సర్పంచ్‌లకు 110.. వార్డు సభ్యులకు 166
సాక్షి,యాదాద్రి: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మలిదశలోకి ప్రవేశించింది. ఇప్పటికే మొదటి విడత సజావుగా పూర్తికాగా.. ఆదివారం నుంచి రెండో విడత నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఆదివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేశారు. రెండో విడతలో భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, బీబీనగర్, వలిగొండ, రామన్నపేట మండలాల్లోని 150 పంచాయతీలు, 1,332 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల స్వీకరణకు 46 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఈనెల 2వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. మొదటి రోజు సర్పంచ్ స్థానాలకు 110, వార్డులకు 166 నామినేషన్లు దాఖలయ్యాయి.
ఆలస్యంగా ప్రారంభం..
నామినేషన్ల ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. నామినేషన్ల పత్రాలకు జతపర్చాల్సిన సర్టిఫికెట్లు, బ్యాంకు అకౌంట్లు అందడం జాప్యం కావడంతో మధ్యాహ్నం తర్వాత ప్రారంభమై నాలుగు గంటల తర్వాత ఊపందుకున్నాయి. సోమ, మంగళవారాల్లో నామినేషన్లు భారీగా దాఖలయ్యే వకాశం ఉంది. వలిగొండ, రామన్నపేట, ఇంద్రపాలనగరం తదితర గ్రామాల్లో నామినేషన్లను కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు.
తొలి విడుత ఎన్నికలు జరిగే స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో ఒకటి తిరస్కరణకు గురైంది. తుర్కపల్లి మండలంలోని ఓ పంచాయతీ జనరల్ కావడంతో భార్యాభర్తలు ఇద్దరూ నామినేషన్ వేశారు. భార్య నామినేషన్‌న సరిగా నింపకపోవడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వార్డు సభ్యుల నామినేషన్లు తుర్కపల్లి మండలంలో 9, ఆత్మకూర్(ఎం) 2, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో ఒక్కోటి చొప్పున తిరస్కరణకు గురయ్యాయి.
రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఫ తొలి రోజు తక్కువగా దాఖలు
ఫ నేడు, రేపు రెట్టింపు సంఖ్యలో
పడే అవకాశం
సర్పంచ్ స్థానాలకు దాఖలైన నామినేషన్లు
మండలం జీపీలు నామినేషన్లు
పోచంపల్లి 21 15
భువనగిరి 34 31
బీబీనగర్ 34 24
వలిగొండ 37 17
రామన్నపేట 24 23
మొత్తం 150 110
వార్డు సభ్యులకు..
పోచంపల్లి 192 24
భువనగిరి 294 64
బీబీనగర్ 284 53
వలిగొండ 330 14
రామన్నపేట 232 11
మొత్తం 1,332 166


