
సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నందలూరు : టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 5న ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలు ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు దర్శనం, తాగునీరు, ప్రసాదాలు పంపిణీలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం, డిప్యూటీ ఈఓలు నటేష్‌బాబు, శివప్రసాద్, ప్రశాంతి, డీఎఫ్‌ఓ ఫణికుమార్ నాయుడు, పట్టణీకరణ నిపుణుడు శ్రీరాముడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం