
ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలి
కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఖరీఫ్‌కు ఏడీఏలు, ఏవోలు ఖరీఫ్ కార్యాచరణ అమలుకు సమాయత్తం కావాలని జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని వ్యవసాయ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ఏడీఏలు, ఏవోలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొందన్నారు. దీనికి అనుగుణంగా మనం కూడా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీ విత్తనాలను మంజూరు చేసిందన్నారు. దీంతోపాటు ఎరువులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. అలాగే వేరుశనగ కాయలు కూడా మంజూరయ్యాయన్నారు. వీటన్నింటిని రైతులకు సక్రమంగా అందించాలని సూచించారు. విత్తనాల పంపిణీలో ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా అన్ని జాగ్రత్తలను తీసుకోవాలని తెలిపారు. ఏడీఏలు, వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి వారికి పంటలసాగుకు అవసరమైన సలహాలు, సూచనలను అందించి సహకరించాలని చెప్పారు. ఏడీఏలు, వ్యవసాయ అధికారులు డీఏఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు