కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలబడి, నిత్యం ప్రజాసమస్యలపై పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పరిశీలకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పార్టీ నేతలకు సూచించారు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు.