
మోత్కూరు పాఠశాలలో 150 అడ్మిషన్లు
మోత్కూరు: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు గణనీయంగా నమోదవుతున్నాయి. మోత్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 151 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. గురువారం నార్కట్‌పల్లిలోని ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు తీపిరెడ్డి గోపాల్‌రెడ్డి అడ్మిషన్లు ఇచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను, విద్యార్థులను కలిసి అవగాహన కల్పించారని, ఫలితంగా పాఠశాలలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు పెరిగినట్లు ఎంఈఓ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి పాఠశాలకు మంచి పేరు తెస్తామన్నారు.