విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న ఒక్కడే వారం రోజుల పాటు మెతుకు ముట్టలేదని వైఎస్ఆర్ సిపి నాయకురాలు వైఎస్ షర్మిల గుర్తు చేశారు. కల్లూరు జరిగిన వైఎస్ఆర్ సిపి జనభేరి సభలో ఆమె ప్రసంగించారు. రైతులకోసం రోజుల తరబడి నిరాహారదీక్ష చేసింది కూడా జగనేనన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు. చెయ్యని నేరానికి జైలుకు కూడా వెళ్లాడు జగనన్న అని చెప్పారు. జగనన్నకు మీ మొహంలో చిరునవ్వు చూడటమే ముఖ్యం అన్నారు. అలాంటి నాయకుణ్ని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపు ఇచ్చారు. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం అన్నారు. ఈ ఐదేళ్లలో ప్రజా సమస్యలపై స్పందించింది వైఎస్ఆర్ సిపి మాత్రమేనన్నారు.
Apr 23 2014 12:21 PM | Updated on Mar 21 2024 7:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement