పట్టణదారి.. నరకంగా మారి
ప్రశాంత్‌నగర్, చెక్‌పోస్టు ప్రాంతా ల్లో పైప్‌లైన్ వేయడానికి రోడ్లను తవ్వి వదిలేశారు. అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపై కంకర, మట్టి పెల్లలు అదే విధంగా ఉండటంతో వాహనదారులు కింద పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేయాలి. –బుచ్చిబాబు, ప్రశాంత్‌నగర్
యాదగిరిగుట్ట: అత్యవసరం పేరుతో చేపడుతున్న రోడ్ల తవ్వకాలతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. తిరిగి మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలు సాగించేందుకు నానా యాతన పడుతున్నారు.యాదగిరిగుట్టలో అమృత్ 2.0 స్కీం కింద తాగునీటి పైప్‌లైన్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్తగుండ్లపల్లిలోని చెక్‌పోస్టు వద్ద నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంకులకు నీటిని సరఫరా చేసేందుకు ప్రశాంత్‌నగర్, చెక్‌పోస్టు ప్రాంతాల్లో 10 కిలో మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. ఇందులో 2 కిలో మీటర్లకు పైగా నివాస గృహాల ముందు నుంచి పైప్‌లైన్ వేశారు. రోడ్లను తవ్విన కాంట్రాక్టర్లు తిరిగి మరమ్మతులు చేపట్టలేదు. సిమెంట్, కంకర తొలగించకుండా ఎక్కడికక్కడ వదిలేయడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఫ గుట్టలో భగీరథ పైపులైన్ల కోసం తవ్వకాలు
ఫ మరమ్మతులకు దిక్కులేదు
పట్టణదారి.. నరకంగా మారి
పట్టణదారి.. నరకంగా మారి


