జాతీయ స్థాయికి ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : చెన్నూరు మండలం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి నాగ చైతన్య గట్కా(కత్తి సాము) ఎస్‌జీఎఫ్ అండర్ –19 బాల బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాఽధించి జాతీయ స్దాయికి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా మహేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్ పోలంకి గణేష్ బాబు తెలిపారు. ఈ నెల 29,30 తేదీలలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్–19 రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. జనవరి నెలలో పంజాబ్‌లోని లూథియానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొంటాడని పేర్కొన్నారు.
వైద్య సిబ్బందిపై దాడి
జమ్మలమడుగు : మండల పరిధిలోని మోరగుడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిపై స్వీపర్ సుజాత బంధువులు దాడి చేశారు. దీంతో ఆసుపత్రి వైద్యాధికారి తస్మియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వీపర్‌గా పనిచేస్తున్న సుజాత సిబ్బంది సంతకాలు చేస్తున్న అటెండెన్సు రిజిస్టర్‌ను మాయం చేసిందని ఆసుపత్రి వైద్యాధికారిణి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే స్వపర్ సుజాత తనను వేధిస్తున్నారంటూ ఇంటికి వెళ్లి రెండు లీటర్ల పెట్రోల్ బాటిల్ తెచ్చుకుని ఆసుపత్రి సిబ్బంది ఎదుట శరీరంపై పోసుకుంది. సిబ్బంది వెంటనే ఆమైపె నీళ్లు పోశారు. దీంతో సుజాత బంధువులు నేరుగా ఆసుపత్రికి వచ్చి రవి, జీవన్ అనే సిబ్బందిపై దాడి చేశారు. ఆపై అసభ్య పదజాలంతో దూషించారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే స్వపర్ బంధువులు మాత్రం గత 20 ఏళ్లుగా స్వపర్‌గా పనిచేస్తున్న ఆమైపె సిబ్బంది వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఇరువురి ఫిర్యాదులను తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
జాతీయ స్థాయికి ఎంపిక


