
ఖైదీల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం
కడప అర్బన్ : ఖైదీలు తమ ఆరోగ్యంలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. శనివారం కడప నగర శివార్లలోని కడప కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాన్ని ఆమె జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఖైదీలతో మాట్లాడి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాన్నారు. కారాగారం పరిసరాలను, వంటగదులను, వసతి గదులను, టాయిలెట్లను, రిజిస్టర్‌లను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కారాగారం సూపరింటెండెంట్, ఇన్‌చార్జి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్ రాజేశ్వర్ రావు, ప్రత్యేక మహిళా కారాగారం సూపరింటెండెంట్ కృష్ణవేణి, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, పారా లీగల్ వలంటీర్లు, ఖైదీలు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని