‘అయ్యా, మాకు మీరే దిక్కు.. అకాల వర్షాృతో పంటలను పోగొట్టుకున్నాం... అప్పుల పాలయ్యాం... ప్రభుత్వం ఆదుకోకపోతే రోడ్డున పడతాం.. మా పరిస్థితిని అర్థం చేసుకొని పరిహారమిచ్చి ఆదుకోండి’ అంటూ రైతులు కేంద్ర బృందం సభ్యులతో మొరపెట్టుకున్నారు. కేంద్ర బృందం సభ్యులైన సెంట్రల్ జాయింట్ సెక్రటరీ ఉత్పాల్ కుమార్‌సింగ్, సెంట్రల్ ౄయింట్ డెరైక్టర్ దీనానాథ్, నీతి ఆయోగ్ డిప్యూటీ అడ్వైజర్ మానస్ చౌదరిలు మంగళవారం జిల్లాలోని సిద్దిపేట మండలం బక్రిచెప్యాల, నంగునూరు మండలం ముండ్రాయి, సిద్దన్నపేట గ్రామాల్లో పర్యటించారు. మే 3న కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన పంటల వివరాలను సేకరించారు