నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
భువనగిరి : రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను మంగళవారం భువనగిరి మండలం అనంతారం క్లస్టర్ సెంటర్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకరాలు, ఐఏఎస్ అధికారి గోతమి పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందిని అడిగి నామినేషన్ల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె వెంట సిబ్బంది ఉన్నారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
మోటకొండూర్ : పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో క్లస్టర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నామినేషన్ స్వీకరణపై ఆర్‌ఓలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఇందిర, తహసీల్దార్ నాగదివ్య, చొల్లేటి శ్రావణ్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు మోర బాలగంగాధర్‌రెడ్డి, ఎండీ గఫార్, శ్రీకాంత్‌రెడ్డి, రాజగోపాల్, చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, జ్యోతి, మహేష్‌రెడ్డి పాల్గొన్నారు.
రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్ల ఎంపిక
నల్లగొండ టూటౌన్ : ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ –16 బాలుర క్రికెట్ జట్ల ఎంపిక ఈనెల 4వ తేదీన నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించబడునని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అమీనొద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న జట్లతో లీగ్ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనభర్చిన వారిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. 01–09–2009 నుంచి 31–08–2011 మధ్య జన్మించిన వారు, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9885717996, 6303430756 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.
వైభవంగా నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తి గట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణం జరిపారు. శ్రీస్వామి వారిని గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, పణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన


