
వన్యప్రాణులను వేటాడుతున్న వ్యక్తి అరెస్టు
మైదుకూరు : మండలంలోని గంగాయపల్లె అటవీ బీట్ పరిధిలో వన్యమృగాలను వేటాడుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్టు వనిపెంట అటవీ రేంజ్ అధికారి ప్రణీత్ రావు బుధవారం తెలిపారు. మండలంలోని జాండ్లవరం గ్రామానికి చెందిన కొందరు కొన్నేళ్లుగా గంగాయపల్లె బీట్‌లో నాటు తుపాకులతో వన్య మృగాలను వేటాడుతున్నారని ఆయన తెలిపారు. వారి కోసం నిఘా ఉంచి మంగళవారం ఓ వ్యక్తిని పట్టుకున్నట్టు పేర్కొన్నారు. అతని వద్ద నుంచి నాటు తుపాకీ, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. నిందితుడిని బుధవారం కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ అన్వర్ హుస్సేన్, ఎఫ్‌బీఓ సురేఖ, ఏబీఓ సునీత పాల్గొన్నారు.