మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి దిశగా శనివారం రాత్రి చేపట్టిన క్రిటికాలిటీ ప్రక్రియ విజయవంతమైంది. రియాక్టర్ సక్రమంగా పనిచేస్తోందని భారత అణుశక్తి కమిషనర్ నేతృత్వంలోని సాంకేతిక బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కూడంకుళంలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై స్థానికంగా ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో విద్యుత్ కేంద్రంలో భద్రత, ఉత్పత్తి పనుల పరిస్థితిని అంతర్జాతీయ అణుశక్తి క్రమబద్దీకరణ బోర్డు ప్రతినిధులు పరిశీలించారు. విద్యుత్ ఉత్పత్తికి కూడంకుళం అనుకూలంగా ఉందని పేర్కొన్న ప్రతినిధులు విద్యుత్ ఉత్పత్తి పనులకు అనుమతి ఇచ్చారు. దీంతో మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అత్యంత ముఖ్యమైన క్రిటికాలిటీ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో మొదటి యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు అధికారులు వివరించారు.
Jul 15 2013 3:24 PM | Updated on Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement