భక్తుల లెక్క పకా్కగా..
యాదగిరిగుట్ట: యాదగిరీశుడి సన్నిధికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి రోజూ పక్కాగా తేలుతోంది. ఇందుకోసం దేవస్థానం అధికారులు వినియోగిస్తున్న హెడ్‌కౌంట్ కెమెరాలు సత్ఫలితమిస్తున్నాయి. వీటిని ప్రధానాలయ తూర్పు పంచతల రాజగోపురం ముందుభాగంతో పాటు ఆళ్వార్ పిల్లర్, మహాద్వారం ఎంట్రీ, పశ్చిమ ద్వారం వద్ద అమర్చారు.
గతంలో ఈ విధంగా అంచనా వేసేవారు
గతంలో భక్తుల సంఖ్యను లెక్కగట్టడానికి వివిధ పద్ధతులు అనుసరించేవారు. దర్శనం టికెట్‌లు, లడ్డూల విక్రయం, పార్కింగ్ చేసిన వాహనాలు, ఘాట్ రోడ్డు వద్ద వాహన రుసుము, ప్రొటోకాల్ లిస్ట్, ఉచిత బస్సులు, ఆటోల్లో ప్రయాణం చేసిన భక్తులు.. తదితర వాటి ఆధారంగా అంచనాకు వచ్చేశారు. దీని వల్ల కచ్చితత్వం ఉండేది కాదు. పునర్నిర్మాణం తరువాత ఆలయానికి భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. సాధారణ రోజుల్లో సగటున 30 వేలు, వారాంతంలో 45 వేల వరకు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు, కార్తీకమాసం, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం వంటి ప్రత్యేక రోజుల్లో 70 వేల నుంచి లక్ష మంది వరకు వస్తున్నారు. ప్రతి ఒక్కరినీ లెక్కేసి ఎంత మంది స్వామివారిని దర్శించుకున్నారో సులువుగా తెలుసుకునేందుకు హెడ్‌కౌంట్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు.
స్వామివారిని దర్శించుకున్న
ప్రతి ఒక్కరూ లెక్కలోకి..
భక్తులు ఆలయ తూర్పు పంచతల రాజగోపురం నుంచి త్రితల రాజగోపురం మీదుగా ప్రధానాలయంలోకి వెళ్లి స్వయంభూలను దర్శించుకుంటారు. అక్కడి నుంచి పశ్చిమ పంచతల రాజగోపురం మీదుగా సప్తతల రాజగోపురం నుంచి బయటకు వెళ్తారు. ధర్మదర్శనం, రూ.150 టికెట్ దర్శనాలతో పాటు వీఐపీలు తప్పనిసరిగా తూర్పుగోపురం గుండా వెళ్లాల్సి ఉంటుంది. కాగా తూర్పు పంచతల రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ హెడ్‌కౌంట్ కెమెరా.. స్వామివారిని దర్శించుకొని వచ్చే ప్రతి భక్తుడిని లెక్కిస్తుంది. ఎన్ని వేల మంది వచ్చినా అందరినీ క్యాప్చర్ చేసి నమోదు చేస్తుంది. ఈ సమాచారాన్ని ఆఫ్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా కంట్రోల్ కమాండ్ రూంలోని కంప్యూటర్‌లోకి సమాచారం చేరవేస్తోంది. ఈ సమాచారం మేరకు భక్తుల సంఖ్యను ఆలయ అధికారులు వెల్లడిస్తారు. దీంతో పాటు ఆళ్వార్ పిల్లర్, మహాద్వారం, పశ్చిమ ద్వారం వద్ద హెడ్ కెమెరాలను అమర్చారు.
గుట్టలో భక్తుల నమోదుకు హెడ్‌కౌంట్ కెమెరాలు
ఫ రెండున్నర ఏళ్ల క్రితమే ఏర్పాటు
ఫ ఇటీవల అందుబాటులోకి ..
భక్తుల లెక్క పకా్కగా..


