నాం’ అంటూ మా వంటకాలను రుచి చూసినవారు నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్‌ల ద్వారా ప్రశంసలు తెలియచేస్తుంటారు. నాణ్యత ద్వారా వారి ఆశీస్సులను, అభిమానాన్ని, మద్దతును ఎప్పటికీ అలాగే నిలబెట్టుకుంటాను అంటూ ఆనందంగా వివరిస్తుంది సాహితి.– నిర్మలారెడ్డి -
వైట్ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ డౌన్
ముంబై: ఐటీ–సాఫ్ట్వేర్, టెలికం, విద్యా రంగాల్లో నియామకాలు మందగించిన నేపథ్యంలో అక్టోబర్–నవంబర్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు హైరింగ్ తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. నౌకరీ జాబ్‌స్పీక్ సూచీకి సంబంధించిన నివేదిక ప్రకారం 2022 అక్టోబర్–నవంబర్‌లో 2,781 జాబ్ పోస్టింగ్స్ నమోదు కాగా ఈసారి అదే వ్యవధిలో 2,433 పోస్టింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. నౌకరీడాట్‌కామ్‌లో సంస్థలు పోస్ట్ చేసే ఉద్యోగావకాశాలను బట్టి దేశీయంగా ప్రతి నెలా నియామకాల ధోరణిని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సూచిస్తుంది. మేనేజర్లు, క్లర్కులు, అడ్మిని్రస్టేషన్ సిబ్బంది మొదలైన ఆఫీసు ఆధారిత కొలువులను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► టెలికంలో 18 శాతం, విద్యా రంగంలో 17 శాతం, రిటైలింగ్ రంగంలో 11 శాతం మేర వైట్ కాలర్ నియామకాలు తగ్గాయి. ఆతిథ్య, ట్రావెల్, ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో హైరింగ్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ►ఇంధన కంపెనీలు వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా కొత్త రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటం వంటి సానుకూల పరిణామాలతో ఆయిల్, గ్యాస్ రంగాల్లో హైరింగ్ 9 శాతం పెరిగింది. ►కొత్త ఉద్యోగావకాశాలు ఫార్మా రంగంలో 6 శాతం, బీమా రంగంలో 5 శాతం పెరిగాయి. ►ఐటీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 22 శాతం క్షీణించింది. అయితే అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 1 శాతం మేర పెరిగాయి. ►ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సంబంధ మెషిన్ లెరి్నంగ్ ఇంజినీర్లకు అవకాశాలు 64 శాతం మేర, ఫుల్ స్టాక్ డేటా సైంటిస్టులకు కొత్త ఉద్యోగాలు 16 శాతం మేర పెరిగాయి. ►మెట్రోలతో పోలిస్తే నాన్–మెట్రోల్లోనే ఎక్కువగా హైరింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. వదోదరలో అత్యధికంగా 9 శాతం కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్ నమోదయ్యాయి. ►ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రోల్లో నియామకాలు చెరి 12 శాతం మేర, ఐటీ ప్రధానమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెలో వరుసగా 20 శాతం, 18 శాతం, 21 శాతం, 18 శాతం మేర హైరింగ్ క్షీణించింది. ►2023 ఆసాంతంలో కనిపించిన ట్రెండ్‌కి అనుగుణంగా అక్టోబర్–నవంబర్‌లో కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ వైపే కంపెనీలు మొగ్గు చూపాయి. 16 ఏళ్ల పైబడి అనుభవమున్న సీనియర్ నిపుణుల నియామకాలు 26 శాతం పెరిగాయి. ఫ్రెషర్లకు కొత్త ఆఫర్లు 13 శాతం పడిపోయాయి. -
ఉద్యోగ నియామకాలు డౌన్
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ఆగస్ట్ నెలలో క్షీణత చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీమా, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బీపీవో రంగాల్లో నియామకాల పరంగా అప్రమత్త ధోరణి కనిపించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2,566 ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్‌లు పడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2,828గా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. నౌకరీ సంస్థ తన పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అన్వేషణల డేటా ఆధారంగా ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇక ఈ ఏడాది జూలై నెలలో పోస్టింగ్‌లు 2,573తో పోలిస్తే కనుక ఆగస్ట్‌లో నియామకాలు 4 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాల్లో నియామకాల పట్ల ఆశావహ ధోరణి కనిపించింది. ‘‘ఐటీలోనూ సానుకూల సంకేతలు కనిపించాయి. గడిచిన కొన్ని నెలలుగా ఐటీలో నియామకాలు తగ్గగా, సీక్వెన్షియల్‌గా (జూలైతో పోలిస్తే) ఐటీలో నియామకాలు పెరిగాయి. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నదానికి ఇది ఆరోగ్యకర సంకేతం’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో 33 శాతం డౌన్ ఐటీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోలి్చనప్పుడు, ఈ ఏడాది అదే నెలలో 33 శాతం తక్కువగా నమోదయ్యాయి. బీమా రంగంలో 19 శాతం, ఆటోమొబైల్ రంగంలో 14 శాతం, హెల్త్‌కేర్ రంగంలో 12 శాతం, బీపీవో రంగంలో 10 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాల పరంగా 17 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నియామకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 14 శాతం వృద్ధి కనిపించింది. ఆర్అండ్డీపై దృష్టి పెరగడంతో ఫార్మా రంగంలో 12 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. అహ్మదాబాద్, చెన్నైలో ఎక్కువగా ఫార్మా అవకాశాలు లభించాయి. ఏఐ ఉద్యోగాల్లోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. మెషిన్ లెరి్నంగ్, ఏఐ సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్‌ల ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి.