ఆదివారం సరదాగా బయటికి వెళ్లిన ఓ కుటుంబాన్ని మద్యం మత్తులో కారు నడిపిన ఓ వ్యక్తి చిన్నాభిన్నం చేశాడు. వెనుక నుంచి వచ్చిన కారు వేగంగా ఢీ కొనగా స్కూటీపై ఉన్న కుటుంబం అమాంతం ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. దీంతో తండ్రీకొడుకులు మృత్యువాత పడగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయప డ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీకి చెందిన ఎండీ సాజిద్, రజియా సుల్తానాలకు వాజిద్, ముస్కానా అనే పిల్లలున్నారు. సాజిద్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నడుపుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో కుటుంబంతో కలసి ఎల్‌ఎండీ డ్యాం చూసేందుకు వెళ్లాడు.