కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరు
సూర్యాపేట : కాంగ్రెస్ మంత్రులు స్పృహలో లేరని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తెలంగాణ ప్రజలను అవమాన పరిచేలా మాట్లాడిన వ్యాఖ్యలపై పది రోజుల తర్వాత తెలంగాణ మంత్రులు స్పందించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు వాటర్ లో నీళ్లు కలుపుకొని స్పృహ కోల్పోతున్నారని, మరికొందరు కమిషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉంటున్నారని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తామెప్పుడూ ప్రాంతాలను దూషించలేదని, అన్నదమ్ములుగా విడిపోయి వేర్వేరుగా కలిసి బతుకుదామని కేసీఆర్ అనాడే చెప్పారని పేర్కొన్నారు. ఇప్పటికై నా పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. అంతే కానీ సినిమాలు ఆపుతామని ఇక్కడి మంత్రి కామెడీగా మాట్లాడుతున్నారని, వాస్తవానికి అభిమానం వేరు.. రాజకీయం వేరన్నారు. తమ అభిమాన హీరోగా జనం ఎవరి సినిమాలైనా ఆదరిస్తారని పేర్కొన్నారు.
ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి


