
రక్తదాన ప్రాధాన్యతను గుర్తించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రతి ఒక్కరూ రక్తదాన ప్రాధాన్యతను గుర్తించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ పిలుపునిచ్చారు.
మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలు ప్రచురించిన రక్త వారోత్సవాల కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న రక్త వారోత్సవాల రెండో వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ, జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ మాట్లాడుతూ 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేబీవీఎస్ వ్యవస్థాపకుడు అశోక్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు కాశి, సురేంద్ర, సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.