దొంగలున్నారు జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

దొంగలున్నారు జాగ్రత్త!

Jun 26 2025 6:41 AM | Updated on Jun 26 2025 6:41 AM

దొంగల

దొంగలున్నారు జాగ్రత్త!

జమ్మలమడుగు : పట్టణంలోని ప్రొద్దుటూరు రహదారిలో ఉన్న కెనరా బ్యాంకులో దొంగలు తమ హస్త లాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. బుధవారం బ్యాంకులో ఖతాదారులు ఎక్కువ సంఖ్యలో లావాదేవీల కోసం క్యూ కట్టారు. బ్యాంకు చిన్నది కావడం ఖాతాదారులు సంఖ్య ఎక్కువ కావడంతో ఇదే అదనుగా భావించిన కొంత మంది దొంగలు ఖాతాదారుల సెల్‌ ఫోన్లతోపాటు జేబుల్లో ఉన్న నగదుకు కత్తెర పెట్టారు. ఖాతాదారులు పనులు పూర్తి అయిన తర్వాత బ్యాంకు బయటికి వచ్చి ఫోన్లు కనిపించలేదు. బ్యాంకులో మొత్తం గాలించినా ఫలితం కనిపించలేదు. మైలవరం మండలం నార్జాంపల్లి గ్రామానికి చెందిన రైతు రామసుబ్బారెడ్డికి సంబంధించిన కీప్యాడ్‌ కలిగిన సెల్‌ఫోన్‌ పోగా, ఎర్రగుడికి చెందిన రైతు మాబుసా అ జేబులో ఉన్న రెండు వేల నగదు పోయింది. గతంలో మండల పరిధిలోని పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన మహిళ వద్ద నుంచి పది తులాల బంగారాన్ని ఇదే బ్యాంకులో దొంగిలించారు. గతంలో కెనరా బ్యాంక్‌ ఒక్కటే ఉండటంతో ఖాతాదారులు తక్కువ సంఖ్యలో ఉండేవారు. అయితే సిండికేట్‌ బ్యాంక్‌ను కెనరా బ్యాంక్‌లో విలీనం చేయడంతో ఖాతాదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. బ్యాంకు చిన్నదిగా ఉండటం ఖాతాదారులు ఎక్కువ సంఖ్యలో ఉండటం దొంగలకు కలిసి వచ్చింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఖాతాదారులకు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

బైక్‌ను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు

చాపాడు : మండల కేంద్రమైన చాపాడులోని నాలుగు రోడ్లు కూడలిలో బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీ కొన్న సంఘటనలో పల్లె రంగయ్య అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చాపాడు దళితవాడకు చెందిన పల్లె రంగయ్య చియ్యపాడులోని తన సోదరి ఇంటికి వెళ్లి బైక్‌లో రాత్రి 9.20 గంటల ప్రాంతంలో చాపాడుకు వస్తుండగా.. ఇదే క్రమంలో ప్రొద్దుటూరు నుంచి చైన్నెకి వెళుతున్న ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుకుంటున్న రంగయ్యను ప్రమాదవశాత్తు ఢీ కొంది. ఈ ప్రమాదంలో రంగయ్య తలకు తీవ్ర గాయాలు కాగా తీవ్ర రక్త స్రావం అయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చిన్న పెద్దయ్య సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా దీశారు. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు, బైక్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వేడినీళ్లు పడి బాలుడికి గాయాలు

మదనపల్లె రూరల్‌ : వేడినీళ్లు పడి బాలుడు గాయపడిన సంఘటన బుధవారం మండలంలో జరిగింది. వేంపల్లె క్రాస్‌కు చెందిన రవి కుమారుడు మౌనిష్‌ (6) ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదశాత్తు వేడినీళ్లు ఉన్న పాత్రలో పడ్డాడు. ప్రమాదంలో బాలుడికి గాయాలు కాగా గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

జమ్మలమడుగు కెనరా బ్యాంకులో దొంగల హస్త లాఘవం

ఖాతాదారుల సెల్‌ ఫోన్లు, నగదు చోరీ

యువకుడికి తీవ్ర గాయాలు

దొంగలున్నారు జాగ్రత్త!1
1/1

దొంగలున్నారు జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement