12 హామీలతో సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో
వలిగొండ : వలిగొండ మండలం పహిల్వాన్‌పురం సర్పంచ్ అభ్యర్థి పచిమట్ల రేణుకామల్లేష్ 12 హామీలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను గ్రామ సోషల్ మీడియా గ్రూప్‌లో వెల్లడించారు. తనను గెలిపిస్తే హామీలన్నీ నెరవేర్చి, పారదర్శక పాలన అందిస్తానన్నారు. డబ్బుకు అమ్ముడుపోకుండా ఊరిభవిష్యత్ కోసం తనను ఆశీర్వదించాలని గ్రామస్తులను కోరారు.
హామీలు ఇవీ..
● గ్రామ సమస్యలపై ప్రతివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాల బలోపేతం, ప్రతి వార్డుకు అభివృద్ధి కమిటీ, గ్రామంలో గొడవలకు తావులేకుండా శాంతి కమిటీ ఏర్పాటు, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు, వీధివీధినా విద్యుత్ దీపాలు, కోసి టీవీలు, డిజిటల్ కనెక్షన్ ఏర్పాటు, ప్రతి వార్డుకు రోడ్లు, గ్రామ చెరువును మినీ రిజర్వాయర్‌గా మార్పు, అర్హులందరికీ ఆసరా పింఛన్లు, ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు ఇళ్లు మంజూరు చేయించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. పదవీ కాలంలో తప్పులు చేసినట్లు రుజువువైతే మీరు వేసే శిక్షకు సిద్ధమన్నారు.


