ఉత్సాహంగా దివ్యాంగుల క్రీడలు
భువనగిరి: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శనివారం భువనగిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో సీ్త్ర శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్–18, అంతకు పైబడిన దివ్యాంగులకు పరుగు పందెం, షాట్‌పుట్, క్యారమ్స్, చెస్‌లో పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.అంతకుముందు క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహరావు, యువజన, క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు క్రీడా పోటీలు దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల అసోసియేషన్ సభ్యులు, పీడీలు, పీఈటీలు, సిబ్బంది పాల్గొన్నారు.


