శ్రీలంకలోని వరుస బాంబు పేలుళ్లు ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. ముష్కరుల ఉన్మాద చర్య కారణంగా వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే నెగొంబోలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిలో సరిగ్గా బాంబు పేలడానికి కొద్ది సమయం ముందు ఓ వ్యక్తి భారీ బ్యాగుతోలోపలికి రావడాన్ని సీసీటీవీ కెమెరాలో పోలీసులు గుర్తించారు.