ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్‌! | - | Sakshi
Sakshi News home page

ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్‌!

Dec 4 2025 7:26 AM | Updated on Dec 4 2025 7:26 AM

ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్‌!

ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్‌!

మైలవరం : ఏదైనా పరిశ్రమను ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే దాని గురించి ఆ గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చి స్థానికంగా గ్రామ సభ నిర్వహించి పరిశ్రమ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలియజేయాలి. పరిశ్రమపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి వారి అంగీకారం మేరకే పరిశ్రమ ఏర్పాటు చేస్తారు. అయితే మైలవరం మండలం వద్దిరాల, దొడియం గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేయబోయే సోలార్‌ పరిశ్రమపై కూటమి ప్రభుత్వం ఎందుకో ఈ పద్ధతిని పాటించలేదు. స్థానికులకు సమాచారం ఇవ్వకుండానే 1400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏకంగా ఒక కంపెనీకి ఏకపక్షంగా కట్టబెట్టి చివరగా గ్రామ పంచాయతీలో తీర్మానాలను ఆమోదింపజేయాలని పంచాయతీ కార్యదర్శులపై కత్తిపెట్టింది. విధిలేని పరిస్థితుల్లో ఆ ఇరువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సోలార్‌ పరిశ్రమ ఏర్పాటుపై గ్రామ పంచాయతీలలో తీర్మానాలు ప్రవేశపెట్టారు. గ్రామ సభ నిర్వహించకుండానే తాము ఎలా తీర్మానం ఆమోదిస్తామని విజ్ఞులైన ఆ ప్రజా ప్రతినిధులు తీర్మానం తిరస్కరించి వెనక్కి పంపారు. తామేమి పరిశ్రమకు వ్యతిరేకం కాదని అయితే తమ ప్రాంతంలో ఏర్పాటు కాబోయే సోలార్‌ పరిశ్రమ వల్ల తమ గ్రామాల్లో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో, ఎంత మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తారో స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతామని కరాఖండిగా చెప్పి పంపారు.

కొండంతా సోలార్‌ మయమే..

వద్దిరాల, దొడియం గ్రామాల మధ్యలో ఉన్న కొండ ప్రాంతం ఇక్కడి పల్లెల్లోని పేద ప్రజల జీవనానికి ‘‘కొండంత అండగా’’ ఉండేది. అలాంటిది ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొండల్లోని దాదాపు 4వేల ఎకరాల భూమిని మూడు సోలార్‌ కంపెనీలకు కట్టబెట్టింది. ఆయాన్‌, స్ట్రింగ్‌, అదాని కంపెనీలు తమకు కేటాయించిన భూముల చుట్టూ ముళ్ల కంచెవేసి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశాయి. ఇప్పడు కొండలో మిగిలి ఉన్న మరో 14 వందల ఎకరాల భూమిని అల్ట్రా సోలార్‌ కంపెనీకి కేటాయించారు. దీంతో ఈ ప్రాంత పేద ప్రజల జీవనోపాధికి గండి కొట్టడమే కాకుండా కొండంతా పూర్తి సోలార్‌ మయం కానుంది.

వద్దిరాల, దొడియం గ్రామ పంచాయతీల పరిధిలో అధిక భాగం వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ప్రజలే నివసిస్తున్నారు. వీరిలో కూడా యాదవులు అధికం. వీరి కులవృత్తి గొర్రెలను మేపుకోవడం. ఇప్పటికే అధిక శాతం యాదవులు ఈ ప్రాంతంలో గొర్రెలు, మేకలను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడి రైతుల విషయానికి వస్తే వ్యవసాయానికి తోడు పాలిచ్చే గేదెలను పెంచుకుంటున్నారు. ఈ రెండు ప్రాంతాలలో వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, వందల కొద్ది గేదెలు ఉన్నాయి. వీటికి ఈ రెండు గ్రామాల మధ్యలో ఉన్న కొండపైనే మేత దొరుకుతుంది. ఇప్పుడు సోలార్‌ కంపెనీలు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా మూగ జీవాలకు మేత దొరకడం కష్టసాధ్యంగా మారింది. వీరికి ప్రత్యామ్నాయం చూపించకుండానే అధికారులు ఏకపక్షంగా కొండ ప్రాంతాన్ని సోలార్‌ కంపెనీలకు కట్టబెట్టారు. వేల ఎకరాల భూమిని పరిశ్రమలకు కేటాయిస్తున్నప్పుడు కనీసం పశువుల మేతకు అనుకూలమైన 400 నుంచి 500 ఎకరాలైనా వదిలిపెట్టకపోవడం నిజంగా విచారకరం. ఇప్పటికై నా పశువుల మేత కోసం కొంత కొండ ప్రాంతాన్ని వదిలిపెట్టాలని ఇక్కడి ప్రజానీకం ముక్త కంఠంతో కోరుతున్నారు.

సోలార్‌ పరిశ్రమ ఏర్పాటుపై తీర్మానం వ్యతిరేకించిన రెండు గ్రామ పంచాయతీలు

పరిశ్రమ గురించి ప్రజలకు వివరించకుండానే తీర్మానం ఎలా ఆమోదిస్తామని నిలదీత

గ్రామ సభ నిర్వహించి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌

ఇప్పటికే 1400 ఎకరాలు కేటాయించి చివరలో పంచాయతీ తీర్మానం కోరిన సర్కారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement