
అశ్రునయనాలతో హవల్దార్‌కు అంత్యక్రియలు
తొండూరు : మండల కేంద్రమైన తొండూరు గ్రామానికి చెందిన హవల్దార్ బూచుపల్లె శివప్రకాష్‌రెడ్డి బుధవారం సాయంత్రం గుండె పోటుతో మరణించిన విషయం తెలిసిందే. గురువారం హవల్దార్ అధికారి శివప్రకాష్‌రెడ్డి మృతదేహం వద్ద సబ్ మేజర్ దిలీప్ పాల్ జాతీయ జెండాను ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రకాష్‌రెడ్డి యూనిఫాం, జాతీయ జెండాను భార్య నాగేశ్వరి, కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం స్మశాన వాటిక వరకు శివప్రకాష్‌రెడ్డి అంతిమ యాత్ర జన సందోహం మధ్య జరిగింది. స్మశాన వాటిక వద్ద గాలిలోకి కాల్పులు జరిపి భారత్ మాతాకీ జై, జై జవాన్, జై కిసాన్, ప్రకాష్‌రెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో మిలటరీ అధికారులు హవల్దార్లు సి.ఎల్.రెడ్డి, ఎన్.కె.ఎస్.హరీష్, మాజీ హవల్దార్‌లు రామమణిరెడ్డి, నరసింహారెడ్డి, ఎన్.కె.శ్రావణ్‌రెడ్డి, ఎస్‌ఐ ఘన మద్దిలేటి, వైఎస్సార్‌సీపీ మండల ఇన్‌చార్జి రవీంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.