భూభారతి అర్జీలను పరిష్కరించాలి
భువనగిరి : భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం బీబీనగర్ తహసీల్దార్ కార్యాలయంలో భూభారతిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి మాట్లాడారు. సాదాబైనామా దరఖాస్తులను చిన్నచిన్న కారణాలతో రిజెక్ట్ చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులుగా నిర్ధారించి పరిష్కారం చూపాలన్నారు. అనంతరం పెండింగ్ దరఖాస్తుల వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యాంసుందర్, డీటీ భగత్ ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు


