
విద్యాహక్కు చట్టం అమలు చేయాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం డీఈఓ షేక్ షంషుద్దీన్‌ను దళిత మిత్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామాంజనేయులు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసులుతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి అడ్మిషన్లు ఫుల్ అయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఫీజు నియంత్రణ చేయడంలో విద్యాశాఖ విఫలమైందన్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఫీజు నియంత్రణతోపాటు విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.