ఎక్కడిదక్కడే!
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సాక్షి, యాదాద్రి : జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) జిల్లా పరిధిలోని బ్లాక్ స్పాట్ల వద్ద చేపట్టిన ఆరు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. అండర్‌పాస్‌లతో కూడిన వీటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టులో ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్– వరంగల్ హైవే–163పై నాలుగు చోట్ల ఫ్లై ఓవర్లు మంజూరు కాగా మూడు చోట్ల పనులు జరుగుతుండగా, ఒకచోట టెండర్ల దశలోనే ఉంది. పనులు ప్రారంభించిన నాటి నుంచి పద్దెనిమిది నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉన్నా ఏడాది గడిచినా రెండు చోట్ల నెమ్మదిగా మిగతా రెండు చోట్ల అంతంత మాత్రంగా నిర్మాణాలు సాగుతున్నాయి.
ఫ్లై ఓవర్‌లు ఎక్కడెక్కడంటే..
హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారి–165పై యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, భువనగిరి మున్సిపల్ పరిధిలోని సింగన్నగూడెం, బీబీనగర్ ఎయిమ్స్, బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద ఆరు వరుసల్లో అండర్ పాసులతో కూడిన నాలుగు ఫ్లై ఓవర్‌లు మంజూరయ్యారు.
కొండమడుగు మెట్టు వద్ద పనులు వేగం
బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టు వద్ద గతనెలలో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు కొనసాగుతున్నాయి. ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ను 1,200 మీటర్ల పొడవునా నిర్మించనున్నారు. ఇప్పటికే పనులు ప్రారంభం కాగా డైవర్షన్ రోడ్లను ఏర్పాటు చేసి సర్వీస్ రోడ్డులో రాకపోకలను అనుమతించారు.
వంగపల్లి వద్ద కాంక్రీట్ పనులు పూర్తి
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఫ్లైఓవర్ పనులు పూర్తి కావొచ్చాయి. ఇక్కడ రూ.15 కోట్ల అంచనా వ్యయంతో గతేడాది ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. ఆరు వరుసలతో కాంక్రీట్ పనులు పూర్తికాగా, మట్టి పనులు పూర్తి కావొస్తున్నాయి. దీనితోపాటు స్థానిక రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే మార్గాలు, గ్రామాల మధ్య ప్రమాద రహిత ప్రయాణం కోసం అధికారులు డీపీఆర్‌లు రూపొందించి ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. వీటి పనులు పద్దెనిమిది నెలల్లో పూర్తి కావాల్సి ఉంది. అలాగే భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని సింగన్నగడెం వద్ద ఫ్లై ఓవర్ పనులు నెమ్మదిగా కొనసాగుతుండడంతో నిర్ణీత 18 నెలల గడువులోగా పూర్తి అవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాది గడిచినా..


