ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్ సీపీ ఇంగ్లీష్ మీడియం అమలును వ్యతిరేకించిందని చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్ మీడియం వద్దని తాను ఎప్పుడైనా చెప్పానా అంటూ ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు. దమ్ముంటే ఆధారాలు చూపాలని అన్నారు. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ-2019 బిల్లుపై గురువారం సభలో చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ...‘ఆంగ్ల మాధ్యమం వద్దని నేను ఎప్పుడైనా చెప్పానా? మీరు నిరూపించగలరా? అయిదేళ్ల అధికారంలో మీరేం చేశారు? అవకాశం ఉండి కూడా మీరు ఇంగ్లీష్ మీడియం అమలు చేయలేకపోయారు. 66 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగుతున్నా.. ఏ చర్యలు తీసుకోనందుకు సిగ్గుతో తలదించుకోవాలి.