ఎస్సీలంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా చులకన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పాలనలో ఎస్సీల అభివృద్ధి గురించి పట్టించుకోకపోగా.. నేతలు, అధికారులు దాడులకు తెగబడుతున్నారన‍్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పల్లమాల గ్రామంలో నిర్వహించిన ఎస్సీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్ ప్రసంగించారు.