
ఎల్‌ఎల్‌బీ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ న్యాయ కళాశాలల విద్యార్థులకు ఎల్‌ఎల్‌బీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారం వైవీయూలోని ఏపీజే అబ్దుల్ కలాం గ్రంథాలయ భవనంలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఆచార్య కె. ఎస్ వి.కృష్ణారావు తనిఖీ చేశారు. పలువురు విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించారు. కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్షల అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు డాక్టర్ లక్ష్మిప్రసాద్, డాక్టర్ ముని కుమారి మాట్లాడుతూ 684 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని 99 గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రం అబ్జర్వర్ డాక్టర్ వి.రామకృష్ణ కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది పి. చంద్రమౌళి పాల్గొన్నారు.