
గంగమ్మా..చల్లంగా చూడమ్మా..
లక్కిరెడ్డిపల్లి: చల్లంగా చూడమ్మా..గంగమ్మా అంటూ అనంతపురం గంగమ్మను భక్తులు వేడుకున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు.తలనీలాలు అర్పించారు. ఆలయ పూజారులు అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు జరిపారు.పూజల అనంతరం భక్తులక తీర్థప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి
కృషి చేయండి
పులివెందుల రూరల్: పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పని చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తెలిపారు. పట్టణంలోని రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయానికి ఆమె ఆదివారం విచ్చేశారు. కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తూ.. ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులతో మాట్లాడారు. వారితో పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ నాయకులు జోగిరెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి, శశిభూషణ్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, బాషా, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి
సమరశీల పోరాటం
బద్వేల్ అర్బన్ : జిల్లా సమగ్రాభివృద్ధికి సమరశీల పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. స్థానిక ఎన్‌జీవో హోంలో నిర్వహించిన జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బద్వేల్‌లో జరగబోవు సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. 2025 డిసెంబర్ 26 నాటికి సీపీఐ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శత జయంతి ఉత్సవం నిర్వహించుకోబోతోందని అన్నారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు జి.చంద్ర, వీరశేఖర్, అబ్దుల్‌ఖాదర్, మస్తాన్, బాలు, రమణారెడ్డి, పెంచలయ్య, వెంకటశివ, నాగసుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, టి.సుబ్బరాయుడు, జి.వలరాజు, ఎం.వి.సుబ్బారెడ్డి, జి.వేణుగోపాల్, కె.సి.బాదుల్లా, విజయలక్ష్మి, శ్రీరాములు, సుబ్రమణ్యం, పి.వి.రమణ, వెంకటరమణ, ఇమ్మానియేల్ తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మా..చల్లంగా చూడమ్మా..