పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు | Sakshi
Sakshi News home page

పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు

Published Wed, May 29 2024 4:10 PM

పది సప్లిమెంటరీ పరీక్షకు 1073 మంది హాజరు

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన మ్యాథ్స్‌ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 1753 మందికి 1073 మంది విద్యార్థులు హాజరుకాగా 680 మంది గైర్హాజరయారు. రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి మర్రెడ్డి అనురాధ తెలిపారు.

ఆడిట్‌ను వాయిదా వేయాలి

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ఈనెల 29వ తేదీ జరిగే స్కూల్‌ కాంపోజిట్‌ గ్రాంట్స్‌ అడిట్‌ను వాయిదా వేయాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్‌, పాలెం మహేష్‌బాబు డీఈఓ అనురాధను కోరారు. ఈ విషయమై మంగళవారం డీఈఓకు వినతిపత్రాన్ని సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పదోతగరతి సప్లిమెంటరీ పరీక్షలు, జూన్‌ 4వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికల కౌటింగ్‌కు సంబంధించి మే 29వ తేదీన ప్రధానోపాధ్యాయులకు శిక్షణా తరగతులను దృష్టిలో ఉంచుకుని ఆడిట్‌ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని కోరారు. పై రెండు కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు పాల్గొనాల్సి ఉన్నందున అడిట్‌కు హాజరుకావడం సాధ్యం కాదన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శి సీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లాలో 1నుంచి

కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు

రాయచోటి టౌన్‌: అన్నమయ్య జిల్లాలో జూన్‌ 1వ తేది నుంచి కొత్త ట్రాఫిక్‌ నిబంధనలు అమల్లోకి వస్తాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన రోజు నుంచి వాహనాలను మైనర్లు నడిపితే అందుకు తల్లిదండ్రులకు కానీ సంరక్షలకు కానీరూ.25 వేల జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేల జరిమానాతో పాటు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తామన్నారు.

సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

వైవీయూ: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల బీఏ, బీబీఏ, బీకాం, బీఎస్సీ ఆరో సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య చింతా సుధాకర్‌ విడుదల చేశారు. మంగళవారం విశ్వవిద్యాలయంలోని తన చాంబర్‌ లో వైవీయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వైపీ వెంకటసుబ్బయ్య, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. ఈశ్వర్‌ రెడ్డి తో కలిసి పరీక్ష ఫలితాల గణాంకాలను పరిశీలించి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ బీఏలో 658 మంది విద్యార్థులు పరీక్షలు రాయిగా అందరూ ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. బీబీఏలో 249 మంది పరీక్షలకు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాధించారన్నారు. బీకాంలో 4,012 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,947 మంది (98.38 శాతం) ఉత్తీర్ణత పొందారన్నారు. బీఎస్సీలో 3,721 మంది పరీక్షలు రాయగా 3,681 మంది (98.93 శాతం) ఉత్తీర్ణులు అయ్యారని వివరించారు. డిగ్రీ పరీక్షలు గత నెలలో మొదలై ఈనెల 24వ తేదీ వరకు జరిగాయని తెలిపారు.కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ సహాయ అధికారి డాక్టర్‌ గంగయ్య పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్‌

కార్యక్రమం పరిశీలన

రాయచోటి అర్బన్‌ : అన్నమయ్య జిల్లాలో హజ్‌యాత్రికులకు జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ కొండయ్య వైద్యశాఖ అధికారులతో కలసి పరిశీలించారు. పట్టణంలోని వాల్మీకివీధి అర్బన్‌ పీహెచ్‌సిలో జరుగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆయన డీపీఎంఓ రియాజ్‌బేగ్‌, డీఐఓ ఉషశ్రీ, డీఎన్‌ఎంఓ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం హాజ్‌ యాత్రికులకు వ్యాక్సినేషన్‌ క్యాంపులను నిర్వహించామన్నారు. కాగా ప్రైవేటుగా హాజ్‌యాత్రకు వెళ్లేవారికి కూడా వ్యాక్సిన్‌ వేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు యిచ్చిందన్నారు. ఆమేరకు వారికోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. శిబిరా న్ని ఉదయం 9 నుండి సాయంత్రం 4గంటల వరకు నిర్వహిస్తామన్నారు. వ్యాక్సినేషన్‌ అనంతరం వారికి వ్యాక్సి నేటెడ్‌ సర్టిఫికెట్‌లను ప్రదానం చేస్తామని వివరించారు. హాజ్‌యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు సునీత, అల్తాఫ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement