కడప ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్‌కు సంబంధించి ప్రథమ, ద్వితీయ పరీక్షలు బుధవారం ముగిశాయి. వైఎస్సార్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 92 పరీక్షా కేంద్రాల్లో రసాయన, వాణిజ్యశాస్త్రం, ఒకోషనల్ పరీక్షలకు 21,471 మంది విద్యార్థులకుగాను 20,625 మంది హాజరయ్యారు. 846 మంది గైర్హాజరయారు. వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో నలుగురు, పులివెందులలో ఇద్దరు, అన్నమయ్య జిల్లా రాయచోటిలో నలుగురు, లక్కిరెడ్డిపల్లెలో ఒకరి చొప్పున విద్యార్థులను డీబార్ చేసినట్లు ఆర్‌ఐవో రమణరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 12 రోజులపాటు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా సాగాయన్నారు. ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టర్, ఆర్టీసీ, విద్యుత్ అధికారులు, పోలీసులకు ఆర్‌ఐవో ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 31,ఏప్రిల్ 1,3,4 తేదీల్లో ఓకేషనల్, బ్రిడ్జి కోర్సులకు సంబంధించి 13 పరీక్షా కేంద్రాల్లో మాత్రమే పరీక్షలు జరగనున్నట్లు ఆయన తెలిపారు.
● చివరి రోజు 846 మంది గైర్హాజర్
● ఉమ్మడి జిల్లాలో 11 మంది డీబార్