
పశువుల పెంపకం కోసం భూములు
మైదుకూరు: భూమిలేని పేదలకు వ్యవసా యం కోసం భూములు ఇచ్చినట్టుగా పశువుల పెంపకం కోసం కూడా అర్హులకు భూములివ్వాలని ప్రణాళిక తయారు చేస్తున్నట్టు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. బుధవారం సాయంత్రం మైదుకూరులోని ఓ కల్యాణ మండపంలో నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పశువుల పెంపకంతో ఆదాయం పొందాలనుకునే వారికి భూములు ఇవ్వాలనే ప్రణాళిక ఉందని.. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా మైదుకూరు నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. ఒక పాలిచ్చే గేదె ఒక ఎకరా భూమితో సమానమని నానుడి ఉన్నట్టు ఒక కుటుంబం ఒక గేదెను పెంచుకుంటే ఒక ఎకరా ద్వారా వచ్చేంత ఆదాయం వస్తుందని కలెక్టర్ అన్నారు. పశువుల పెంపకం కోసం ఎన్‌ఎల్‌ఎఫ్ పథకం ద్వారా బ్యాంకు నుంచి రూ.50లక్షల వరకు రుణం లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఇందు కు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. రైతులు ఉత్సాహవంతులైన యువకులు ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. సమావేశంలో ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్, బద్వేలు, జమ్మలమడుగు ఆర్డీఓలు చంద్రమోహన్, సాయిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ప్రయోగాత్మకంగామైదుకూరులో అమలు
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్