జాతీయ వాదం గురించి కాంగ్రెస్ పార్టీకి పాఠాలు చెప్పాల్సిన పని లేదని ఎంపీ శశిథరూర్ అన్నారు. కాంగ్రెస్ ఎల్లప్పుడు కశ్మీర్ పౌరులకు మద్దతుగా నిలబడుతుందని ప్రకటించారు. కశ్మీరీలు మన తోటి పౌరులని గర్వంగా చెబుతామన్నారు. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రస్తుతం లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను నిందించడం సరికాదన్నారు. ఆర్టికల్ 370 రూపకల్పనలో సర్దార్ వల్లభాయ్‌పటేల్ పాత్ర ఉందని వెల్లడించారు.