
ఉత్సవమూర్తులకు చక్రస్నానం
రాజుపాళెం : మండలంలోని వెల్లాల క్షేత్రంలో జరుగుతున్న బ్రహోత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజున శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ, సంజీవరాయ స్వాముల విగ్రహాలను హంస వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వసంతం చల్లుతూ, భజన పాటలు పాడుతూ, నవ ధాన్యాల మొలకలు తీసుకొని కుందూనదికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవ విగ్రహాలకు స్నపనం గావించి చక్రస్నానం చేయించారు. అనంతరం అక్కడకు వచ్చిన భక్తులంతా కుందూ నదిలో స్నానం ఆచరించారు. భక్తులకు వేద పండితులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈఓ వెంకటరమణ, లక్ష్మినారాయణరెడ్డి, రామ్మోహన్, అర్చకులు పాల్గొన్నారు.